ప్రధాన మంత్రి కార్యాలయం

‘స్వమిత్వ’ పథకం కింద ఆస్తి కార్డుల భౌతిక పంపిణీని ప్రారంభించిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 11 OCT 2020 5:46PM by PIB Hyderabad

ఈ రోజు, వారి ఇళ్లకు సంబంధించి యాజమాన్య పత్రాలు లేదా ఆస్తి కార్డులు పొందిన, వారి కార్డులను డౌన్‌లోడ్ చేసుకొన్న లక్ష మందిని నేను అభినందిస్తున్నాను. ఇవాళ, మీరు మీ కుటుంబంతో కలిసి కూర్చోని, సాయంత్రం ఆహారం తినే సమయంలో … ఈ రోజు మీకు కలిగినంత ఆనందం ఇంతకు మునుపెన్నడూ మీకు కలిగి ఉండదని నాకు తెలుసు. ఇది మీ ఆస్తి అని ఇప్పుడు మేము నిశ్చయంగా చెప్పగలం, మీరు దానిని వారసత్వంగా పొందుతారు అని మీరు మీ పిల్లలకు గర్వంగా చెప్పగలుగుతారు.. మన పూర్వీకులు ఇచ్చినది కేవలం కాగితం కాదు, ఈ రోజు కాగితం పొందడం ద్వారా మన బలం పెరిగింది. ఈ సాయంత్రం మీకు చాలా సంతోషకరమైన సాయంత్రం, కొత్త కొత్త కలలు కనే సాయంత్రం మరియు కొత్త కొత్త కలల గురించి పిల్లలతో మాట్లాడే ఓ సాయంత్రం. అందువల్ల, ఈ రోజు మీరు పొందిన హక్కు గురించి  నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను.

ఈ హక్కు ఒక విధంగా చట్టపరమైన పత్రం. మీ ఇల్లు మీదే, మీరు మీ ఇంట్లోనే ఉంటారు. మీ ఇంటిని ఏ విధంగా ఉపయోగించాలనే విషయాన్ని మీరు నిర్ణయించుకుంటారు.  ప్రభుత్వం గానీ చుట్టుపక్కల ఉన్న ప్రజలు గానీ ఏ విధమైన జోక్యం చేసుకోరు.

స్వమిత్వ పథకం గ్రామీణ భారతాన్ని సమూలంగా మార్చే చారిత్రక ఘట్టం కానుంది. మనమంతా దీనికి సాక్ష్యంగా నిలుస్తున్నాం.

ఈ రోజు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మండలిలో నా సహచరుడు శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ గారు, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ దుష్యంత్ సింగ్ చౌతాలా గారు, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి శ్రీ త్రివేంద్ర సింగ్ రావత్ గారు, ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ గారు, మధ్య ప్రదేశ్ సీఎం శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్ గారు, వివిధ రాష్ట్రాల మంత్రులు కూడా ఉన్నారు. స్వమిత్వ (యాజమాన్య) పథకం యొక్క ఇతర లబ్ధిదారుల భాగస్వాములు కూడా ఈ రోజు మన మధ్య ఉన్నారు. నరేంద్ర సింగ్ జీ చెప్పినట్లు ... ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 1.25 కోట్లకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు మరియు ఈ కార్యక్రమంలో మనతో పాటు చేరారు. ఈ రోజు ఈ వర్చువల్ సమావేశంలో చాలా మంది గ్రామస్తులు పాల్గొనడం అంటే స్వమిత్వ (యాజమాన్య) పథకం ఎంత ఆకర్షణీయమైనదో, శక్తివంతమైనదో మరియు ముఖ్యమైనదో చెప్పడానికి ఇది నిదర్శనం

నేడు, దేశం ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో మరొక ప్రధాన ముందడుగు వేసింది. గ్రామంలో నివసిస్తున్న మన సోదరసోదరీమణులు స్వయం సమృద్ధి పొందడానికి స్వమిత్వ (యాజమాన్య) పథకం దోహదపడుతుంది. నేడు, హర్యానా, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్ మరియు ఉత్తర ప్రదేశ్ లోని వేలాది కుటుంబాలకు వారి ఇళ్ల చట్టపరమైన పత్రాలను అందజేశారు. రాబోయే మూడు, నాలుగు సంవత్సరాల్లో, దేశంలోని ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటికి అలాంటి ఆస్తి కార్డు ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది.

