నౌకారవాణా మంత్రిత్వ శాఖ

దేశంలో నౌకల నిర్మాణానికి మరింత ప్రోత్సాహం లైసెన్సింగ్ విధానంలో మార్పులు "ఆత్మ నిర్భర్ భారత్ " నిర్మాణం కోసం "ఆత్మ నిర్భర్ షిప్పింగ్ " శ్రీ మనసుఖ్ మాండవీయ

Posted On: 22 OCT 2020 2:00PM by PIB Hyderabad

కేంద్రప్రభుత్వం అమలుచేస్తున్న "భారతదేశంలోనే నిర్మాణం" నినాదాన్ని కార్యరూపంలోకి తీసుకుని రావడానికి కేంద్రషిప్పింగ్ మంత్రిత్వ శాఖ వివిధ రకాల అవసరాల కోసం టెండర్ ప్రక్రియ ద్వారా నౌకలను కిరాయికి తీసుకోడానికి మొదటి తిరస్కరణ హక్కు ( రైట్ అఫ్ ఫస్ట్ రెఫ్యూసల్ RIFR ) కింద జారీచేస్తున్న లైసెన్సింగ్ విధానాన్ని సమీక్షించింది.

మొదటి తిరస్కరణ హక్కు లైసెన్సింగ్ విధానంలో చేసిన మార్పులతో ఇకపై వివిధ అవసరాల కోసం కిరాయికి తీసుకోవడానికి భారతదేశంలో నిర్మాణం పూర్తి చేసుకున్న నౌకలు, భారతీయుల యాజమాన్యంలో ఉన్న నౌకలు మరియు దేశంలో రిజిస్టర్ అయిన నౌకలకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.

ఇకపై నౌకలను కిరాయికి తీసుకోవడానికి అమలు చేసే టెండర్ల విధానంలో మొదటి తిరస్కరణ హక్కు విధానాన్ని కింది విధంగా అమలు చేయడం జరుగుతుంది.

i ) భారత దేశంలో నిర్మింపబడి భారత దేశంలో రిజిస్టర్ అయి భారతీయుల యాజమాన్యంలో ఉన్ననౌకలు

ii ) విదేశాలలో నిర్మింపబడి భారత దేశంలో రిజిస్టర్ అయి భారతీయుల యాజమాన్యంలో ఉన్న నౌకలు

iii ) భారతదేశంలో నిర్మింపబడి విదేశాలలోరిజిస్టర్ అయి విదేశీయుల యాజమాన్యంలో ఉన్న నౌకలు

దీనికోసం

a ) డైరెక్టర్ జనరల్ అఫ్ షిప్పింగ్ నూతనంగా సర్కులర్ ను జారీ చేసేంత వరకు భారత పతాకంతో తిరుగుతున్న నౌకలు ( అంటే భారతదేశంలో రిజిస్టర్ అయినవి ) పైన తెలిపిన (i ) తరగతిలోకి వస్తాయి

b ) మర్చంట్ షిప్పింగ్ యాక్ట్ 1958లోని 406 సెక్షన్ కింద డైరెక్టర్ జనరల్ ( షిప్పింగ్) జారీ చేసిన అనుమతుల ప్రకారం భారత పౌరులు/ సొసైటీలు/ కంపెనీలు భారతదేశంలోని నౌకానిర్మాణ కేంద్రాలలో నిర్మించి దేశంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి నిర్మిస్తున్న నౌకల నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు ఈ కింది రెండు నిబంధనలు అమలు జరిగేతే విదేశీ పతకం కలిగి ఉన్న నౌకలు మొదటి తరగతిలోకి వస్తాయి.

a )భారత నౌకా నిర్మాణ కేంద్రానికి కాంట్రాక్టు మొత్తంలో 25 % చెల్లించడం జరిగినప్పుడు

b ) గుర్తింపు పొందిన సంస్థ 50 శాతం నిర్మాణం పూర్తిఅయినట్టు సర్టిఫికెట్ జరీ చేసినప్పుడు.

నౌక నిర్మాణం పూర్తి అయ్యేంత వరకు మాత్రమే ఇటువంటి నౌకలకు జారీ చేసే లైసెన్స్ అమలులో ఉంటుంది.

నౌకల నిర్మాణ కార్యక్రమాల కోసం నౌకా మంత్రిత్వ శాఖ ఆర్ధిక సహాయ విధానం ( 2016-2026) కింద దీర్ఘ కాలం అమలు జరిగే సబ్సిడీని అందజేస్తున్నది. ఈ విధానం కింద ఇప్పటికే నౌకా మంత్రిత్వ శాఖ 61.05 కోట్ల రూపాయలను విడుదల చేయడం జరిగింది. దేశంలో నౌకల నిర్మాణాన్ని మరింత ప్రోత్సహించి నూతన మార్కెట్ అవకాశాలను అందించడానికి ప్రభుత్వం ఈ విధానాన్ని అమలు చేస్తున్నది.

నియమనిబంధనల్లో కొత్తగా చేసిన మార్పుల వల్ల నౌకాయాన రంగం మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుగుతుంది. దేశంలో ఉన్న నౌకా నిర్మాణ రంగానికి నూతన విధానం వల్ల ప్రయోజనం కలుగుతుంది.

" ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ పిలుపు ఇచ్చిన విధంగా ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, దేశంలో నౌకల నిర్మాణాన్ని మరింత ప్రోత్సహించడానికి నౌకా మంత్రిత్వ శాఖ ప్రాధాన్యతను ఇస్తున్నది. RoFR లైసెన్సింగ్ విధానంలో తీసుకుని వచ్చిన విప్లవాత్మక మార్పులు ఆత్మ నిర్భర్ షిప్పింగ్ రూపకల్పనకు ఎంతగానో దోహదపడతాయి. స్వయంసమృద్ధి సాధించడానికి ,స్వదేశీ నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి దోహదపడే ఈ నిర్ణంయం దీర్ఘకాలంలో దేశ ఆర్ధికాభివృధికి ఉపకరిస్తాయి "అని కేంద్ర నౌకాయాన శాఖ సహాయ మంత్రి శ్రీ. మనసుఖ్ మాండవీయ అన్నారు.

***

 

 

 (Release ID: 1666838) Visitor Counter : 175