సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఎంఎస్ఎంఇ మంత్రిత్వశాఖ తీసుకున్న చర్యలు సత్ఫలితాలు ఇవ్వడంతో ఎం.ఎస్.ఎం.ఇలకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాల్సిందిగా మరిన్ని పరిశ్రమలకు విజ్ఞప్తి.
ఎం.ఎస్.ఎం.ఇ బకాయిలు తీర్చాల్సిందిగా 2800 కంపెనీలకు లేఖలు.
కేంద్ర మంత్రిత్వశాఖలు, సిపిఎస్ఇలు, రాష్ట్రప్రభుత్వాలను ఎంఎస్ఎంఇల బకాయిలు తీర్చాల్సిందిగా కోరుతూ వచ్చిన ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ గత నెలలో ప్రత్యక్షంగా 500 కార్పొరేట్ కంపెనీలకు రాసినలేఖలు మంచి ఫలితాలు ఇచ్చాయి.
2020 సెప్టెంబర్‌లో సిపిఎస్ఇలు ఎం.ఎస్.ఎం.ఇలకు రూ 3,700 కోట్ల రూపాయలు చెల్లించాయి. ఒక నెలలో జరిగిన గరిష్ఠచెల్లింపులు ఇవి. దీనితో గత 5 నెలలలో జరిగిన మొత్తం చెల్లింపులు 13,400 కోట్ల రూపాయలు.
Posted On:
19 OCT 2020 9:56AM by PIB Hyderabad
కేంద్ర సూక్ష్మ, చిన్న మధ్యతరహా ఎంటర్‌ప్రైజ్‌ల మంత్రిత్వశాఖ (ఎం.ఎస్.ఎం.ఇ) కృషికి మంచి ఫలితాలు రావడంతో దేశంలోని పరిశ్రమలకు ఎంఎస్ఎంఇల బకాయిల చెల్లింపుల విషయంలో మరింత విస్తృత స్థాయిలో చర్యలు చేపట్టింది. ఎం.ఎస్.ఎం.ఇలు సరఫరా చేసిన, అందించిన ఉత్పత్తులు ,సేవలకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించాల్సిందిగా ఎం.ఎస్.ఎం. ఇ మంత్రిత్వశాఖ కార్పొరేట్ సంస్థలను కోరింది. ఎం.ఎస్.ఎం.ఇలకు బకాయి ఉన్న మొత్తాన్ని ఈ నెలలోనే చెల్లించాల్సిందిగా సుమారు 2800 కార్పొరేట్ సంస్థలకుఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ ఆయా సంస్థల పేరున లేఖలు రాసింది.
గత నెలలో ఎంఎస్ఎంఇ మంత్రిత్వశాఖ , దేశంలోని 500ప్రముఖ కార్పొరేట్ కంపెనీలు ఎం.ఎస్.ఎం.ఇ సంస్థలకు గల బకాయిలపై లేఖలురాసింది. దీనికి కార్పొరేట్ రంగం నుంచి మంచి స్పందన లభించింది. గత 5 నెలలలో గరిష్టంగా చెల్లింపులు 2020 సెప్టెంబర్ నెలలో జరిగాయి. అంతేకాదు, ప్రొక్యూర్‌మెంట్, లావాదేవీలు సెప్టెంబర్ నెలలో గరిష్ఠంగా జరిగినట్టు గమనించారు. కేవలం కేంద్ర ప్రభుత్వరంగ ఎంటర్‌ప్రైజ్‌లు(సిపిఎస్ఇ) సంస్థలే గత 5 నెలల్లో13,400కోట్ల రూపాయలు చెల్లించాయి. ఇందులో రూ 3,700కోట్ల రూపాయలు కేవలం సెప్టెంబర్ నెలలోనే చెల్లించారు. ఇలా బకాయిలు తీర్చినందుకు ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ దేశ కార్పోరేట్ రంగాన్ని అభినందించింది.
ఎం.ఎస్.ఎం.ఇలనుంచి సరుకులు, సేవలు అందుకున్న వారి నుంచి బకాయిలు ఇప్పించడంలో , ఎం.ఎస్.ఎం.ఇ నిరంతరకృషి చేస్తున్నది, అలాగే డిజిటల్ సేవల పరంగా తగిన తోడ్పాటు నందిస్తున్నది.
