ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
కోవిడ్ నియంత్రణలో మరో మైలురాయి దాటిన భారత్
85 రోజుల తరువాత మొదటి సారిగా చికిత్సలో ఉన్నవారు 6 లక్షల లోపు
పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారు 7.35 శాతమే
Posted On:
30 OCT 2020 11:13AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ మరోమైలు రాయి దాటింది, చికిత్సపొందుతూ ఉన్నవారు సంఖ్య దాదాపు మూడు నెలల (85 రోజుల) తరువాత మొదటిసారిగా 6 లక్షల లోపుకు పడిపోయింది.ఈ రోజు భారత్ లో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితుల సంఖ్య ఆగస్టు 6న 5.94 లక్షలుగా నమోదైంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారు మొత్తం కోవిడ్ పాజిటివ్ కేసులలో 7.35% కి తగ్గింది. దేశంలో ఇప్పుడు మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 5,94,386. ఇది క్రమంగా తగ్గుతున్న ధోరణి కనబరుస్తోంది.

చికిత్స పొందుతూ ఉన్నకోవిడ్ బాధితుల సంఖ్య ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంది. దాన్ని బట్టి అక్కడ తీసుకుంటున్న చర్యలు, కోవిడ్ మీద పోరాటంలో సాధిస్తున్న ప్రగతిని అంచనావేయవచ్చు.

భారత్ లో కోలుకుంటున్నవారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. కోలుకున్న మొత్తం బాధితుల సంఖ్య 73,73,375 కి చేరింది. ప్రపంచవ్యాప్తంగా చూసినా, భారత్ లో కోలుకున్నవారు గరిష్ఠంగా ఉన్నారు. కోలుకున్నవారికీ, చికిత్సలో ఉన్నవారికీ మధ్య అంతరం కూడా క్రమంగా పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం అది 67,78,989 కి చేరింది. గత 24 గంటలలో 57,386 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు. అదే సమయంలో 48.648 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోలుకుంటున్న వారి శాతం 91.15 శాతానికి చేరింది.
తాజాగా కోలుకున్నవారిలో 80% మంది కేవలం పది రాష్టాల్లోనే నమోదయ్యారు. అందులో గరిష్ఠంగా ఒకే రోజులో మహారాష్ట లో 8,000 మందికి పైగా ఉండగా, కర్నాటకలో 7,000 మందికి పైగా కోలుకున్నారు.

గడిచిన 24 గంటలలో కొత్తగా పాజిటివ్ కేసులుగా నమోదైనవారు 48,648 మంది కాగా వారిలో 78% మంది కేవలం పది రాష్టాలవారే ఉన్నారు. కేరళలో ఇప్పటికీ ఇంకా ఎక్కువగానే పాజిటివ్ కేసులు నమోదవుతూ ఉన్నాయి. నిన్న 7,000 కు పైగా కొత్త కేసులు రాగా మహారాష్ట, ఢిల్లీ లో ఐదేసి వేలకు పైగా కేసులు వచ్చాయి.

గత 24 గంటలలో 563 మంది కోవిడ్ బాధితులు చనిపోయారు. వారిలో 81 శాతం మంది 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. మహారాష్ట్రలో అత్యధికంగా ఒకే రోజు 156 మంది చనిపోగా, 61 మరణాలతో పశ్చిమబెంగాల్ ఆ తరువాత స్థానంలో ఉంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన విధంగా ప్రతిరోజూ ప్రతి పది లక్షల జనాభాకు సగటున 140 చొప్పున పరీక్షలు జరపటంలో భారత్ సమర్థంగా వ్యవహరించింది. సమగ్రమైన నిఘా, అనుమాఇతులకు పరీక్షలు జరపటం మీద ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక నోట్ పంపింది. అందుకు అనుగుణంగా భారత్ నడుచుకుంది. 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరపటం కూడా గమనార్హం. జాతీయ స్థాయిలో సగటున రోజుకు ప్రతి పదిలక్షల జనాభాలో 844 మందికి పరీక్షలు చేయగలిగాం. అదే ఢిల్లీ, కేరళ రాష్టాల విషయానికొస్తే, పరీక్షల సంఖ్య 3000 దాటింది.

*****
(Release ID: 1668805)
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam