మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఆసియాన్ పిహెచ్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాం తొలి బ్యాచ్ విద్యార్ధులనుద్దేశించి ప్రసంగించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్
విదేశీ లబ్దిదారులకోసం భారత ప్రభుత్వం చేపట్టిన అతిపెద్ద సామర్ధ్యాల అభివృద్ధి కార్యక్రమం ఎపిఎఫ్‌పి: రమేష్ పోఖ్రియాల్ నిశాంక్
Posted On:
16 OCT 2020 2:30PM by PIB Hyderabad
భారత ప్రభుత్వ నిధులతోచేపట్టిన ఏసియాన్ పిహెచ్‌డి ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపికైన ఏసియాన్ సభ్యదేశాల విద్యార్ధులనుద్దేశించి కేంద్ర విద్యా శాఖ మంత్రి శ్రీరమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ఈరోజు వర్చువల్ సమావేశం ద్వారా మాట్లాడారు.దేశంలోని అత్యున్నత సాంకేతిక విద్యా సంస్థలైన ఐఐటిలకు వీరు ఎంపికైనందుకు ఆయన వారికి అభినందనలు తెలిపారు. కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి శ్రీ సంజయ్ ధోత్రే ఈ సమావేశానికి గౌరవ అతిధిగా హాజరయ్యారు. ఆసియాన్ సభ్యదేశాల అంబాసిడర్లు, ప్రతినిధులు, విద్యాశాఖ కార్యదర్శి అమిత్ ఖరే, సెక్రటరీ (ఈస్ట్) , ఎం.ఇ.ఎ, శ్రీమతి రివా గంగూలీదాస్, ఐఐటి ఢిల్లీ డైరక్టర్ ప్రొఫెసర్ వి. రామ్‌గోపాల్ రావు, సంబంధిత ఐఐటిల ఆసియాన్ కో ఆర్డినేటర్లు, ఐఐటి డైరక్టర్లు, ఎంపికైన విద్యార్ధులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆసియాన్ విద్యార్ధులకు స్వాగతం పలుకుతూ కేంద్ర విద్యామంత్రి , ఇండియా, ఆసియాన్ సభ్యదేశాల మధ్య విద్య, పరిశోధన సంబంధాలు ఉభయ ప్రాంతాలకూ ప్రయోజనకరమన్నారు.ఇది సంస్కృతి, వాణిజ్యం, అనుసంధానతను మరింతగా బలోపేతం చేస్తుందని ఆయన అన్నారు. ఎపిఎఫ్‌పి ఇండియా, ఏసియాన్‌లకు చెందిన అకడమీషియన్లకు, పరిశోధకులకు, శాస్త్రవేత్తలకు సాంకేతికత, పరిశొధన రంగంలో పలు అవకాశాలకు తలుపులు తెరుస్తుందని ఆయన అన్నారు. వీరి పరిశోధనలు , ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా మానవాళి జీవితాల మెరుగుకు ఉపయోగపడనున్నాయని ఆయన అన్నారు.
ప్రస్తుత కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రపంచ ప్రగతి నెమ్మదించిందని ఆయన అన్నారు. ఐఐటిలు మాత్రం ఎన్నటికీ ఆగవని, అవి నిరంతరం విజయగాధలను సృష్టిస్తాయని అయన అన్నారు. ప్రస్తుత కోవిడ్ మహమ్మారి సమయంలో వారి విలువైన పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా దేశానికి సాయపడుతున్నారని అన్నారు.ఏసియాన్ సభ్యదేశాల విద్యార్ధులు ఐఐటిలో అభ్యసించేందుకు అవకాశం దక్కించుకున్నారని, ఇవి ప్రపంచంలోనే అత్యుత్తమ సంస్థల జాబితాలో ఉన్నాయని ఆయన అన్నారు. పరిశోధన కార్యక్రమాన్ని ఎంచుకున్న విద్యార్ధులకు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటి ఢిల్లీలో గల ఏసియాన్ పిహెచ్‌డి ఫెలోషిప్ ప్రోగ్రాంకు విద్యామంత్రిత్వశాఖ తన మద్దతును అందిస్తుందని ఆయన చెప్పారు.ఇది ప్రత్యేకంగా ఏసియాన్ విద్యార్ధులకోసం ఏర్పాటు చేసినదని ఆయన అన్నారు.
