రక్షణ మంత్రిత్వ శాఖ
నాగ్ క్షిపణి అంతిమ వినియోగ పరీక్ష
Posted On:
22 OCT 2020 1:24PM by PIB Hyderabad
యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్సైల్ (ఎటిజిఎం) నాగ్ అంతిమ వినియోగ పరీక్ష గురువారం ఉదయం 6.45 నిమిషాలకు పోఖ్రాన్ శ్రేణుల వద్ద జరిగింది. క్షిపణిలో వాస్తవ అస్త్రాన్ని సమగ్రం చేసి, నియమిత దూరంలో ఒక ట్యాంక్‌ను లక్ష్యంగా ఉంచి ఈ పరీక్ష జరిపారు. ఈ ప్రయోగాన్ని నాగ్ క్షిపణి వాహకమైన నామికా (NAMICA) నుంచి ప్రారంభించారు. కవచాన్ని ఛేదించి లక్ష్యాన్ని క్షిపణి కచ్ఛితంగా ఛేదించింది. నాగ్ ప్రయోగ పరీక్షను విజయవంతంగా నిర్వహించినందుకు డిఆర్‌డిఒ, భారతీయ సైన్యానికి రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అభినందనలు తెలిపారు.
ఆయుధాలతో బలంగా ఉన్న శత్రు ట్యాంకులపై పగలు, రాత్రి పరిస్థితులలో పోరాటం చేసేందుకు డిఆర్‌డిఒ ఎటిజిఎమ్ నాగ్‌ను అభివృద్ధి చేసింది. ప్రతిక్రియాశీల, మిశ్రమ ఆయుధాలతో సన్నద్ధంగా ఉండే ఎంబిటిలను ధ్వంసం చేసేందుకు ఫైర్ అండ్ ఫర్గెట్, టాప్ ఎటాక్ సామర్ధ్యాలతో , శత్రు క్షిపణులలో ఉన్న ఆయుధాలతో తనంతట తానుగా క్రియాశీలం అయ్యే లక్షణం ఈ మిస్సైల్‌లో పొందుపరిచారు.
నాగ్ క్షిపణి వాహకమైన నామికా అనేది బిఎంపి 2 ఆధారిత వ్యవస్థపై అటు నీరు, ఇటు భూమిపై పనిచేయగల సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ అంతిమ వినియోగ పరీక్షతో, నాగ్ ఉత్పత్తి దశలో ప్రవేశిస్తోంది. రక్షణ రంగ ప్రభుత్వ సంస్థ అయిన భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బిడిఎల్) ఈ క్షిపణిని ఉత్పత్తి చేస్తుండగా, మెదక్‌లోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ నామికాను తయారు చేస్తాయి.
క్షిపణిని ఉత్పత్తి దశకు తీసుకువచ్చినందుకు డిఆర్‌డిఒ, భారతీయ సైన్యం, పరిశ్రమలను ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిడిఆర్&డి కార్యదర్శి, డిఆర్‌డిఒ చైర్మన్ డాక్టర్ జి. సతీష్ రెడ్డి అభినందించారు.
(Release ID: 1666791)
Visitor Counter : 246
Read this release in:
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam