యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
ఒలింపిక్స్‌కు శిక్షణను తిరిగి ప్రారంభించేందుకు నిర్ధిష్ట విధివిధానాలు ప్రకటించిన
క్రీడా మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని స్వాగతించిన ఈతగాళ్ళ సమాజం
Posted On:
10 OCT 2020 5:56PM by PIB Hyderabad
దేశవ్యాప్తంగా స్విమ్మింగ్ పూళ్ళను తెరవాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని భారత స్విమ్మింగ్ సమాజం ఆహ్వానించింది. పోటీలో పాల్గొనే ఈతగాళ్ళు స్విమ్మింగ్ పూళ్ళను ఉపయోగించుకునేందుకు ప్రమాణబద్ధమైన విధి విధానాలను శుక్రవారం నాడు క్రీడా మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. కంటైన్‌మెంట్ జోన్లలో ఉన్నవి మినహా ఇతర ప్రాంతాలన్నింటిలోని స్విమ్మింగ్ పూళ్ళను తిరిగి తెరిచేందుకు అనుమతిస్తూ కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది.
ఇది చాలా అద్భుతమైన నిర్ణయం. ఈతగాళ్ళు తిరిగి ఫార్్మలోకి వచ్చి త్వరలోనే పోటీలలో పాల్గొనేందుకు అవకాశం వచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పూర్తి మద్దతునిచ్చేలా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకుంటాయని ఆశిస్తున్నాను. పోటీలలో పాల్గొనే ఈతగాళ్లు అందరూ తమ శిక్షణను ప్రారంభించేందుకు అవకాశం కలుగుతుందని భావిస్తున్నాను అని, ఒలింపిక్స్ బి మార్్క అర్హతను సంపాదించి, 2008 ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఆరుగురు భారతీయ ఈతగాళ్ళల్లో ఒకరైన వీర్ ధావల్ ఖడే అన్నారు.
ఈతగాళ్ళకు దుబాయ్‌లో రెండు నెలల శిక్షణను గత ఆగస్టులో స్పోర్ట్్స అథారిటీ ఆఫ్ ఇండియా మంజూరు చేసింది. బి అర్హత మార్క్‌ను సాధించిన శ్రీహరి నటరాజ్, కుశాగ్రా రావత్, సాజన్ ప్రకాశ్ ఈ శిక్షణకు హాజరయ్యారు. దుబాయ్‌లో శిక్షణ పొందినప్పటికీ, భారత్‌లో మరొక్కసారి శిక్షణ పొందడం పట్ల నటరాజ్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భారత దేశంలో స్విమ్మింగ్ పూళ్ళు తెరుచుకుంటున్నందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇంట్లోనే ఉండి శిక్షణ పొందడం చాలా ఉత్తమంగా అనిపిస్తోంది. ఎందుకంటే, అత్యుత్తమ సామర్ధ్యం కోసం షెడ్యూల్‌ను రూపొందించడానికి నాకు మద్దతునిచ్చే సిబ్బంది ఇక్కడ అందుబాటులో ఉంది, అన్నారు.
కోవిడ్ -19 కారణంగా జాప్యం జరిగినప్పటికీ, వాయిదా వేసిన ఒలింపిక్స్ భారతీయ ఈతగాళ్ళకు తోడ్పడవచ్చు. శిక్షణను ప్రారంభించడం అన్నది ఈ దశలో ఒక సానుకూలమైన అడుగు అని ద్రోణాచార్య అవార్డు గ్రహీత, కోచ్ నిహార్ అమీన్ అభిప్రాయపడ్డారు. మన ఈతగాళ్లు తమ శిక్షణను తిరిగి ప్రారంభించేందుకు అనుమతిస్తున్నారన్న వార్తతో నేను చాలా సంతోష పడ్డాను. కోవిడ్ మహమ్మారి కారణంగా మన ఈతగాళ్ళందరూ కొంత దెబ్బతిన్నారు. ఒలింపిక్్సను వాయిదా వేయడం అన్నది మన ఈతగాళ్ళు తిరిగి ఫార్మ్‌లోకి వచ్చేందుకు తప్పక తోడ్పడుతుంది. ఒలింపిక్ బి అర్హత పొందిన మన ఆటగాళ్లందరూ ఎ అర్హత పొందేందుకు కఠిన సాధన చేస్తారని విశ్వసిస్తున్నాను. దేశవ్యాప్తంగా ఉన్న ఈతగాళ్ళందరూ శిక్షణ ప్రారంభం గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నారని ఆయన చెప్పారు.
ఈత కొ్ట్టడానికి విధివిధానాలు నిర్ణయించడాన్ని ఆహ్వానిస్తూ, ఈతపోటీలను ప్రభుత్వం అనుమతించినందుకు మేం ఎంతో సంతోషిస్తున్నాం. క్రీడల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన విధివిధానాల పత్రం సమగ్రమైంది, మంచి ఆలోచనలతో కూడింది. మన క్రీడాకారుల రక్షణ కోసం ఈ మార్గదర్శకాలను అనుసరించడం గురించి ప్రచారం చేయడం మా ప్రాధాన్యతగా పెట్టుకుంటామని, స్విమ్మింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెక్రెటరీ జనరల్ మోనాల్ చోక్సీ అన్నారు.
***
(Release ID: 1663453)
Visitor Counter : 135