మరియు మిత్రులారా, ఈ రోజు ఇంత పెద్ద పని జరుగుతుండటం నాకు చాలా సంతోషంగా ఉంది ... ఈ రోజు చాలా ముఖ్యమైనది. భారతదేశ చరిత్రలో నేటి రోజు కూడా ఎంతో ప్రాముఖ్యత ను కలిగి ఉంది. అదే, నేడు దేశంలోని ఇద్దరు గొప్ప పుత్రుల జయంతి. ఒకరు భారత్ రత్న లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్, మరొకరు భారత్ రతన్ నానాజీ దేశ్ ముఖ్. ఈ ఇద్దరు మహనీయుల పుట్టినరోజు కేవలం ఒకే రోజున వస్తోందని మాత్రమే కాదు, దేశంలో అవినీతికి వ్యతిరేకంగా ఆలోచించడం, దేశంలో నిజాయితీ, దేశంలోని పేదల సంక్షేమం, గ్రామ సంక్షేమం కోసం ఆలోచించటంలో ఇద్దరి ఆలోచన… ఇద్దరి ఆదర్శాలు… ఇద్దరి ప్రయత్నాలు ఒకటే.

జయప్రకాష్ బాబు సంపూర్ణ విప్లవానికి పిలుపునిచ్చినప్పుడు, బీహార్ భూమి నుండి వచ్చిన ఓ స్వరం, జయప్రకాష్ జీ ఏ కలలైతే కన్నారో .. ఆ కలలు ఫలించేలా… ఒక కవచం లాగా నానాజీ దేశ్ ముఖ్ పనిచేసారు. నానాజీ గ్రామాల అభివృద్ధి కోసం తన కార్యకలాపాలను విస్తరించినప్పుడు, జయప్రకాష్ బాబు నుండి నానాజీ ప్రేరణ పొందారు.

గ్రామం మరియు పేదల గొంతు వినిపించడానికి సహకారం ఎంత అద్భుతమైనదో ఇప్పుడు చూడండి.జయప్రకాష్ బాబు, నానాజీల జీవిత సంకల్పం ఎప్పుడూ ఇదే ఉండేది.

నేను ఎక్కడో చదివాను, ఓ సారి డాక్టర్ కలాం చిత్రకూట్ లో నానాజీ దేశ్ ముఖ్ ను కలిసినప్పుడు, మన చుట్టూ ఉన్న డజన్ల కొద్దీ గ్రామాలు వ్యాజ్యాల నుండి పూర్తిగా విముక్తి పొందాయని నానాజీ అతనితో చెప్పారు, అంటే కోర్టు-కచేరీ  లేదు - ఎవరిపై ఎఫ్‌ఐఆర్ లేదు. గ్రామ ప్రజలు వివాదాల్లో చిక్కుకున్నప్పుడు, వారు తమను లేదా సమాజాన్ని అభివృద్ధి చేయలేరని నానాజీ అనేవారు . మన గ్రామాల్లో అనేక వివాదాలకు ముగింపు పలకడానికి స్వమిత్వ (యాజమాన్య) పథకం కూడా ఒక ప్రధాన మాధ్యమంగా మారుతుందని నేను విశ్వసిస్తున్నాను.

మిత్రులారా, భూమి మరియు ఇంటి యాజమాన్యం దేశ అభివృద్ధిలో పెద్ద పాత్ర పోషిస్తోందని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద నిపుణులు పట్టుబట్టి మరీ చెబుతున్నారు. ఆస్తి కి సంబంధించిన రికార్డు ఉన్నప్పుడు, ఆస్తిని సాధికారం చేసినప్పుడు, ఆస్తిని కూడా కాపాడి, పౌరుడి జీవితం కూడా కాపాడబడుతుంది మరియు పౌరుల్లో ఆత్మవిశ్వాసం అనేక రెట్లు పెరుగుతుంది. ఆస్తి కి సంబంధించిన రికార్డు ఉన్నప్పుడు, పెట్టుబడి పెట్టడానికి, కొత్త కొత్త సాహసాలు చేయడానికి, ఆర్థిక పునరుద్ధరణ కోసం కొత్త ప్రణాళికలు రూపొందించడానికి అనేక మార్గాలు తెరుచుకుంటాయి.

ఆస్తి రికార్డు ఆధారంగా బ్యాంకు నుంచి రుణం తేలికగా లభిస్తుంది, ఉపాధి మరియు స్వయం ఉపాధి కి సంబంధించిన కొత్త మార్గాలు సృష్టించబడతాయి. కానీ సమస్య ఏమిటంటే ప్రపంచంలో మూడింట ఒక వంతు జనాభా మాత్రమే నేడు వారి ఆస్తికి సంబంధించి చట్టపరమైన రికార్డు కలిగి ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా మూడింట రెండు వంతుల మందికి లేదు. అటువంటి పరిస్థితిలో, భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశ ప్రజలు తమ ఆస్తిగురించి ఖచ్చితమైన రికార్డ్ కలిగి ఉండటం చాలా ముఖ్యం. నిరక్షరాస్యులు, వృద్దాప్యంలో ఉన్నవారు, కష్టతరమైన జీవితాన్ని గడిపేవారు ఇప్పుడు నూతన ఆత్మవిశ్వాసంతో జీవితాన్ని ప్రారంభించబోతున్నారు.