ఆసియాన్ పిహెచ్‌డి ఫెలోషిప్ కార్యక్రమాన్ని 2018 జనవరి 25న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు. పది ఆసియాన సభ్యదేశాల నాయకుల సమక్షంలో ఆయన దీనిని ప్రకటించారు. ఎపిఎఫ్‌పి కింద ఏసియాన్ పౌరులకు ప్రత్యేకంగా వెయ్యి ఫెలోషిప్‌లను కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. విదేశీ లబ్ధిదారుల కోసం చేపట్టిన అతిపెద్ద సామర్ద్యాల అభివృద్ధి కార్యక్రమం ఎపిఎఫ్‌పి అని ఆయన తెలిపారు. ఆసియాన్ పిహెచ్‌డి ఫెలోలు , వారు పిహెచ్ డి పూర్తిచేసే వారు సంబంధిత ఐఐటి పూర్వవిద్యార్ధులుగా గుర్తింపు పొందుతారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ఇండియా ఎల్లప్పుడూ సర్వేభవంతు సుఖినహ, అలాగే అతిథిదేవొ భవ, వసుదైవ కుటుంబకం అనే దార్శనికతను పెంపొందిస్తుందన్నదానికి నిదర్శనమని శ్రీ పోఖ్రియాల్ అన్నారు. ప్రపంచంతో కలిసి ముందుకు సాగాలని మనం అనుకుంటున్నామని ఆయన అన్నారు. ప్రపంచ ఆలోచనా దృక్పథంతో విద్యారంగంలో గ్లోబల్ హబ్‌గా ఉండాలని మనం కట్టుబడి ఉన్నామని ఆయన అన్నారు. విద్యను అంతర్జాతీయీకరంచేదిశగా చేపట్టిన సానుకూల చర్యగా ఎపిఎఫ్‌పి కార్యక్రమాన్ని ఆయన అభివర్ణించారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారినుద్దేశించి మాట్లాడుతూ శ్రీ ధోత్రే,ఆగ్నేయాసియా దేశాలతో మన సంబంధాలు ఎంతో ప్రాచీనమైనవని ఆయన అన్నారు. ఏసియాన్ దేశాల సంస్కృతిలో మన రామాయణ ప్రభావాన్ని మనం గమనించవచ్చని ఆయన అన్నారు.ఇక ఏసియాన్ దేశాలతో మన సంబంధాలకు మూలాలు బుద్ధుడి సందేశంతో మరింత బలపడుతూ వచ్చాయని ఆయన అన్నారు. ఈ దేశాలతో మనకు బలమైన సాంస్కృతిక, చారిత్రక బంధం ఉంది. ఏసియాన్ దేశాల విద్యార్ధుల కోసం ఇండియాలో పరిశోధనలకు వీలు కల్పించే ఈ ప్రయాణం మన బంధాన్ని మరింత బలపరచనుంది. పరస్పర సహకారంతో జరిగే పరిశోధనలు, ఆవిష్కరణలు అందరికీ ఎంతో ప్రయోజనకరం కానున్నాయి.
ప్రపంచం అంతా ఇంకా కోవిడ్‌తో పోరాడుతున్నప్పుడుమన పరిశోధన సంస్థలు తక్కువ ధరకు వెంటిలేటర్లు, టెస్టింగ్ కిట్‌లు, మాస్క్‌లు, తదితరాలను కరోనాపై పోరాటానికి అభివృద్ధి చేసిన విషయాన్ని ఆయన దోత్రే ప్రముఖంగా ప్రస్తావించారు.ఈ ఫెలోషిప్ కార్యక్రమానికి ఎంపికైన వారందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఐఐటి లలోని అత్యుత్తమ విద్యావేత్తలు, శాస్త్రవేత్తల మార్గనిర్దేశంలో విద్యార్ధులు చేపట్టబోయే పరిశోధనలు విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ శ్రీ ఖరే , ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆవిష్కరించిన నూతన విద్యావిధానం -2020 భారతదేశంలో విద్యారంగంలో పరివర్తనాత్మక మార్పు తీసుకురానున్నదని చెప్పారు. ఎన్.ఇ.పి ఉన్నత విద్యా రంగంలో పరిశోధన,ఆవిష్కరణలను ప్రోత్సహించడంపై దృష్టిపెడుతుందని అన్నారు. ఈ విధానం విదేశీ విశ్వవిద్యాలయాలు , భారతదేశంలో తమ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునేందుకు వీలు కల్పిస్తుందని, అలాగే భారతీయ విశ్వవిద్యాలయాలు ఇతర దేశాలలో క్యాంపస్‌లుఏర్పాటు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తుందని , ఫలితంగా ఇండియా అంతర్జాతీయంగా నాలెడ్జ్ హబ్ గా రూపుదిద్దుకుంటుందని అన్నారు. విద్యా మంత్రత్వశాఖకుచెందిన అకడమిక్, రిసెర్చ్ కొలాబరేషన్‌కు చెందిన స్పార్క్‌కార్యక్రమ, దేశంలోని అత్యున్నత స్థాయి సంస్థలలో , అంతర్జాతీయ స్థాయి కలిగిన విదేశీ సంస్థలలో పరిశోధనలను ప్రోత్సహిస్తుందని తెలిపారు. నేషనల్ రిసెర్చి ఫౌండేషన్, పరిశోధన, సాంకేతిక అభివృద్ధి, సాంకేతికత ఆధారిత ఆవిష్కరణలు, వంటివి భారత దేశ నూతన దార్శనికతను సాధించేందుకు మరింత ఊపునిస్తాయని అన్నారు. విద్యార్ధులకుఆయన తమ శుభాకాంక్షలు తెలిపారు.
