ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

దేశ ప్రజలకు మిలాద్‌-ఉన్‌-నబి శుభాకాంక్షలు తెలిపిన ఉపరాష్ట్రపతి

Posted On: 29 OCT 2020 2:21PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ ఎం.వెంకయ్యనాయుడు, దేశ ప్రజలకు మిలాద్‌-ఉన్‌-నబి శుభాకాంక్షలు తెలిపారు. పండుగ సంబరాల్లో కొవిడ్ సంబంధిత జాగ్రత్తలు మరిచిపోవద్దని సూచించారు.

ఉప రాష్ట్రపతి సందేశం: 

    "మొహమ్మద్‌ ప్రవక్త జన్మదినోత్సవాన్ని మిలాద్‌-ఉన్‌-నబి పండుగ రూపంలో జరుపుకుంటున్న దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు".

    "మానవత్వం, నిజవర్తనం, విశ్వమానవ సోదరభావాన్ని మొహమ్మద్‌ ప్రవక్త ప్రబోధించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు ఒకచోటుకి చేరి ప్రార్థనలు చేసే సమయం ఇది. కానీ ఈ ఏడాది కొవిడ్‌ కారణంగా, ఆరోగ్యపరమైన జాగ్రత్తలు తీసుకుంటూ పండుగ జరుపుకోవాలని సహోదర భారతీయులకు నా విజ్ఞప్తి. శాంతియుత, సామరస్య సమాజ నిర్మాణంలో మొహమ్మద్‌ ప్రవక్త సందేశం మనకు మార్గదర్శనం చేస్తుంది".

***



(Release ID: 1668680) Visitor Counter : 145