ప్రధాన మంత్రి కార్యాలయం
పీఎం స్వనిధి పథకం లబ్ధిదారులతో సంభాషించిన ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
Posted On:
27 OCT 2020 1:29PM by PIB Hyderabad
ఇప్పుడే నేను ప్రధాన్ మంత్రి స్వనిధి యోజన లబ్ధిదారులందరితో మాట్లాడుతున్నప్పుడు, అందరూ సంతోషంగా ఉన్నారని, ఆశ్చర్యం గానూ ఉన్నారని నేను గ్రహించాను. గతంలో రుణాల కోసం బ్యాంకులను సంప్రదించడమనేది ఇదివరకు జీతం అందుకొనే వ్యక్తులకు కూడా కష్టంహగా ఉండేది; ఇక పేదలు, వీధుల లో తిరుగుతూ వస్తువులను అమ్ముకొనేవారు అయితే బ్యాంకుకు వెళ్ళాలనే ఆలోచన అయినా చేయలేని పరిస్థితి ఉండేది కానీ, ఇప్పుడు బ్యాంకులు ప్రజల ముంగిటకు వస్తూ, వారు వారి యొక్క వ్యాపారాలను ఆరంభించుకోవడానికి రుణాలను అందించడానికి సాయపడుతున్నాయి. ఎలాంటి ఉరుకులు-పరుగులు లేకుండా మీ పనిని ప్రారంభించడానికి రుణం అందుతోంది. మీ అందరి ముఖాలలోనూ ఈ ఆనందం చూసి నేను కూడా చాలా సంతృప్తిచెందాను. మీ పని కోసం స్వయం సమృద్ధితో ముందుకు సాగినందుకు, ఉత్తర ప్రదేశ్ మరియు దేశాన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లడానికి మీరు చేస్తోన్న ప్రయత్నాలకు అన్ని విధాలా శుభాకాంక్షలు.
ఈ రోజు నేను మీ అందరితో మాట్లాడుతున్నప్పుడు ! గమనించింది ఏమిటంటే ఎక్కువగా చదువుకోకపోయినా , సాధారణ పేదరికంలో జీవిస్తున్న మన సోదరి ప్రీతి చాలా నమ్మకంతో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారని నేను గమనించాను. ఆమె తన వ్యాపారాన్ని మరింతగా పెంచుకోవడానికి కృషి చేస్తోంది. మరియు మొత్తం కుటుంబాన్ని కూడా చూసుకుంటుంది. అదే విధంగా, నేను బనారస్‌లోని నా సోదరుడితో మాట్లాడుతున్నప్పుడు అరవింద్జీ నాకు చెప్పిన ఒక విషయం ఖచ్చితంగా నేర్చుకోతగినది . మరియు దేశంలోని విద్యావంతులు కూడా దీనిని నేర్చుకుంటారని నేను నమ్ముతున్నాను. అతను సామాజిక దూరానికి సంబంధించి మీరు నియమాలను పాటిస్తే తాను తయారుచేసే వాటిలో ఒకదాన్ని బహుమతిగా, ఉచితంగా ఇస్తున్నాడు. . ఒక చిన్న వ్యక్తి ఎంత పెద్ద పని చేస్తున్నాడో చూడండి. ఇంతకన్నా ఎక్కువ ప్రేరణ ఏముంటుంది ? మరియు మనం లక్నోలోని విజయ్ బహదూర్ తో మాట్లాడుతున్నప్పుడు, అతను ఓ చిన్న దుకాణం(బండి) నడుపుతున్నాడు. కానీ వారి వ్యాపార నమూనాను చూడండి, సమయాన్ని ఆదా చేస్తూ ఎక్కువ పని చేయడం. ఇది మన దేశ బలం . అలాంటి వారి ద్వారానే దేశం ముందుకు సాగుతోంది. అలాంటి వారి కృషి వల్ల దేశం ముందుకు సాగుతోందని నేను ఖచ్చితంగా చెబుతాను.
