నౌకారవాణా మంత్రిత్వ శాఖ
విటిఎస్, విటిఎంస్ దేశీయ సాఫ్ట్‌వేర్ పరిష్కారా అభివృద్ధిని ప్రారంభించిన మన్‌సుఖ్ మాండవీయ
నౌకల స్థానాలు, ఇతర ట్రాఫిక్ ప్రాంతం లేక వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలతో పాటు ఒక ఓడరేవులో లేక జలమార్గంలో విస్త్రతంగా ట్రాఫిక్‌ను నిర్వహించడాన్ని విటిఎస్, విటిఎంఎస్ సాఫ్్టవేర్ నిర్ధారిస్తుంది
మేడిన్ ఇండియా విటిఎస్, విటిఎంఎస్‌లు నౌకల ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను ప్రపంచానికి తయారు చేసేందుకు మార్గాన్ని సుగమం చేస్తుందిః మన్‌సుఖ్ మాండవీయ
దేశీయ సాఫ్ట్‌వేర్ పరిష్కారాల అభివృద్ధి కోసం చెన్నై ఐఐటికి రూ. 10 కోట్ల మంజూరు
Posted On:
20 OCT 2020 1:54PM by PIB Hyderabad
దేశీయంగా ఉత్పత్తి చేసిన నౌకా ట్రాఫిక్ సేవలు (Vessel Traffic Services (VTS)), నౌకల ట్రాఫిక్ ను పర్యవేక్షించే వ్యవస్థలను (Vessels Traffic Management Systems) సాఫ్ట్‌వేర్ సొల్యుషన్‌ను మంగళవారంనాడు న్యూఢిల్లీలో కేంద్ర నౌకాయాన సహాయ మంత్రి (ఇన్‌ఛార్జి) మన్‌సుఖ్ మాండవీయ ఇ- మాధ్యమం ద్వారా ప్రారంభించారు.
భారతీయ ఓడ రేవులలో ట్రాఫిక్ నిర్వహణ కోసం విదేశాలలో చేసిన ఖరీదైన సాఫ్ట్‌వేర్ సొల్యూషన్లుకు బదులుగా మన అవసరాలకు తగిన దేశీయ వ్యవస్థల అభివృద్ధి కోసం కృషి చేయాలని తన ప్రారంభోపన్యాసం మంత్రి మాండవీయ నొక్కి చెప్పారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆత్మ నిర్భర్ భారత్ దార్శనికతతో మిళితమై, మేడిన్ ఇండియా విటిఎస్, విటిఎంఎస్ సాఫ్్టవేర్‌లు నౌకా ట్రాఫిక్ నిర్వహణ వ్యవస్థలను ప్రపంచం కోసం తయారు చేసే మార్గాన్ని సుగమం చేస్తాయని మాండవీయ చెప్పారు.
నౌకల స్థానాలు, ఇతర ట్రాఫిక్ ప్రాంతం లేక వాతావరణ శాఖ ప్రమాద హెచ్చరికలతో పాటు ఒక ఓడరేవులో లేక జలమార్గంలో విస్త్రతంగా ట్రాఫిక్‌ను నిర్వహించేందుకు విటిఎస్, విటిఎంఎస్ సాఫ్్టవేర్ నిర్ధారిస్తుంది. సముద్రంలో జీవన భద్రతకు, సముద్రయాన నిర్వహణ భద్రత, సామర్ధ్యానికి, సముద్ర పర్యావరణ భద్రతతో పాటు, చుట్టు పక్కల గల తీర ప్రాంతాలు, ఆఫ్‌షోర్ స్థావరాలు, కర్మాగారలను నౌకాయాన రద్దీ చెడు ప్రభావాల నుంచి కాపాడేందుకు విటిఎస్ దోహదం చేస్తుంది. విటిఎంఎస్‌లను ప్రపంచంలోనే అతి రద్దీగా ఉండే జలాలలో ఏర్పాటు చేశారు. అవి సురక్షితమైన నౌకాయానానికి, మరింత సమర్ధవంతమైన ట్రాఫిక్ ప్రవాహానికి, పర్యావరణ పరిరక్షణకు విలువైన సహకారాన్ని అందిస్తున్నాయి. సమీప మార్గాలలో బిజీగా ఉండే ట్రాఫిక్ ప్రవాహం, మార్గాలను, ఓడరేవులను అందుబాటులోకి తెచ్చుకొని, ఓడరేవు, దాని వినియోగదారుల ఉత్తమ ప్రయోజనాల కోసం సురక్షితంగా సమన్వయం చేసుకోవచ్చు. అలాగే జరిగే ప్రమాదాలను, అత్యవసర పరిస్థితుల త్వరితంగా పరిష్కరించుకోవచ్చు. ట్రాఫిక్ కదలికలకు సంబంధించిన డాటాను స్టోర్ చేసి, ఓడరేవు అధికారులు, పాలనా యంత్రాంగం, కోస్ట్‌గార్డ్ లు, సెర్చ్ అండ్ రెస్క్యూ సేవల బృందాలు సూచన సమాచారంగా వినియోగించుకోవచ్చు.