దోపిడీకి గురైన, అణగారిన గ్రామస్తుల సంక్షేమానికి భరోసా ఇచ్చే దిశలో స్వమిత్వ (యాజమాన్య) పథకం, దాని క్రింద లభించే ఆస్తి కార్డు ఒక పెద్ద అడుగు. ఆస్తి కార్డు తో గ్రామ ప్రజలు ఎలాంటి వివాదం లేకుండా ఆస్తులు కొనుగోలు చేసి అమ్మడానికి మార్గం సుగమం చేస్తుంది. ఆస్తి కార్డు పొందిన తరువాత, గ్రామస్థులు తమ ఇంటిని ఆక్రమించుకుంటారనే భయం నుంచి విముక్తి పొందుతారు. ఎవరో వచ్చి తమ హక్కులను నకిలీ పేపర్లతో చూపిస్తారు ... తప్పుడు పత్రాలు ఇస్తారు ... తీసుకుంటారు ... - ఇవన్నీ ఇప్పుడు ఆగిపోతాయి. ఆస్తి కార్డు పొందిన తరువాత, మీరు గ్రామంలోని  గృహాలపై కూడా బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొందుతారు.

మిత్రులారా,

ఈ రోజు మన గ్రామ యువత చాలా మంది సొంతంగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. ఆత్మవిశ్వాసంతో స్వావలంబన పొందాలనుకుంటున్నారు. కానీ ఇల్లు మరియు కొంత భూమి ఉన్నప్పటికీ, వారి వద్ద ఎలాంటి పత్రాలు లేవు, ప్రభుత్వ పత్రం లేదు. వారి మాట వినడానికి ఎవరూ ఇష్టపడలేదు. వారికి ఏమీ రాలేదు. ఇప్పుడు వారు తమ హక్కుగా  రుణం పొందడానికి కావల్సిన ఈ కాగితం వారి చేతుల్లో ఉంది. ఇప్పుడు స్వమిత్వ (యాజమాన్య) పథకం కింద చేసిన ఆస్తి కార్డు చూపించడం ద్వారా, బ్యాంకుల నుండి రుణాలు పొందడం చాలా సులభం.

మిత్రులారా,

ఈ స్వమిత్వ  పత్రం యొక్క మరొక ప్రయోజనం గ్రామంలో కొత్త సౌకర్యాల అభివృద్ధికి సంబంధించినది. డ్రోన్ మ్యాపింగ్, సర్వే వంటి కొత్త సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి గ్రామంలో కచ్చితమైన భూ రికార్డు కూడా నమోదు చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ ప్రారంభసమయంలో నేను అధికారులతో మాట్లాడుతున్నప్పుడు, అధికారులు గ్రామం లోపల ఒక ఆస్తిని మ్యాపింగ్ చేయడానికి డ్రోన్ ను ఎగరేస్తున్నప్పుడు, గ్రామస్థులకు తమ భూమి మీద కొంత ఆసక్తి ఉండటం సహజమే, అయితే ప్రతి ఒక్కరూ ఒక డ్రోన్ సహాయంతో గ్రామాన్ని చూడాలని కోరుకున్నారు. మా గ్రామం ఎలా ఉంది, మా గ్రామం ఎంత అందంగా ఉంది,తమ గ్రామం ఎలా ఉందో చూడాలని వారు కోరారు. తమ గ్రామాన్ని పై నుంచి కొంత సమయం పాటు చూపించడం తప్పనిసరి అయిందని అధికారులు తెలిపారు. పల్లెల మీద ప్రేమ రగిలించింది.

సోదర,సోదరీమణులారా ,

ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఎక్కడ నిర్మించాలనే దానిపై స్పష్టత లేదు. అధికారప్రతినిధి లేదా ప్రధాన్ లేదా ఎవరైనా శక్తిమంతుడైన వ్యక్తి మాత్రమే తమకు ఇష్టమైతే  దాన్ని పూర్తి చేస్తాడు. ఇప్పుడు మ్యాప్ సిద్ధం అయింది, నిర్మాణం గురించి ప్రతిదీ కూడా తేలికగా నిర్ణయించబడుతుంది. ఎలాంటి వివాదం ఉండదు. భూరికార్డుల ప్రక్షాళన వల్ల గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులన్నీ చాలా సులభంగా పూర్తి అవుతాయి.

మిత్రులారా,

గత 6 సంవత్సరాలుగా, మన పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరియు అది కూడా స్వమిత్వ (యాజమాన్య) పథకంతో బలోపేతం అవుతుంది. అనేక పథకాల ప్రణాళిక, అమలు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంది. ఇప్పుడు గ్రామ ప్రజలు తమ గ్రామ అభివృద్ధికి ఏమి అవసరమో, అక్కడి సమస్యలను ఎలా పరిష్కరించాలో స్వయంగా నిర్ణయించుకుంటున్నారు. 