రిపబ్లిక్ ఆఫ్ ఇండొనేసియా అంబాసిడర్ , సిదార్తో రెజా సూర్యోడిపురో మాట్లాడుతూ, ఇండియా, ఆసియాన్‌లమధ్య విద్యా సహకారంలో ఇదొక గొప్పకార్యక్రమమని అన్నారు.ఆసియాన్ ఐటి సామర్ధ్యాలను మరింత పెంపొందించడానికి విద్యారంగానికి ఇండియాఅందిస్తున్న చేయూతగా ఆయన అభివర్ణించారు. ఇండియా , ఆసియాన్‌ల మధ్య సన్నిహిత సహకారానికి, మన ఉమ్మడి డిజిటల్ పరివర్తన ఐఆర్4.0 కుఇది ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
ఫిలిప్పీన్స్ అంబాసిడర్ రామన్ ఎస్. భగత్సింగ్‌జూనియర్ తమ జాతీయనాయకుడు డాక్టర్ జోస్ పి.రిజాల్ మాటలను ప్రస్తావిస్తూ దేశానికి ఆశాకిరణాలు యువతేననిఅన్నారు. యువతకునాణ్యమైన విద్యను అందించడం ఈ ఆశలను మరింత బలోపేతం చేయడమే నని ఆయన అన్నారు.
వియత్నాం అంబాసిడర్ ఫామ్ సనా చౌస్ మాట్లాడుతూ, ఆసియాన్ పిహెచ్ డి ఫెలోషిప్ కార్యక్రమం ఇండో ఆసియాన్ మేధో సంఘీభావానికి గుర్తుగా నిలుస్తుందని, ఈ కార్యక్రమం ఆసియాన్ ప్రముఖ ఇంజనీర్లకు భారతదేశపు సుప్రసిద్ధ ఐఐటిలలో శిక్షణ ఇవ్వడానికి సహాయపడుతుందని ఆయన అన్నారు.
రాయల్‌థాయ్ ఎంబసీ కి చెందిన చార్జ్ డి అఫైర్స్ తిరపత్ మాంగ్‌కోల్నావిన్ మాట్లాడుతూ, ఆసియాన్, పిహెచ్‌డి ఫెలోషిప్ కార్యక్రమం ఆసియాన్ ఇండియా సంబంధాలలో సామాజిక సాంస్కృతికతకు లోబడి నిర్దేశిత లక్ష్యాల సాధనకు ఉపకరిస్తుందన్నారు. ఇది మానవ వనరుల అభివృద్ది, ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల మెరుగుకు దోహదపడుతుందన్నారు.
సింగపూర్ హైకమిషనర్, సైమన్ వాంగ్, ఎపిఎఫ్‌పి పై వ్యాఖ్యానిస్తూ ఆసియాన్, ఇండియాలోని ప్రతిభగల యువతను సన్నిహితం చేసే ఆసియాన్ పిహెచ్‌డి ఫెలోషిప్ కార్యక్రమం ఆసియాన్,ఇండియా సంబంధాలను అత్యద్భుతంగా ముందుకు తీసుకుపోగలదని ఆయన అన్నారు. దీనిద్వారా ప్రజలకు ప్రజలకుమధ్యగల సంబంధాలు మరింత పెంపొందనున్నాయన్నారు.
భారత ప్రభుత్వం చూపిన ఉదారతకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని, ఆసియాన్ పిహెచ్ ఫెలోషిప్ సాధించినవారికి అభినందనలు తెలుపుతున్నానని ఆయన అన్నారు.
ఐఐడి ఢిల్లీ డైరక్టర్ ప్రొఫెసర్ రామ్‌గోపాల్ రావు మాట్లాడుతూ, ఆసియాన్ పిహెచ్ డి కార్యక్రమం ఈ ప్రాంతంలో ఒక గేమ్‌ఛేంజర్ కానున్నదని ఆయన అన్నారు. ఇది ఆసియాన్ విద్యార్ధులు ఇండియాలోని అత్యద్భుత సంస్థలలోని మేధావుల నుంచి నేర్చుకోవడానికి వీలుకలుగుతుందని అన్నారు. ఇది విశ్వవిద్యాలయాలలో ఆవశ్యకమైన సాంస్కృతిక వైవిద్యాన్ని తీసుకువస్తుందని, ఇది లుక్ ఈస్ట్ పాలసీకి అనుగుణంగా ఉందని,ఇందులో పాలుపంచుకున్న వారందరికీ ప్రయోజనకరమైనదని ఆయన అన్నారు.
***
(Release ID: 1665733)
Visitor Counter : 115