ఐఎంఓ ఒప్పందం సోలస్ ( SOLAS (Safety of Life at Sea ) కింద విటిఎంఎస్ తప్పనిసరి. రాడార్లు, ఎఐఎస్, డైరెక్షన్ ఫైండింగ్, సిసిటివి, విహెచ్ ఎఫ్ లేక ఇతర సహకార వ్యవస్థలు, సేవల వంటి అధునాత సెన్సార్ల ద్వారా విటిఎంఎస్ ట్రాఫిక్ ఇమేజ్‌ను సంకలనం చేసి, సేకరించవచ్చు.
ఆధునిక విటిఎంఎస్ మొత్తం సమాచారాన్ని ఆపరేటర్ వర్కింగ్ ఎన్విరాన్‌మెంట్‌గా ఏకీకృతం చేసి, ప్రభావవంతమైన ట్రాఫిక్ నిర్వహణ, సమాచారాన్ని అనుమతించే పనిని సరళం చేస్తుంది.
భారతీయ తీరంలో ప్రస్తుతం భారత్‌కు సుమారు 15 విటిఎస్ వ్యవస్థలు పని చేస్తున్నాయి. అయితే, ఈ విటిఎస్లు తమ స్వంత సాఫ్ట్‌వేర్ లతో పని చేస్తున్నందున వాటిలో ఏకరూపత లేదు. ఆత్మనిర్భర్ భారత్ చొరవలో భాగంగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ లైట్ అండ్ లైట్‌హౌజ్ తో దేశీయ విటిఎంఎస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి, చేయడం అన్నది ఈ రంగంలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది. అదే సమయంలో, భారత్‌లో, ఆయా ప్రాంతాల ఓడరేవు రంగానికి ఇది ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. దీనికి సంబంధించిన ప్రోటోటైప్ ను పదినెలల్లో అభివృద్ధి చేసి, నిత్య కార్యకలాపాలకు, సమాంతర వ్యవస్థగా పని చేసేందుకు శక్తిమంతంగా తయారు అయ్యేవరకు పరీక్షలు జరుపుతారు. విటిఎస్ సాఫ్ట్‌వేర్ ను దేశీయంగా అభివృద్ధి చేయడం ద్వారా విదేశీ మారక వ్యయం తగ్గడమే కాక విటిఎస్ సాఫ్ట్‌వేర్ కోసం విదేశాంగ సహాయంపై ఆధారపడవలసిన అవసరాన్ని తగ్గిస్తుంది.
అలాగే, దేశీయ విటిఎస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి దిగువ లాభాలను సమకూరుస్తుందిః
భారత్‌లో వివిధ విటిఎస్‌ల కోసం విదేశీ మారకాన్ని ఆదా చేస్తుంది.
విటిఎస్ సాఫ్ట్‌వేర్ ను భారత వాణిజ్య స్నేహపూర్వక దేశాలైన మాల్దీవ్్స, మారిషస్, మయన్మార్, శ్రీలంక, బంగ్లాదేశ్, గల్ఫ్ దేశాలకు అందించవచ్చు.
భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ అపగ్రడేషన్ల ఖర్చును తగ్గిస్తుంది.
రేవులలో ఉండే ఎంఐఎస్,/ ఇఆర్‌పి సాఫ్ట్‌వేర్లతో అనుసంధానం కావడం సులువు అవుతుంది.
భారతీయ విటిఎస్ సాఫ్ట్‌వేర్ అందుబాటు అంతర్జాతీయ బిడ్లలో భారతీయ కంపెనీలు వాణిజ్యపరంగా పోటీపడేందుకు తోడ్పడుతుంది.
భారతీయ నావికాదళానికి చెందిన నేషనల్ మారిటైమ్ డొమైన్ అవేర్‌నెస్ ప్రోగ్రాం, ఎన్‌సివిటిఎస్ డిజిఎల్ ఎల్ నిజసమయంలో అమలు చేయడం, తీర రవాణాకు నావిగేషన్ వ్యవస్థ పారస్పరికంగా తోడ్పడం అన్నది తక్కువ ధరలో భారత విటిఎస్ సాఫ్ట్‌వేర్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది.
దేశీయ విటిఎస్ సాఫ్ట్‌వేర్ అభివృద్ధి కోసం చెన్నై ఐఐటికి షిప్పింగ్ మంత్రిత్వ శాఖ రూ. 10 కోట్లను మంజూరు చేసింది.
షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు, ప్రధాన ఓడరేవుల చైర్ పర్సన్లు, చెన్నై ఐఐటి ప్రతినిధి కూడా దృశ్య మాధ్యమం ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1666115)
Visitor Counter : 260
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Tamil
,
Malayalam