పంచాయతీల పనులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా, పంచాయితీ ద్వారా చేయబడ్డ అన్ని అభివృద్ధి పనులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయబడింది. బావిని నిర్మిస్తే, బావి ఏ మూలలో నిర్మించబడిందో ఇక్కడ నా కార్యాలయానికి కూడా తెలుస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఒక వరం. మరియు ఇది తప్పనిసరి. మరుగుదొడ్లు నిర్మించినప్పుడు, పాఠశాల నిర్మించినప్పుడు జియో ట్యాగింగ్ చేయబడుతుంది. చిన్న ఆనకట్ట నిర్మిస్తే జియో ట్యాగింగ్ జరుగుతుంది. ఫలితంగా, డబ్బు మళ్లింపు ఆగిపోతుంది. ప్రతిదీ లెక్క చూపించవలసి ఉంటుంది మరియు మనం చూడవచ్చు.

మిత్రులారా,

స్వమిత్వ (యాజమాన్య) పథకం మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్ల మాదిరిగానే మన గ్రామ పంచాయతీలకు క్రమబద్ధమైన పద్ధతిలో గ్రామ నిర్వహణను సులభతరం చేస్తుంది. గ్రామ పంచాయతీలు గ్రామంలో సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, గ్రామంలోనే వనరులను సేకరించగలుగుతాయి. ఒక విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి గ్రామ వాసులకు అందించే పత్రాలు కూడా సహాయపడతాయి.

మిత్రులారా,

భారతదేశం యొక్క ఆత్మ గ్రామాలలో నివసిస్తుందని ఎల్లప్పుడూ చెబుతారు, కాని నిజం ఏమిటంటే భారతదేశ గ్రామాలు వాటి స్వంత విధికి మిగిలిపోయాయి. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఏ ప్రదేశం ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంది? అది గ్రామాలు. విద్యుత్ లేకపోవడం వల్ల ఏ ప్రదేశం ఎక్కువగా నష్టపోయింది? అది గ్రామాలు. చీకటిలో ఎవరు జీవించాల్సి వచ్చింది? గ్రామస్తులు! ఇంధన కలపపై వంట చేయడం ఎక్కడ తప్పనిసరి? గ్రామాల్లో! బ్యాంకింగ్ వ్యవస్థ నుండి గరిష్ట దూరం లో ఉన్నవారు ఎవరు? గ్రామస్థులు!

మిత్రులారా,
ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు ఎన్నోపెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కానీ, గ్రామాన్ని, గ్రామాలకు చెందిన పేద ప్రజలను ఇబ్బందుల్లో పడేశారు. నేను కూడా అలా చేయలేను. మీ ఆశీర్వాదాలతో, నేను మీ కోసం చేయగలిగినదంతా చేస్తాను. నేను మీ కోసం పని చేయాలనుకుంటున్నాను. నేను గ్రామాల కోసం చాలా చేయాలనుకుంటున్నాను; నేను పేదల కోసం పనిచేయాలనుకుంటున్నాను; బాధిత, దోపిడీకి గురైనవారికి, అణగారినవారి కోసం పనిచేయాలనుకుంటున్నాను. తద్వారా వారు ఎవరిపైనైనా ఆధారపడనవసరం లేదు.. వారు ఇతరుల ఇష్టానికి బానిసలుగా ఉండకూడదు.

కానీ మిత్రులారా,
గత 6 సంవత్సరాల్లో, అటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి, మేము ఒక్కొక్కటిగా పనిచేయడం ప్రారంభించాం గ్రామాలకు మరియు పేదలకు ఫలితాలను అందించాం. నేడు దేశం ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరూ పూర్తి పారదర్శకతతో పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు.

సోదర, సోదరీమణులారా ,

ఇప్పటి వరకు చాలా గ్రామాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు, మార్కెట్లు, ఇతర ప్రభుత్వ సౌకర్యాలు ఎక్కడ నిర్మించాలనే దానిపై స్పష్టత లేదు. అధికారప్రతినిధి లేదా ప్రధాన్ లేదా ఎవరైనా శక్తిమంతుడైన వ్యక్తి మాత్రమే తమకు ఇష్టమైతే  దాన్ని పూర్తి చేస్తాడు. ఇప్పుడు మ్యాప్ సిద్ధం అయింది, నిర్మాణం గురించి ప్రతిదీ కూడా తేలికగా నిర్ణయించబడుతుంది. ఎలాంటి వివాదం ఉండదు. భూరికార్డుల ప్రక్షాళన వల్ల గ్రామాభివృద్ధికి సంబంధించిన పనులన్నీ చాలా సులభంగా పూర్తి అవుతాయి.

