ఆర్ధిక వ్యవహారాల మంత్రివర్గ సంఘం

ఎన్ఎండిసి నుంచి నాగార్నర్ స్టీల్ ప్లాంట్ తొలగించి వాటాను విక్రయించడానికి కేంద్ర మంత్రివర్గ ఆమోద ముద్ర

Posted On: 14 OCT 2020 4:42PM by PIB Hyderabad

జాతీయ ఖనిజాభివృద్ధి సంస్థ (ఎన్ఎండిసి) పరిధి నుంచి  నాగార్నర్ స్టీల్ ప్లాంట్ (ఎన్ ఎస్ పి)ని తొలగించి దానిలో భారత ప్రభుత్వ వాటాను పూర్తిగా వ్యూహాత్మిక భాగస్వామికి విక్రయించాలని కేంద్రం నిర్ణయించింది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన ఆర్ధిక వ్యవహారాల కమిటీ సమావేశం ఈ ప్రతిపాదనకు " సూత్రప్రాయ" అంగీకారం తెలిపింది.

     ఏడాదికి మూడు మిలియన్ టన్నుల ఉక్కును ఉత్పత్తి చేయగల సామర్ధ్యంతో  ఎన్ ఎస్ పిని ఎన్ఎండిసి ఛతీస్ ఘర్ లో సమగ్ర ఉక్కు కర్మాగారంగా నెలకొల్పింది.1980 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నఈ కర్మాగారం విలువ తాజా అంచనాల ( 14 .07 . 2020 ) ప్రకారం 23 ,140 కోట్ల రూపాయలుగా లెక్క కట్టారు. దీనిలో ఎన్ఎండిసి తన సొంత నిధుల నుంచి 16 ,662 కోట్ల రూపాయలను సమకూర్చగా 524 కోట్ల రూపాయలను బాండ్లమార్కెట్ నుంచి సేకరించారు.

   తాజా నిర్ణయంతో  ఎన్ఎండిసి వాటాలను ఎన్ ఎస్ పి నుంచి ఉపసంహరించడానికి 2016 అక్టోబర్ 27 వ తేదీన జరిగిన సమావేశంలో తీసుకొన్న నిర్ణయాన్ని  ఆర్ధిక వ్యవహారాల కమిటీ మార్చుకొన్నది.

   పెట్టుబడులను ఉపసంహరించే ముందు ఎన్ ఎస్ పిని విడిగా మరో కర్మాగారంగా మార్చాలన్న ప్రతిపాదన వల్ల ఈ కింది ప్రయోజనాలు ఉంటాయి.

            i ) ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత ఎన్ ఎం డి సి తన ప్రధాన కార్యక్రమం అయిన ఖనిజాల తవ్వకాలపై దృష్టి సారించకలుగుతుంది.

            ii ) దీనివల్ల ఎన్ ఎస్ పి ప్రత్యేక సంస్థగా మారుతుంది. ఎన్ ఎం డి సి మరియు ఎన్ ఎస్ పి లు తమ విడివిడిగా పనిచేసి తమ కార్యకలాపాలు, ఆర్ధిక వ్యవహారాలకు బాధ్యత వహిస్తాయి.ఎన్ ఎం డి సి లో కలిగి ఉన్నవాటాలకు సమానంగా ఎన్ ఎస్ పిలో .ఎన్ ఎం డి సి వాటాదారులు వాటాలను పొందుతారు.

          iii )ప్రక్రియ పూర్తి అయిన తరువాత  ఎన్ ఎస్ పి, .ఎన్ ఎం డి సిల  వాటాదారులు రెండు సంస్థల కార్యకలాపాలు, నిధులపై మరింత స్పష్టమైన వివరాలను పొందగలుగుతారు.

         iv ) కాపిటల్ గెయిన్స్ పరంగా చూసినప్పుడు  కూడా ఈ నిర్ణయం తటస్థంగా ఉంటుంది.

                      2021 సెప్టెంబర్ నాటికి పెట్టుబడుల ఉపసంహరణ, ఎన్ ఎం డి సి నుంచి ఎన్ ఎస్ పిని విడడీసీ దానిని ప్రత్యేక సంస్థగా గుర్తించే ప్రక్రియను సమాంతరంగా పూర్తి అవుతాయని మంత్రివర్గ కమిటీ గుర్తించింది.

        ఎన్ ఎం డి సి కేంద్ర ఉక్కు గనుల శాఖ  సి పి ఎస్ ఈలో చేర్చబడింది.దీనిలో కేంద్ర ప్రభుత్వం 69 .65 శాతం వాటాను కలిగివుంది.

***


(Release ID: 1664489) Visitor Counter : 162