దీనికి మన వీధి వ్యాపారులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నాకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. అయితే మొదట నేను మన బ్యాంకులకీ, మన బ్యాంకు ఉద్యోగులందరికి క్రెడిట్ ఇస్తాను. బ్యాంక్ సిబ్బంది సేవా స్ఫూర్తి లేకుండా, ఇంత పెద్ద పని ఇంత తక్కువ సమయంలో పూర్తి కాదు. ఈ రోజు బ్యాంకుల ఉద్యోగులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. పేదల గురించి వారి మనస్సులలో ఆలోచన వచ్చినప్పుడు వారి కోసం పనిచేసే ఉత్సాహం కూడా అనేక రెట్లు పెరుగుతుంది ఈ పేదలందరి ఆశీస్సులు మరియు శుభాకాంక్షలు బ్యాంకు ప్రజలకు చేరాలని నా కోరిక, వారు మీ జీవితాన్ని తిరిగి పునరుద్ధరించడానికి కృషి చేశారు, అందువల్ల మీ అన్ని దీవెనలు, బ్యాంకు ఉద్యోగులందరికి చెందుతాయి . మా కృషి వల్ల పేదల పండుగల్లో కూడా వెలుగు వెలిగింది. ఇది ఒక గొప్ప పని. బ్యాంకర్ల ప్రయత్నాలు పేద ప్రజలు పండుగలను జరుపుకోవడంలో సహాయకారిగా ఉంటాయి. ఈ కార్యక్రమంలో ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారు నాతో చేరడం, యుపి ప్రభుత్వంలోని ఇతర మంత్రులు, యుపిలోని అన్ని జిల్లాల లో ఉన్న స్వనిధి యోజన వేలాది మంది లబ్ధిదారులు, , బ్యాంకు ఉన్నతాధికారులు మరియు నా ప్రియమైన సోదరసోదరీమణులారా ,ఈ రోజున ‘ఆత్మ నిర్భర్ భారత్’ కు ఒక ముఖ్యమైన రోజు, ఇది వీధుల్లో తిరుగుతూ వస్తువులను అమ్ముకొనే వారిని గౌరవించుకొనే రోజు. స్వయంసమృద్ధియుత భారతదేశం కోసం వారు అందిస్తున్న తోడ్పాటును దేశం గుర్తిస్తోంది.
దేశం చాలా క్లిష్ట పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో, యుపి ప్రజలు సంక్షోభ సమయాల్లో ఏ విధంగా పోరాడుతారో, ఈ రోజు మనకు తెలిసింది. కరోనా మహమ్మారి చెలరేగినప్పుడు, తమ శ్రామిక లోకం ఎలా నెగ్గుకు వస్తుందో అని ఇతర దేశాలు ఆందోళన చెందాయి; అయితే మన దేశంలో మన శ్రామికులు ఎలాంటి సవాలునైనా అధిగమించగలమని, దానికి ఎదురొడ్డి నిలిచి పోరాడి, గెలువగలం అని వారు నిరూపించారు. మహమ్మారి ప్రబలిన కాలం లో పేదల కష్టాలను తగ్గించడానికి గాను 1 లక్షా 70 వేల కోట్ల రూపాయల ప్యాకేజి తో ‘గరీబ్ కళ్యాణ్ యోజన’ ను ప్రభుత్వం ప్రారంభించింది. 20 లక్షల కోట్ల రూపాయల విలువైన ఈ ఆర్థిక ఉద్దీపన చర్యల్లో పేదల పట్ల శ్రద్ధ వహించడం జరిగింది. వీధుల్లో తిరుగుతూ అనేక రకాల వస్తువులను అమ్మే వ్యాపారస్తులు వారి కార్యకలాపాలను మళ్ళీ మొదలుపెట్టి మరో మారు సొంత కాళ్ళ మీద నిలబడ్డం దుకు సంతోషం గా ఉంది. పీఎం స్వనిధి పథకం పేదల శ్రమకు ఈ సహకారాన్ని అందించింది. వారు స్వయం సమృద్ధిగా ముందుకు సాగుతారు.