మిత్రులారా,

గత 6 సంవత్సరాలుగా, మన పంచాయతీ రాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి, మరియు అది కూడా స్వమిత్వ (యాజమాన్య) పథకంతో బలోపేతం అవుతుంది. అనేక పథకాల ప్రణాళిక, అమలు చేసే బాధ్యత గ్రామ పంచాయతీలకు ఉంది. ఇప్పుడు గ్రామ ప్రజలు తమ గ్రామ అభివృద్ధికి ఏమి అవసరమో, అక్కడి సమస్యలను ఎలా పరిష్కరించాలో స్వయంగా నిర్ణయించుకుంటున్నారు. 

పంచాయతీల పనులన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లో కూడా జరుగుతున్నాయి. అంతేకాకుండా, పంచాయితీ ద్వారా చేయబడ్డ అన్ని అభివృద్ధి పనులకు జియో ట్యాగింగ్ తప్పనిసరి చేయబడింది. బావిని నిర్మిస్తే, బావి ఏ మూలలో నిర్మించబడిందో ఇక్కడ నా కార్యాలయానికి కూడా తెలుస్తుంది. ఇది సాంకేతిక పరిజ్ఞానం యొక్క ఒక వరం. మరియు ఇది తప్పనిసరి. మరుగుదొడ్లు నిర్మించినప్పుడు, పాఠశాల నిర్మించినప్పుడు జియో ట్యాగింగ్ చేయబడుతుంది. చిన్న ఆనకట్ట నిర్మిస్తే జియో ట్యాగింగ్ జరుగుతుంది. ఫలితంగా, డబ్బు మళ్లింపు ఆగిపోతుంది. ప్రతిదీ లెక్క చూపించవలసి ఉంటుంది మరియు మనం చూడవచ్చు.

మిత్రులారా,

స్వమిత్వ (యాజమాన్య) పథకం మునిసిపాలిటీలు మరియు మునిసిపల్ కార్పొరేషన్ల మాదిరిగానే మన గ్రామ పంచాయతీలకు క్రమబద్ధమైన పద్ధతిలో గ్రామ నిర్వహణను సులభతరం చేస్తుంది. గ్రామ పంచాయతీలు గ్రామంలో సౌకర్యాలను అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం నుండి సహాయం పొందడమే కాకుండా, గ్రామంలోనే వనరులను సేకరించగలుగుతాయి. ఒక విధంగా గ్రామ పంచాయతీలను బలోపేతం చేయడానికి గ్రామ వాసులకు అందించే పత్రాలు కూడా సహాయపడతాయి.

మిత్రులారా,

భారతదేశం యొక్క ఆత్మ గ్రామాలలో నివసిస్తుందని ఎల్లప్పుడూ చెబుతారు, కాని నిజం ఏమిటంటే భారతదేశ గ్రామాలు వాటి స్వంత విధికి మిగిలిపోయాయి. మరుగుదొడ్లు లేకపోవడం వల్ల ఏ ప్రదేశం ఎక్కువగా కష్టాలను ఎదుర్కొంది? అది గ్రామాలు. విద్యుత్ లేకపోవడం వల్ల ఏ ప్రదేశం ఎక్కువగా నష్టపోయింది? అది గ్రామాలు. చీకటిలో ఎవరు జీవించాల్సి వచ్చింది? గ్రామస్తులు! ఇంధన కలపపై వంట చేయడం ఎక్కడ తప్పనిసరి? గ్రామాల్లో! బ్యాంకింగ్ వ్యవస్థ నుండి గరిష్ట దూరం లో ఉన్నవారు ఎవరు? గ్రామస్థులు!

మిత్రులారా,
ఇన్ని సంవత్సరాలు అధికారంలో ఉన్న వారు ఎన్నోపెద్ద పెద్ద వాగ్దానాలు చేశారు కానీ, గ్రామాన్ని, గ్రామాలకు చెందిన పేద ప్రజలను ఇబ్బందుల్లో పడేశారు. నేను కూడా అలా చేయలేను. మీ ఆశీర్వాదాలతో, నేను మీ కోసం చేయగలిగినదంతా చేస్తాను. నేను మీ కోసం పని చేయాలనుకుంటున్నాను. నేను గ్రామాల కోసం చాలా చేయాలనుకుంటున్నాను; నేను పేదల కోసం పనిచేయాలనుకుంటున్నాను; బాధిత, దోపిడీకి గురైనవారికి, అణగారినవారి కోసం పనిచేయాలనుకుంటున్నాను. తద్వారా వారు ఎవరిపైనైనా ఆధారపడనవసరం లేదు.. వారు ఇతరుల ఇష్టానికి బానిసలుగా ఉండకూడదు.

