నీతి ఆయోగ్

ఆస్ట్రేలియాకు చెందిన కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఐఆర్‌వో)తో కలిసి ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ (ఐ-ఏసీఈ) ను ప్రారంభించిన ఏఐఎం

Posted On: 26 OCT 2020 5:19PM by PIB Hyderabad

ఆస్ట్రేలియాకు చెందిన  కామన్‌వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (సీఎస్‌ఐఆర్‌వో)తో  కలిసి  ఇండియా-ఆస్ట్రేలియా సర్క్యులర్ ఎకానమీ హాకథాన్ (ఐ-ఏసీఈ)పై  డిసెంబర్ 7 మరియు 8 తేదీలలో  రెండు రోజుల హ్యాకథాన్‌ నిర్వహిస్తున్న ఏఐఎం(అటల్ ఇన్నోవేషన్ మిషన్).

భారతదేశం మరియు ఆస్ట్రేలియాల మధ్య ఆర్ధికవ్యవస్థ పెంపొందించుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై జూన్‌ 4న భారత్ మరియు ఆస్ట్రేలియా ప్రధానమంత్రుల మధ్య జరిగిన వర్చువల్ శిరాఖగ్ర సమావేశంలో ఐ-ఎసిఇ ఆలోచన వచ్చింది.

ఇరుదేశాల్లో ఉన్న ప్రతిభగల విద్యార్ధులు, వినూత్న నూతన సాంకేతిక ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను గుర్తించడం వాటికి ప్రోత్సాహం అందించడంపై ఐ-ఎసిఇ ముఖ్యంగా దృష్టిసారిస్తుంది.

ఈ హ్యాకథాన్ కోసం ముఖ్యంగా నాలుగు ఇతివృత్తాలను తీసుకున్నారు:

వ్యర్థాలను తగ్గించే ప్యాకేజింగ్‌ల ఆవిష్కరణ
వ్యర్థాలను నివారించే విధంగా ఆహార సరఫరా విభాగాలకు రూపకల్పణ చేయడం
ప్లాస్టిక్ వ్యర్థాల తగ్గించే ఆవిష్కరణలను సృష్టించడం
క్లిష్టమైన లోహాలను మరియు ఈ-వ్యర్థాలను పునర్‌వినియోగంలోకి తేవడం

ఎంపికైన విద్యార్థులు మరియు అంకుర సంస్థలు/ ఎంఎస్‌ఎంఇలను హ్యాకథాన్‌కు ఆహ్వానిస్తారు. ఇరుదేశాలనుండి ప్రతిథీమ్‌కు ఇద్దరు విజేతలను (ఒక విద్యార్థి మరియు ఒక స్టార్టప్ / ఎంఎస్‌ఎంఇ) డిసెంబర్ 11 న జరిగే అవార్డుల ప్రధానోత్సవంలో ప్రకటిస్తారు.


హ్యాకథాన్‌ను ప్రారంభించిన అనంతరం ఎఐఎం మిషన్ డైరెక్టర్ మరియు నీతి ఆయోగ్ అదనపు కార్యదర్శి ఆర్. రమణన్ మాట్లాడుతూ, ‘ ఆర్థిక వ్యవస్థ ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు వ్యర్ధాలను నివారించడం, వాటిని పునర్వినియోగించడంపై దృష్టిపెట్టామని తెలిపారు.

సిఎస్ఐవో డివిజన్ ఆఫ్ ల్యాండ్ అండ్ వాటర్ చీఫ్ డాక్టర్ పాల్ బెర్ట్ష్ మాట్లాడుతూ, 'భారతదేశం మరియు ఆస్ట్రేలియాలల మధ్య  దశాబ్దం నుండి బలమైన ఉత్పాదక ద్వైపాక్షిక భాగస్వామ్యం ఉందని చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉన్న విస్తృత సహకారం గణనీయమైన ఫలితాలను ఇచ్చిందని వెల్లడించారు. మానవజాతి చరిత్రలో ఎదురైన ఈ సవాలును ఎదుర్కొనేందుకు భారత్‌, ఆస్ట్రేలియాలు ఉమ్మడిగా సాగిస్తున్న ఈ పరిశోధనలు ఫలప్రదమవుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.

సి.ఎస్.ఐ.ఆర్.ఓ సీనియర్ సైన్స్ లీడర్  డాక్టర్ పాల్ బెర్ట్ష్ తో కలిసి డాక్టర్ హీన్జ్ షాండ్ల్ మాట్లాడుతూ, ‘వృత్తాకార ఎకానమీ మోడల్ దీర్ఘ కాలంలో ఎక్కువ ఉద్యోగాలు మరియు అధిక ఆర్థిక వృద్ధిని అందిస్తుందని చెప్పారు. ఇది ఖర్చును తగ్గించడంతో పాటు ఆవిష్కరణలను పెంపొందిస్తుందని అలాగే పర్యావరణ ప్రయోజనాలను కలిగి ఉంటుంది' అని చెప్పారు.

ఈ సందర్భంగా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కుమార్ మాట్లాడుతూ, ‘ తక్కువ వనరులతో మన ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఈ పర్యావరణ అనుకూల ప్రయత్నం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని చెప్పారు.

ఆస్ట్రేలియాకు చెందిన పరిశోధన మరియు అభివృద్ధి, భారత్‌కు చెందిన సరికొత్త ఆవిష్కరణల కలయిక సర్క్యులర్ ఆర్ధిక వ్యవస్థను అభివృద్ధి దిశగా మరింత ముందుకు తీసుకువెళ్తుందని నీతి ఆయోగ్ సిఇవో అమితాబ్ కాంత్ చెప్పారు.


ఈ హ్యాకథాన్‌లో విజేతగా నిలిచిన భారతీయ విద్యార్థి ,  స్టార్టప్ / ఎంఎస్‌ఎంఇలకు రూ .2 లక్షలు, రూ .5 లక్షల ప్రోత్సాహంతో పాటు వారి ఉత్పత్తి అనంతర అవకాశాలు ఇవ్వబడతాయి. ఇక విజేతగా నిలిచిన ఆస్ట్రేలియా విద్యార్థికి ఎయూడీ $ 3500 మరియు విజేతగా నిలిచిన ఆస్ట్రేలియన్ ఎస్‌ఎంఈ/ స్టార్టప్ జట్టుకు ఎయూడీ$ 9500 బహుమతిగా ఇవ్వబడుతుంది.

దరఖాస్తు సమర్పణలకు చివరి తేదీ 6 నవంబర్ 2020. ఆసక్తి ఉన్నవారు http://aimapp2.aim.gov.in/iace/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

***



(Release ID: 1667739) Visitor Counter : 224