మిత్రులారా, దేశం జూన్ 1 న పీఎం స్వనిధి పథకాన్ని ప్రారంభించింది. జూలై 2 న, అనగా ఒక నెలలోనే, ఆన్‌లైన్ పోర్టల్‌లో దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభమైంది. పథకాల్లో ఈ వేగాన్నిదేశం చూడటం ఇదే మొదటిసారి. పేదల కోసం చేసిన ప్రకటనలు అంత ప్రభావవంతంగా ఉంటాయి, గతంలో దీనిని మనం ఊహించలేదు. వీధి వ్యాపారులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండా చౌక రుణాల కోసం ఇలాంటి పథకం స్వాతంత్య్రానంతరం తొలిసారిగా జరిగింది. నేడు, దేశం మీ శ్రమను గౌరవిస్తూ, మీ తోపాటుగా ఉంది. ఈ రోజు , దేశంలో సామాజిక ఉద్రిక్తతల మధ్య స్వావలంబన భారత ప్రచారానికి మీ సహకారం యొక్క ప్రాముఖ్యత గురించి నాకు తెలుసు.
మిత్రులారా, ఈ పథకం ప్రారంభం నుంచీ, వీధుల లో తిరుగుతూ వస్తువులను అమ్ముకొనే మన సోదరులు మరియు సోదరీమణులు ఎటువంటి సమస్యను ఎదుర్కోకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొదట్లో రుణం తీసుకోవడానికి ఏ కాగితాలు పెట్టాలి, ఎలాంటి హామీలు ఇవ్వ వలసి వస్తుందో అని చాలామంది ప్రజలు ఆందోళన చెందారు! అందువల్ల, పేదల కోసం తయారుచేసిన ఇతర పథకాల మాదిరిగానే, ఈ పథకంలో సాంకేతిక పరిజ్ఞానం ఎక్కువగా ఉపయోగించబడుతుందని నిర్ధారించబడింది. కాగితం లేదు, పూచీదారుడు లేరు, బ్రోకర్లు లేరు, ఏ ప్రభుత్వ కార్యాలయాన్ని మళ్లీ మళ్లీ సందర్శించాల్సిన అవసరం లేదు! మీ అంతట మీరే ఆన్‌లైన్‌లో అప్లికేషన్‌ను అప్‌లోడ్ చేయవచ్చు. ఒక వ్యక్తి ఏదైనా ఒక కామన్ సర్వీస్ సెంటర్ లో గాని, లేదా పురపాలక కార్యాలయం లో గాని, ఒక బ్యాంకు కు వెళ్ళి గాని దరఖాస్తు ను స్వయంగా ఆన్ లైన్ లో దాఖలు చేయవచ్చుల. దీని ఫలితం ఏమిటంటే, ఏ వీధి విక్రేత అయినా తమ పనిని తిరిగి ప్రారంభించడానికి మరొకరి వద్దకు వెళ్ళవలసిన అవసరం లేదు. బ్యాంకులు స్వయంగా వచ్చి డబ్బులు ఇస్తున్నాయి.