కానీ మిత్రులారా,
గత 6 సంవత్సరాల్లో, అటువంటి ప్రతి సమస్యను పరిష్కరించడానికి, మేము ఒక్కొక్కటిగా అన్నీ పనులను  చేయడం ప్రారంభించాం.  గ్రామాలకు, పేదలకు ఫలితాలను అందించాం. నేడు దేశం ఎటువంటి వివక్ష లేకుండా అభివృద్ధి చెందుతోంది. ప్రతి ఒక్కరూ పూర్తి పారదర్శకతతో పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు.

స్వమిత్వ వంటి యోజన ఇంతకు ముందే తయారు చేయగలిగితే… సరే ఆ సమయంలో డ్రోన్లు లేవు… గ్రామస్తులతో కలిసి కూర్చోవడం ద్వారా పరిష్కారాలు ఆలోచించబడవచ్చు. … కానీ అది జరగలేదు. ఇది జరిగి ఉంటే, మధ్యవర్తులు, అవినీతి, బ్రోకర్లు లేదా ఎలాంటి బలవంతం ఉండేది కాదు. ఇప్పుడు రూపొందించబడిన పథకం యొక్క బలం సాంకేతికత అంటే డ్రోన్లు. అంతకుముందు బ్రోకర్లు గ్రౌండ్ మ్యాపింగ్‌లో ఆధిపత్యం చెలాయించేవారు, కాని ఇప్పుడు డ్రోన్‌లతో మ్యాపింగ్ చేస్తున్నారు. డ్రోన్ చూసే వాటిని కాగితంపై రికార్డ్ చేస్తున్నారు.
మిత్రులారా,

భారత దేశంలోని గ్రామాలకు, గ్రామాలలో నివసించే ప్రజల కోసం గత ఆరేళ్లలో చేసిన పనులు స్వాతంత్య్రం వచ్చిన ఆరు దశాబ్దాలలో కూడా చేయలేదు. ఆరు దశాబ్దాలుగా గ్రామాల్లో కోట్లాది మంది బ్యాంకు ఖాతాలకు నోచుకోలేకపోయారు. ఈ ఖాతాలు ఇప్పుడు తెరవబడ్డాయి. ఆరు దశాబ్దాలుగా గ్రామాల్లో కోట్ల మందికి విద్యుత్ కనెక్షన్ లేదు. నేడు విద్యుత్తు చివరకు ప్రతి ఇంటికి చేరుకుంది. ఆరు దశాబ్దాలుగా గ్రామాల్లో కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్లు లేవు. నేడు,ప్రతి ఇంటిలో కూడా మరుగుదొడ్లు నిర్మించబడ్డాయి.

మిత్రులారా,

దశాబ్దాలుగా గ్రామాల పేదలు గ్యాస్ కనెక్షన్ గురించి కూడా ఆలోచించలేని పరిస్థితి. నేడు, గ్యాస్ కనెక్షన్ కూడా పేదల ఇంటికి చేరుకుంది. దశాబ్దాలుగా, గ్రామాల్లోని కోట్ల కుటుంబాలకు సొంత ఇల్లు లేదు. ఈ రోజు సుమారు 2 కోట్ల మంది పేద కుటుంబాలకు పక్కా ఇళ్ళు వచ్చాయి మిగతా వారు కూడా పక్కా ఇళ్లను అతి త్వరలో అందుకునేలా నా ప్రయత్నాలన్నింటినీ చేస్తున్నాను. దశాబ్దాలుగా, గ్రామాల్లోని ఇళ్ళల్లో  పైపుల ద్వారా నీటి సరఫరా… ఎవరూ ఊహించలేదు… మన తల్లులు, సోదరీమణులు చాలా కిలోమీటర్లు నడుస్తూ వారి తలపై భారీ నీటి కుండలను మోయవలసి వచ్చేది.. ఇప్పుడు ప్రతి ఇంటికి నీరు చేరుకుంది. జల్-జీవన్ మిషన్  ద్వారా ఈ రోజు, దేశంలోని 15 కోట్ల గృహాలకు పైపుల ద్వారా తాగునీటిని సరఫరా చేస్తున్నారు. 

దేశంలోని ప్రతి గ్రామంలో ఆప్టికల్ ఫైబర్ల నెట్ వర్క్ ను విస్తరించేందుకు భారీ ఎత్తున ప్రయత్నం జరుగుతోంది. ఇంతకు ముందు విద్యుత్ అడపాదడపా వచ్చి వెళుతుందని ప్రజలు చెప్పేవారు ... ఇప్పుడు మొబైల్ ఫోన్‌లో సిగ్నల్స్ బలహీనంగా వస్తున్నాయని ప్రజలు ఫిర్యాదు చేస్తున్నారు. ఈ సమస్యలకు పరిష్కారం ఆప్టికల్ ఫైబర్‌లో ఉంటుంది. 

