రక్షణ మంత్రిత్వ శాఖ
భారత్- కజఖస్థాన్ రక్షణ సహకారం: వెబినార్, ఎక్్సపో
Posted On:
16 OCT 2020 10:08AM by PIB Hyderabad
భారత రక్షణ మంత్రిత్వ శాఖలో భాగమైన రక్షణ ఉత్పత్తి శాఖ ఆధ్వర్యంలో ఫిక్కి (FICCI) నిర్వహణలో భారత, కజఖస్థాన్ దేశాల మధ్య గురువారంనాడు వెబినార్ జరిగింది. ప్రపంచం కోసం మేకిన్ ఇండియా - కజఖస్థాన్ రక్షణ సహకారం : వెబినార్, ఎక్స్‌పో అన్న ఇతివృత్తంతో ఈ వెబినార్ జరిగింది.
రానున్న ఐదేళ్ళల్లో రక్షణ ఎగుమతుల లక్ష్యమైన ఐదు బిలియన్ డాలర్లను సాధించే క్రమంలో రక్షణ ఎగుమతులను ప్రోత్సహించేందుకు మిత్ర దేశాలతో నిర్వహిస్తున్న వెబినార్‌ల పరంపరలో ఇది భాగం.
ఇరు దేశాల రాయబారులు, రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు ఈ వెబినార్‌లో పాలుపంచుకుని, పరస్పర అవసరాలను తీర్చుకునేందుకు, సహ అభివృద్ధి, సహ ఉత్పత్తికి ఉన్న అవకాశాలను వినియోగించుకోవలసిన అవసరం గురించి మాట్లాడారు.
ఈ వెబినార్‌లో భారతీయ కంపెనీలైన ఎల్&టి రక్షణ, అశోక్ లేల్యాండ్ లిమిటెడ్, భారత్ ఫోర్జ్, జెన్ టెక్నాలజీస్, ఎల్కాం ఇన్నొవేషన్స్, హిందుస్థాన్ ఎయిరోనాటిక్స్ లిమిటెడ్, ఆల్ఫా డిజైన్ టెక్నాలజీ, భారత్ ఎలక్ర్టానిక్స్ లిమిటెడ్ లు శతఘ్ని వ్యవస్థలు, రాడార్లు, రక్షిత వాహనాలు, క్షిపణులు, వాయు రక్షణ ఉపకరణాలు, శిక్షణ పరిష్కారాలు తదితర ప్రధాన ఉపకరణాలకు సంబంధించిన అంశాలను వెబినార్‌లో ప్రెజెంట్ చేశారు. తమ ప్రతినిధి కార్యాలయాన్ని కజఖస్థాన్‌లో ప్రారంభిస్తామని బిఇఎల్ ప్రకటించింది.
ఈ వెబినార్‌లో 350 మంది పాలు పంచుకున్నారు. సుమారు దృశ్య ప్రదర్శనల స్టాళ్ళు పాల్గొన్నాయి. ఈ ప్రదర్శనలో కజఖ్ కంపెనీలకు చెందిన 7 స్టాళ్ళు కూడా ఏర్పాటు అయ్యాయి.
***
(Release ID: 1665102)
Visitor Counter : 276