మిత్రులారా, ఉత్తర ప్రదేశ్ ఆర్థిక వ్యవస్థలో వీధి వ్యాపారులకు పెద్ద పాత్ర ఉంది. ఇంత పెద్ద జనాభా, ఇంత పెద్ద రాష్ట్రం, కానీ వీధి వ్యాపారుల పని వల్ల చాలా మంది ప్రజలు తమ నగరంలో, తమ గ్రామంలో ప్రజల అవసరాలను కూడా తీర్చుకుంటున్నారు మరియు ఏదో ఒకటి సంపాదిస్తున్నారు. యుపి నుండి వలసలను తగ్గించడంలో వీధి విక్రేతల వ్యాపారం కూడా పెద్ద పాత్ర పోషిస్తుంది. అందువల్ల, పీఎం స్వనిధి యోజన ప్రయోజనాలను అందించడంలో యూపీ మొత్తం దేశంలోనే మొదటి స్థానంలో ఉంది. పట్టణ వీధి విక్రేతల గరిష్ట దరఖాస్తులు యుపి నుండి వచ్చాయి. స్వయం సమృద్ధ భారత దేశం లక్ష్యంగా అణగారిన వర్గాలవారిని అభివృద్ధి చేయడం ఈ పథకం లక్ష్యం. ఇప్పటి వరకు సుమారు 25 లక్షల మందికి పైగా రుణాల కోసం దరఖాస్తు చేశారు. వీరిలో సుమారు 12 లక్షల మందికి రుణాలు మంజూరయ్యాయి. వీటిలో యూపీ నుంచి మాత్రమే ఆరున్నర లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి, అందులో సుమారు నాలుగు లక్షల(3.75) దరఖాస్తులు కూడా ఆమోదించబడ్డాయి. వీధి వ్యాపారుల గురించి ఆందోళన చెందుతున్న యుపి ప్రభుత్వం, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గారికి, ఆయన బృందానికి నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు యూపీలో స్వనిధి యోజన రుణ ఒప్పందానికి స్టాంప్ డ్యూటీ నుండి మినహాయింపు లభించిందని నాకు చెప్పబడింది. యుపిలో కరోనా యొక్క ఈ క్లిష్ట సమయంలో, 6 లక్షల మంది వీధి వ్యాపారులకు వేలాది రూపాయల ఆర్థిక సహాయం కూడా అందించబడింది. దీనికి యుపి ప్రభుత్వానికి కూడా కృతజ్ఞతలు.
మిత్రులారా, పేదల పేరుతో రాజకీయాలు చేస్తున్న వారు పేదలకు రుణాలు ఇస్తే తిరిగి డబ్బులు చెల్లించబోరని దేశంలో ఓ వాతావరణం సృష్టించారు. కుంభకోణం, కమిషనింగ్ వ్యాపారాలు , మోసాలు చేసే వారు, నిజాయితీ లేని వారు ఎప్పుడూ పేదలను నిందిస్తూ , వారికి అన్యాయం చేసేందుకే తుద వరకు ప్రయత్నించాయి కానీ నేను ఇంతకు ముందే చెప్పాను, ఈ రోజు నేను మళ్ళీ చెప్తున్నాను, మన దేశంలోని పేదలు నిజాయితీ ఆత్మగౌరవంతో ఎప్పుడూ రాజీపడరు. పీఎం స్వనిధి పథకం ద్వారా పేదలు మరోసారి ఈ సత్యాన్ని నిరూపించారు, దేశానికి నిజాయితీకి తమ ఉదాహరణను ప్రదర్శించారు. నేడు, దేశంలోని వీధి వ్యాపారులకు స్వనిధి పథకం కింద రుణాలు ఇవ్వబడ్డాయి మరియు చాలా మంది తమ రుణాలను కూడా సకాలంలో తిరిగి చెల్లిస్తున్నారు. యుపి యొక్క వీధి విక్రేతలు కూడా కష్టపడి పనిచేస్తున్నారు మరియు వాయిదాలను కూడా చెల్లిస్తున్నారు. ఇది మన పేదల సంకల్ప శక్తి, ఇది మన పేదల శ్రమశక్తి, ఇది మన పేదల నిజాయితీ.