దేశంలోని పెద్ద సంఖ్యలోగల కార్పొరేట్ సంస్థలకు ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ తాజాగా లేఖలురాస్తూ,ఎం.ఎస్.ఎం.ఇ సంస్థలకుగల బకాయిలను తీర్చాలని కోరింది. ఇలాంటి చెల్లింపుల వల్ల చిన్న వ్యాపార సంస్థలు రాగల పండగ సీజన్‌లో వ్యాపార అవకాశాలను మరింతగా అందిపుచ్చుకోగలుగుతాయని ఎంఎస్ఎం ఇ మంత్రిత్వశాఖ తమ లేఖలో పేర్కొంది .ఎం.ఎస్.ఎం.ఇల వద్దనగదు సరఫరా పెరిగితే, సరకులుసేవలు మరింతగాఅందించి రాబడి పెంచుకునేందుకు వాటికి అవకాశం ఉంటుందని తెలిపింది.చాలా వరకు ఎంఎస్ఎం ఇ లు ఇలాంటి అవకాశం కోసం ఏడాది అంతా ఎదురు చూస్తుంటాయని అందులో తెలిపారు.సకాలంలో వారికి రావలసిన బకాయిలు అందితే ఎంఎస్ఎంఇలు నిలదొక్కుకోవడానికే కాకుండా, ఈ పండగసీజన్‌లో వారిపై ఆధారపడిన వారు కూడా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అంతే కాకుండా వీరిలో చాలామంది ఏడాది పొడవునా కుదుటపడడానికి వీలుంటుందని వివరించారు. అందువల్ల ఈపరిస్థితులను గమనించి వీలైనంతవరకు ఎం.ఎస్.ఎం.ఇలకు గల బకాయిలను ఈ నెలలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా కార్పొరేట్ సంస్థలను ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ కోరింది.
దీనికితోడు ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ , ఎం.ఎస్.ఎం.ఇ చెల్లింపులకు సంబంధించి తీసుకువచ్చిన కీలక పాలనాపరమైన,చట్టపరమైన, సాంకేతిక పరమైన అంశాలను వారి దృష్టికి తీసుకువచ్చింది.
దీని ప్రకారం,
* నిర్ణీ వ్యవధిలోగా ఎం.ఎస్.ఎం.ఇలకు చెల్లింపులు చేయడం ఆదర్శవంతమైనది. అలాగే,ఎం.ఎస్.ఎం.ఇల నగదు సరఫరా సమస్యను పరిష్కరించేందుకు బిల్ డిస్కౌంటింగ్ ఏర్పాటును ఆర్‌బిఐ ప్రారంభించింది. టిఆర్ఇడిఎస్ పేరుతో ఇది ప్రారంభించింది. అన్ని సిపిఎస్ఇలు, 500 కోట్ల రూపాయలకు పైబడిన టర్నోవర్ క లిగిన కంపెనీలు ఈప్లాట్‌ఫారంలో చేరాల్సిఉంటుంది.
అయితే ఇంకాచాలా కంపెనీలు ఇందులో చేరాల్సిఉంది. మరికొన్ని తమ లావాదేవీలు ప్రారంభించాల్సి ఉంది. అందువల్ల టిఆర్ ఇ డిఎస్‌ప్లాట్‌ఫారంపై తమ గ్రూపు, కంపెనీ చేరిందా లేదా అన్నది పరిశీలించి , ఆప్లాట్‌ఫాంపై లావాదేవీలు జరుపుతున్నాయా లేదా గమనించుకోవాలని వాటిని కోరింది.
*ఎంఎస్ఎంఇ అభివృద్ధి చట్టం 2006 కింద ఎం.ఎస్.ఎం.ఇలకు చెల్లింపులను 45 రోజులలోపు చేయవలసి ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం కార్పొరేట్ సంస్థలు ప్రతి ఆరునెలలకు ఒకసారి రిటర్నులను కార్పొరేట్ అఫైర్స్ మంత్రిత్వశాఖకు ఎం.ఎస్.ఎం.ఇలకు గల బకాయిలపై రిటర్నులుదాఖలు చేయాలి. చాలా కేసులలో ఇది కూడా జరగడంలేదు. ఈ విషయంలో కూడా తగిన చర్యలు తీసుకోవలసిందిగా మంత్రిత్వశాఖ కార్పొరేట్‌సంస్థలను కోరింది.
ఎం.ఎస్.ఎం.ఇలు సకాలంలో చెల్లింపులు పొందేట్టు చూడడంలో ప్రభుత్వం ఎంతో శ్రద్ధతో ఉందని ప్రభుత్వం పునరుద్ఘాటించింది. ఇందుకు సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ ప్యాకేజ్ ప్రకటనను వారి దృష్టికి తెచ్చింది. ఎం.ఎస్.ఎం.ఇలకు బకాయిల చెల్లింపువంటి చిన్న చర్య ప్రస్తుత సమయంలో వారికి ఎంతో ఉపయోగపడుతుందని, ఇదిలక్షలాది ఇళ్లల్లో, కోట్లాది ముఖాలలో సంతోషానికి కారణమౌతుందని ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ పేర్కొంది.
***
(Release ID: 1665784)
Visitor Counter : 209
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam