రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌ సెక్టార్‌లో చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం

Posted On: 19 OCT 2020 3:23PM by PIB Hyderabad

వాస్తవాధీన రేఖను దాటి వచ్చిన, కార్పరల్‌ స్థాయిలో ఉన్న వాంగ్‌ యా లాంగ్‌ అనే చైనా సైనికుడిని, తూర్పు లద్దాఖ్‌లోని దెమ్‌చోక్‌ సెక్టార్‌లో గుర్తించిన భారత సైన్యం వెంటనే అతన్ని అదుపులోకి తీసుకుంది. 

    ఎత్తైన పర్వత ప్రాంతాల్లో ఉండే కఠినమైన చలి పరిస్థితుల నుంచి కాపాడే వెచ్చటి దుస్తులు, ఆక్సిజన్‌తో కూడిన వైద్యం‌, ఆహారం అతనికి భారత సైన్యం అందించింది.

    తమ సైనికుడు తప్పిపోయినట్లు ఇప్పటికే చైనా సైన్యం నుంచి భారత సైన్యానికి సమాచారం అందింది.

    నిబంధనల ప్రకారం అన్ని అధికారిక లాంఛనాలు పూర్తి చేసి, చుషుల్‌-మోల్డో సమావేశ ప్రాంతంలో చైనా సైనికుడిని ఆ దేశానికి భారత సైన్యం అప్పగించనుంది.

***


(Release ID: 1665895)