మిత్రులారా, మీరు ఇంతకుముందు బ్యాంక్, ఇతర సంస్థల నుండి పిఎం స్వనిధి పథకం గురించి తెలుసుకున్నారు. ఇక్కడ కూడా మీకు దాని గురించి చెప్పబడింది. వీలైనంత ఎక్కువ మందికి చెప్పడం ముఖ్యం. ఈ పథకం కింద రుణం కూడా మీకు సులభంగా లభిస్తుంది మరియు సకాలంలో తిరిగి చెల్లించేటప్పుడు 7 శాతం వడ్డీ తగ్గింపు ఉంటుంది. మరియు మీరు డిజిటల్ లావాదేవీలు చేస్తే, నెలలో 100 రూపాయల వరకు క్యాష్‌బ్యాక్ రూపంలో మీ ఖాతాకు తిరిగి జమ అవుతుంది,. అంటే, ఈ రెండు పనులు చేయడం ద్వారా, ఒక విధంగా, మీ వద్ద ఉన్న రుణం పూర్తిగా వడ్డీ లేకుండా ఉంటుంది, వడ్డీ ఉచితం మరియు ఇతర సమయాల్లో మీరు ఇంకా ఎక్కువ రుణం పొందవచ్చు. ఈ డబ్బు మీ పని, వ్యాపారాన్ని పెంచడంలో మీకు మరింత సహాయపడుతుంది. మిత్రులారా, ఈ రోజు మీ కోసం బ్యాంకుల తలుపులు తెరిచి ఉన్నాయి, ఈ రోజు బ్యాంకులు మీ వద్దకు వస్తున్న విధానం, ఇది ఒక రోజులో సాధ్యం కాలేదు. 'సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వస్' విధానం యొక్క ఇన్ని సంవత్సరాల కృషి ఫలితమే ఇది. పేదలను బ్యాంకింగ్ వ్యవస్థతో అనుసంధానించడం పనిచేయదని చెప్పిన వారికి ఇది కూడా సమాధానం.
మిత్రులారా, దేశంలో పేదల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించినప్పుడు, చాలామంది దానిని ప్రశ్నించారు, ఎగతాళి చేశారు. కానీ నేడు అదే జన్ ధన్ ఖాతాలు ఇంత పెద్ద విపత్తులో పేదల కోసం పనిచేస్తున్నాయి, పేదలు ముందుకు కదలడానికి కృషి చేస్తున్నాయి. ఈ రోజు పేదలు బ్యాంకుతో అనుసంధానించబడ్డారు, ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క ప్రధాన స్రవంతితో అనుసంధానించబడి ఉంది. ప్రపంచ వ్యాప్తంగా పెద్ద విపత్తుగా ఉన్న ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మన దేశ సామాన్య మానవుడు ఎంతో ముందున్నారు. ఈ రోజు మన తల్లులు గ్యాస్ మీద వంట చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో కూడా పొగలో వంట చేయాల్సిన అవసరం లేదు. పేదలు నివసించడానికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన లభించింది , సౌభాగ్య పథకం ద్వారా ఇంట్లో విద్యుత్ కనెక్షన్లు పొందారని, ఆయుష్మాన్ యోజన ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతోంది. నేడు బీమా పథకాల కవరేజీ కూడా పేదలతోనే ఉంది. పేదల సమగ్ర అభివృద్ధి, వారి జీవితాలపై సంపూర్ణ కృషి, దేశం యొక్క సంకల్పం. ఈ సందర్భంగా అనేకమంది వీధి వ్యాపారులు, కార్మికులు, రైతులు, మీ వ్యాపారాన్ని మరింత మెరుగ్గా మరియు సులభతరం చేయడానికి దేశం ఎలాంటి కృషి ఐనా చేయగలదని నేను మీకు ఇవాళ హామీ ఇస్తున్నాను.
మిత్రులారా, మీరు అందరూ కరోనా కష్టాలను ఎదుర్కొన్న శక్తికి, మరియు , మీరు రక్షణ నియమాలను అనుసరిస్తున్న జాగ్రత్తకు నేను మరోసారి మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ అప్రమత్తతతో, జాగ్రత్తగా ఉన్న దేశం త్వరలో ఈ మహమ్మారిని పూర్తిగా జయిస్తుంది. స్వయంసమృద్ధ భారతదేశం కలను త్వరలో మనమంతా నెరవేరుస్తామని నాకు నమ్మకం ఉంది. అవును, రెండు గజాల దూరం, మాస్క్ లు అవసరం తప్పనిసరి, ఈ మంత్రాలతో పండుగ కాలంలో కూడా మనం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ శుభాకాంక్షలతో, మీ అందరికీ మరోసారి పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నాను, నేను కూడా మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను మరియు మీరు మీ జీవితంలో చాలా పురోగతి సాధించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.
చాలా ధన్యవాదాలు !
***
(Release ID: 1668119)
Visitor Counter : 295
Read this release in:
Hindi
,
English
,
Urdu
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam