నౌకారవాణా మంత్రిత్వ శాఖ

భారత్-ఇరాన్‌లోని చాబహార్‌ నౌకాశ్రయం మధ్య సరకు రవాణాపై 40 శాతం రాయితీ మరో ఏడాది పొడిగింపు

భారత్‌లోని జేఎన్‌పీటీ, దీన్‌దయాళ్‌ పోర్టుల ద్వారా, ఇరాన్‌లోని షాహిద్‌ బెహెష్తి నౌకాశ్రయానికి ఎగుమతి/దిగుమతి చేసిన సరకుకు రాయితీ వర్తింపు

Posted On: 16 OCT 2020 3:32PM by PIB Hyderabad

సముద్ర మార్గంలో సరకు రవాణా, నౌకా సంబంధిత రుసుముల్లో ప్రస్తుతమున్న 40 రాయితీని కేంద్ర నౌకారవాణా మంత్రిత్వ శాఖ మరో ఏడాది పాటు పొడిగించింది. భారత్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, దీన్‌దయాళ్‌ పోర్టు ద్వారా, ఇరాన్‌లోని చాబహార్‌లో ఉన్న షాహిద్‌ బెహెష్తి నౌకాశ్రయానికి ఎగుమతి/దిగుమతి చేసిన సరకుకు ఈ రాయితీ వర్తిస్తుంది.

    కనీసం 50 టీఈయూలు లేదా 5000 మెట్రిక్‌ టన్నుల సరకు ఎగుమతి/దిగుమతి అయితేనే, నౌకా సంబంధ ఛార్జీల్లో రాయితీ వర్తిస్తుంది. 

    ఈ నౌకాశ్రయాలు, ఇండియన్‌ పోర్ట్స్‌ గ్లోబల్‌ లిమిటెడ్‌తో కలిసి ఒక ప్రామాణిక కార్యాచరణ విధానాన్ని రూపొందించుకుంటాయి. తద్వారా, బెహెష్తి నౌకాశ్రయం వద్ద ఎగుమతి/దిగుమతి అయిన సరకుకు రాయితీ వర్తించేలా చూసుకుంటాయి.

    చాబహార్‌ నౌకాశ్రయం ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం ఈ రాయితీ ఉద్దేశం. జవహర్‌లాల్ నెహ్రూ పోర్టు, దీన్‌దయాళ్‌ పోర్టు ద్వారా, చాబహార్‌ నౌకాశ్రయానికి ఎగుమతులు/దిగుమతులకు ఈ రాయితీ ఉత్ర్పేరకంగా పనిచేస్తుంది.

****(Release ID: 1665206) Visitor Counter : 160