మిత్రులారా,

కొరత ఉన్న చోట, శక్తివ౦తమైన శక్తుల ఒత్తిడి ప్రజలను పట్టిపీడి౦చేలా ఉ౦టు౦ది. గ్రామాలు, పేదలను కొరత మధ్య ఉంచడం కొందరి రాజకీయ వ్యూహంగా చరిత్ర చెబుతోంది. పేదలను కొరత నుంచి విముక్తి చేయాలనే కార్యక్రమాన్ని ప్రారంభించాం.

సోదర సోదరీమణులారా, గ్రామం, పేదలు, రైతులు, గిరిజనులు బలంగా మారితే వారిని ఎవరు అడుగుతారు, వారి దుకాణం నడవదు, ఎవరు చేతులు, కాళ్ళు పట్టుకుంటారు? వారి ముందు ఎవరు నమస్కరిస్తారు? అందువల్ల, గ్రామ సమస్యలు చెక్కుచెదరకుండా ఉండాలని, ప్రజల పనిని కొనసాగించాలని, వారి పనిని కొనసాగించేలా ఉండాలని వారికి మిగిలింది. అందువల్ల, పనిలో వేలాడదీయడం, వేలాడదీయడం మరియు సంచరించడం అతని అలవాటుగా మారింది.

సోదర సోదరీమణులారా, గ్రామాలు, పేదలు, రైతులు, గిరిజనులు సాధికారత సాధిస్తే, వారిని ఎవరు అడుగుతారు, వారి దుకాణాలు నడవవు, వారి చేతులు, కాళ్లు ఎవరు పట్టుకుంటారు? వారికి ఎవరు నమస్కరిస్తారు? తమ పనులను కొనసాగించడానికి వీలుగా, గ్రామాల్లోని సమస్యలు, ప్రజల సమస్యలు చెక్కుచెదరకుండా అలానే ఉండాలని వారు కోరుకొన్నారు. అందువల్ల ప్రస్తుతం జరుగుతున్న పనులను ఆలస్యం చేయడం, వాటికి అడ్డుగా నిలబడటం వారికి అలవాటుగా మారింది.

వ్యవసాయ రంగానికి సంబంధించిన చారిత్రక సంస్కరణలతో కూడా వీరికి సమస్యలు ఉన్నాయి. వీరు భయపడుతున్నారు. కానీ ఇప్పుడు వీరి భయాలకు రైతులతో ఎలాంటి సంబంధం లేదని దేశం అర్థం చేసుకోవడం ప్రారంభించింది. తరాల వారీగా, సృష్టించబడిన మధ్యవర్తులు, లంచాలు, బ్రోకర్ల వ్యవస్థ ఒక రకమైన మాయాజాలంగా ఏర్పాటైంది. వారి ప్రణాళికలను, ఉద్దేశ్యాలను దేశ ప్రజలు తిరస్కరించడం  ప్రారంభించారు.

ఒకవైపు కోట్ల మంది భారతీయులు నవ భారత అభివృద్ధిలో నిమగ్నమై ఉండగా, అలాంటి వారి నిజమైన రంగులు మరోవైపు బహిర్గతమవుతున్నాయి. దేశాన్ని దోచుకునేందుకు ప్రయత్నిస్తున్న వారిని దేశం ఇప్పుడు గుర్తిస్తున్నది. అందుకే ప్రస్తుతం ప్రతి విషయాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు.. వారు పేదల గురించి ఆందోళన చెందరు, గ్రామం లేదా దేశం గురించి ఆందోళన చెందరు. ప్రతి మంచి పనితో వారికి సమస్యే. వీరు దేశ అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తున్నారు. మన గ్రామాలు, పేదలు, మన రైతులు, మన కూలీ సోదరులు, సోదరీమణులు స్వావలంబన సాధించాలని వీరు కోరుకోరు. ఇవాళ మనం MSPని 1.5 రెట్లు పెంచాం, వారు మాత్రం చేయలేకపోయారు. 

రైతులు, పశుపాలకులు, మత్స్యకారులు కిసాన్ క్రెడిట్ కార్డులు పొందడం వల్ల నల్లధనం లభించే మార్గాల మూలం మూసివేయబడిన వారు ఈ రోజు కష్టపడుతున్నారు. యూరియా కు వేప పూత వేయడం వల్ల చట్టవిరుద్ధమైన పద్ధతులను ఆపివేసిన వారు సమస్యలు ఎదుర్కొంటున్నారు. రైతుల బ్యాంకు ఖాతాలకు ప్రత్యక్ష ప్రయోజన బదిలీ కారణంగా సమస్యలను ఎదుర్కొంటున్న వారు ఈ రోజు అశాంతికి లోనవుతున్నారు. రైతులు మరియు వ్యవసాయ కూలీలతో భీమా, పెన్షన్ వంటి సౌకర్యాలు పొందేవారు ఈ రోజు వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తున్నారు. కానీ రైతు వారితో వెళ్ళడానికి సిద్ధంగా లేడు; రైతు వారిని గుర్తించాడు.

