ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

తక్కువ కేసులు, మరణాలు, ఎక్కువ పరీక్షల దేశాల్లో కొనసాగుతున్న భారత్

చికిత్సలో ఉన్నవారి సంఖ్య తక్కువస్థాయిలో కొనసాగింపు

గడిచిన 24 గంటల్లో 55,342 కొత్త కేసులు

Posted On: 13 OCT 2020 12:32PM by PIB Hyderabad

కోవిడ్ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వంతో బాటు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తదేక దృష్టితో వ్యూహాలు అమలు చేయటం, పకడ్బందీగా చర్యలు చేపట్టటం సత్ఫలితాలు ఇచ్చింది. దీంతో అంతర్జాతీయంగా భారత్ ప్రతి పది లక్షల జనాభాలో అతి తక్కువ స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు చేయగలిగిన దేశాల్లో ఒకటిగా నిలిచింది. మరణాలలోనూ అదే విధమైన స్థాయి నిలబెట్టుకుంది. అంతర్జాతీయంగా ప్రతి పదిలక్షలమందిలో 4,794 కేసులు నమోదు కాగా భారత్ లో అది 5,199 గా నిలిచింది. బ్రిటన్, రష్యా, దక్షిణాఫ్రికా, అమెరికా, బ్రెజిల్ దేశాల్లో ఇంతకంటే ఎక్కువ సంఖ్య నమోదైంది.

 

 

భారతదేశంలో ప్రతి పది లక్షలలో మరణాలు 79గా నమోదుకాగా ప్రపంచ సగటు 138 కావటం గమనార్హం.

మొత్తం కోవిడ్ నిర్థారణ పరీక్షల విషయానికొస్తే, భారత్ అత్యధికంగా నమోదు చేసుకున్న దేశాల్లో ఒకటిగా నిలిచింది. గడిచిన 24 గంటలలో 10,73,014 కోవిడ్ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన మొత్తం పరీక్షలు దాదాపు 8కోట్ల 89 లక్షలు ( 8,89,45,107). ఎక్కువ సంఖ్యలో పరీక్షలు అదే పనిగా జరుపుతూ పోవటం వలన తొలిదశలోనే వ్యాధిసోకినవారిని గుర్తించటం, సకాలంలో చికిత్స అందించటం సాధ్యమవుతోంది. దీనివలన కొలుకునేవారి సంఖ్య ఎక్కువగాను, మరణాలు తక్కువగాను నమోదవుతూ వస్తున్నాయి.

 

నిజానికి అత్యధిక ఆదాయముండే అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్ లాంటి దేశాలతో భారత్ ను సరిపోల్చటం సమంజసం కాదు. ప్రధసనంగా దీనికి కారణం జనాభా కూడా, దీనివలన వనరుల పంపిణీలో పూర్తిగా తేడాలొస్తాయి. ప్రతి పదిలక్షలమందికీ డాక్టర్లు, నర్సుల అందుబాటు,  జిడిపి లో ఆరోగ్యం మీద వెచ్చించే మొత్తం వాటా, ఇతర అధికాదాయ  దేశాలతో భారత్ పోలిక  స్పష్టమైన తేడాను కనబరుస్తుంది. స్థూలంగా చూసినప్పుడు భారత్ లో కోవిడ్-19 యాజమాన్యంలో అనుసరించిన వ్యూహాలు, ప్రజారోగ్య స్పందన గడిచిన కొద్ది నెలలుగా ప్రోత్సాహకరంగా ఉంది.

భారత్ లో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 55,342 కొత్త కేసులు నమోదయ్యాయి.

కొత్తగా వస్తున్న కేసులు తక్కువ స్థాయిలో ఉండటానికి కారణం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటం, దుకుడుగా పెద్ద సంఖ్యలో పరీక్షలు జరపటం, తక్షణమే ఆనవాలు పట్టుకొని ఆస్పత్రిలో చేర్చటం, ప్రామాణిక చికిత్సావిధానాలు పాటించటం. వీటివలన ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలోను, హోమ్ ఐసొలేషన్ లో ఉన్నవారి విషయంలోను  ప్రామాణీకరించిన నాణ్యమైన  చికిత్స అందించటం సాధ్యమవుతోంది.  

 

WhatsApp Image 2020-10-13 at 10.19.14 AM.jpeg

గడిచిన ఐదు వారాలలో సగటున రోజుకు కొత్తగా వస్తున్న కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక్కోవారానికి సగటున తీసుకున్నప్పుడు సెప్టెంబర్ 2వ వారంలో  రోజుకు 92,830 చొప్పున కేసులు నమోదు కాగా అక్టోబర్ 2వ వారం నాటికి అది 70,114 కేసులకు తగ్గింది. .

చికిత్సపొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య కూడా భారత్ లో క్రమంగా తగ్గుతూ వస్తోంది. మొత్తం నమోదైన పాజిటివ్ కేసులలో చికిత్సలో ఉన్నవారు 11.69% మాత్రమే. ఇప్పుడు ఇంకా చికిత్స పొందుతున్నవారి సంఖ్య దేశంలో 8.38.729 మంది. వరుసగా ఐదో రోజు కూడా ఈ సంఖ్య 9 లక్షలకు లోపలే నమోదవుతూ ఉంది.

WhatsApp Image 2020-10-13 at 10.19.07 AM.jpeg

కొత్తగా నమోదవుతున్న కేసులలో 76% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు. అందులో అత్యధిక కేసులు నమోదు చేసుకోవటంలో మహారాష్ట్రను మించిపోయి కర్నాటక ముందుకొచ్చింది. ఈ రెండు రాష్ట్రాలలోను 7,000 కు పైగా కేసులు నమోదయ్యాయి. ఎక్కువగా పాజిటివ్ కేసులు వస్తున్న రాష్ట్రాలలో కర్నాటక, కేరళ, రాజస్థాన్, పశ్చిమబెంగాల్, చత్తీస్ గఢ్ ఉన్నాయి.

గడిచిన 24 గంటలలో కొత్తగా కోలుకున్నవారు 77,760 మంది ఉన్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 62 లక్షలు ( 62,27,295) పైబడింది. ఒక్కో రోజులో కోలుకుంటున్నవారు అధిక సంఖ్యలో ఉండటం వలన కోలుకుంటున్నవారి శాతం కూడా మెరుగుపడుతూ ప్రస్తుతం 86.78% చేరింది. కొత్తగా నమోదవుతున్న కేసులలో 78% మంది 10 రాష్ట్రాలకు చెందినవారే కావటం విశేషం. ఒకేరోజు కోలుకున్నవారి సంఖ్యలో 15,000 కు పైగా కేసులతో మహారాష్ట్ర ముందు వరుసలో ఉండగా 12,000 కు పైగా కేసులతో కర్నాటక ఆ తరువాత స్థానంలో ఉంది.  

 

WhatsApp Image 2020-10-13 at 10.20.38 AM.jpeg

కోవిడ్-19 కారణంగా మరణించినవారి సంఖ్య గడిచిన 10 రోజులుగా 1000 కి లోపు ఉంటున్నది. గడిచిన 24 గంటలలో 706 మంది కోవిడ్ తో మరణించినట్టు నమోదైంది. దాదాపు 79% మంది 10 రాష్ట్రాలలోనే మరణించారు. మృతులలో 23% మంది (165 మంది) మహారాష్ట్రకు చెందినవారే కావటం గమనార్హం.

 

WhatsApp Image 2020-10-13 at 10.19.12 AM.jpeg

****



(Release ID: 1663970) Visitor Counter : 258