మిత్రులారా,

ఈ బ్రోకర్లు, మధ్యవర్తులు మరియు లంచం తీసుకునేవారి సహాయంతో రాజకీయాలు చేసే వారు ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా దేశం ముందుకు వెళ్ళడం ఆగిపోదు. గ్రామాన్ని, పేదలను స్వయం సమృద్ధిగా తీర్చిదిద్ది, భారతదేశ సామర్థ్యాన్ని గుర్తించడానికి దేశం కృతనిశ్చయంతో ఉంది.

ఈ సంకల్పాన్ని సాధించడం లో స్వమిత్వ పథకం పాత్ర కూడా చాలా పెద్దది. అందుకే ఇంత తక్కువ కాలంలో స్వమిత్వ పథకం ద్వారా లక్ష కుటుంబాలకు ఇవాళ లబ్ధి చేకూరింది. నరేంద్ర సింగ్ గారికి, ఆయన బృందం మొత్తానికి నేను ప్రత్యేకంగా ఈ రోజు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంత తక్కువ సమయంలో ఇంత గొప్ప పని చేసిన వారిని కూడా అభినందిస్తున్నాను. ఇది  చిన్న పని ఏం కాదు, గ్రామ-గ్రామానికి వెళ్లడం, అది కూడా ఈ లాక్డౌన్ సమయంలో ఇంత గొప్ప పని చేయడం. ఈ వ్యక్తులను మనం ఎంత ఎక్కువగా అభినందించినా తక్కువే.

ఈ ప్రభుత్వంలో, ప్రతి స్థాయిలో, ప్రతి అధికారి చేసిన పని ద్వారా, మనం నాలుగు సంవత్సరాలు వేచి ఉండాల్సిన అవసరం లేదనే నమ్మకం నాకు కలిగింది. మొత్తం దేశానికి కూడా సమయానికంటే ముందుగానే ఈ పథకాన్ని ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇది చాలా పెద్ద పని, నేను ఏప్రిల్‌లో దీనిని ప్రతిపాదించినప్పుడు, నేను కొద్దిగా ఎక్కువ డిమాండ్ చేస్తున్నానని భావించాను. కానీ నేను అడిగిన దానికంటే ఎక్కువ చేశారు. అందుకే నరేంద్ర సింగ్ గారి బృందం, ఆయన విభాగం లోని వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు. అదే సమయంలో, నేడు, ఈ ప్రయోజనాన్ని పొందిన వారి కుటుంబాలలో ఆత్మవిశ్వాసం  పెరిగింది. మీ ముఖం మీద ఉన్న ఆనందం నాకు గొప్ప సంతృప్తినిస్తోంది. మీ ఆనందమే నా ఆనందానికి కారణం. మీ కలలను సాకారం చేసుకోవడానికి మీ జీవితంలో వచ్చిన అవకాశం నా కలలను సాకారం చేసుకోవడానికి నాకు సహాయపడుతుంది.

సోదర సోదరీమణులారా, నేను మీకంటే సంతోషంగా ఉన్నాను, ఎందుకంటే నేడు నా కుటుంబాలలోని లక్ష కుటుంబాలు తమ ఆస్తి పత్రాలతో ప్రపంచం ముందు ఆత్మ విశ్వాసంతో, ఆత్మ గౌరవంతో ధైర్యంగా నిలబడ్డాయి. ఇది ఒక గొప్ప అవకాశం మరియు అది కూడా జెపి పుట్టినరోజున, నానా జీ పుట్టినరోజున, ఇంతకన్నా ఆనందం ఇంకేమున్నది?

నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను,... కానీ అదే సమయంలో మేము కరోనా మహమ్మారి సమయంలో ముసుగులు ధరించడం, సామాజిక దూరం మరియు తరచుగా సబ్బుతో చేతులు కడుక్కోవడాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తున్నాం. మీరు, మీ కుటుంబం మరియు మీ గ్రామం అస్వస్థతగా ఉండాలని మేం కోరుకోవడం లేదు. దీని గురించి మనం ఆందోళన చెందుతున్నాం మరియు ఈ వ్యాధి కి ఇంకా ప్రపంచంలో ఎలాంటి ఔషధం లేదని మనకు తెలుసు.

మీరంతా నా కుటుంబం ... అందువల్ల నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను, ‘జబ్ తక్ దవాయ్ నహి, తబ్ తక్ ధిలాహీ  నహి’ (ఔషధం రానంత వరకూ అజాగ్రత్త వద్దు). ఈ మంత్రాన్ని మర్చిపోవద్దు. ఇదే నమ్మకంతో, నేను మీకు మరోసారి అన్ని ఆనందాలు, సంతోషాలు కలగాలని నా శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను!

చాలా చాలా ధన్యవాదాలు!

***

(Release ID: 1663627) Visitor Counter : 326