ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
35 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రతి 10 లక్షల మందిలో 140 కోవిడ్ పరీక్షలు
22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ శాతం పాజిటివ్ కేసులు
వరుసగా 17వ రోజు కూడా చికిత్సలో ఉన్న కేసులు లక్ష లోపే
Posted On:
08 OCT 2020 11:20AM by PIB Hyderabad
జనవరి నుంచి భారత్ లో కోవిడ్-19 పరీక్షల మౌలిక సదుపాయాలు భారీగా పెరిగాయి. రోజూ 15 లక్షల శాంపిల్స్ పరీక్షించగలిగే సామర్థ్యం వచ్చింది.
ప్రతి పది లక్షల జనాభాలో 140 పరీక్షలు జరపాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్ధ సూచన పాటించగలగటం విశేషం. ప్రజారోగ్య పరిరక్షణకు భారత్ తీసుకున్న చర్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీ చేసిన మార్గం దర్శక పత్రంలో అభినందించింది. అదే సమయంలో అనుమానిత కేసులో ఆనవాలు పట్టటానికి అనుసరించాల్సిన సమగ్ర వ్యూహాన్ని సూచించింది.
వరుసగా సాధిస్తున్న ఘనతలకు తోడుగా 35 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సూచించిన పరీక్షల సంఖ్య దాటింది. భారత్ లో ప్రతి 10 లక్షల మంది జనాభాలో సగటున 865 మందికి పరీక్షలు జరిగాయి.
గడిచిన 24 గంటల్లో దేశంలో 12 లక్షల (11 ,94,321) కోలివుడ్ పరీక్షలు జరిగాయి. ఇప్పటివరకు జరిగిన పరీక్షల సంఖ్య 8.34 కోట్లు దాటింది.( కచ్చితంగా చెప్పాలంటే 8,34,65,975 పరీక్షలు).
ఇప్పటిదాకా కనిపించిన ఆధారాలను బట్టి చూస్తే, ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరిగే కొద్దీ వాళ్లందరికీ చికిత్స చేయటం ద్వారా కోలుకుంటున్నవారిని పెంచగలిగినట్టు రుజువైంది. అదే విధంగా మరణాలను తగ్గించగలుగుతాం. జాతీయ స్థాయిలోపాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.
అత్యధిక స్థాయిలో నిర్థారణ పరీక్షలు జరగటం వలన త్వరగా బాధితులను గుర్తించి తగిన విధంగా చికిత్స అందించటం కుదురుతుంది. నిఘా పెట్టటం ద్వారా వ్యాధి సోకే అవకాశం ఉన్నవాళ్లను గుర్తించి తీవ్రతను బట్టి ఇళ్లలోనే ఐసొలేషన్ లో ఉంచటమా, లేదా ఆస్పత్రికి తరలించటమా అనేది నిర్ణయిస్తారు.ఇవన్నీ కలవటం వల్ల మరణాల శాతం బాగా తగ్గుముఖం పట్టింది.
7 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పాజిటివ్ ల శాతం 5% కంటే తక్కువ నమోదైంది. పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే వ్యూహాన్ని కేంద్రప్రభుత్వం అనుసరించింది. రాష్ట్రాలు కూడా పాటించాయి.
22 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో జాతీయ సగటు కంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం ఇప్పటిదాకా పాజిటివ్ కేసుల శాతం 8.19% గా నమోదైంది. పైగా, ఇది క్రమంగా తగ్గుతూ వస్తోంది. కొత్తగా వస్తున్న కేసులకంటే కోలుకున్నవారు ఎక్కువగా ఉండటం వలన పరిస్థితి సానుకూలంగా ఉంటోంది. ఒక్కరోజులోనే 83,011 కేసులు కోలుకుంటున్నట్టు తేలింది. పాజిటివ్ కేసులు 24 గంటల్లోనే 78,524 కాగా, మొత్తం 58,27,704 మంది కోలుకున్నారు. కోలుకున్నవారు, చికిత్సలో ఉన్నవారికీ మధ్య తేదా 49 లక్షలు దాటింది.
చికిత్సలో ఉన్న కేసులు వరుసగా 17 వ రోజు కూడా 10 లక్షల లోపే ఉంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి వాటా పాజిటివ్ కేసులలో 13.20% గా నమోదైంది. అంటే 9,02,425 మంది చికిత్సలో ఉన్నారు. రోజూ కోలుకుంటున్నవారి సంఖ్య పెరుగుతూ ఉండగా ప్రస్తుతం జాతీయ సగటు 85.25% అయింది. కొత్తగా కోలుకుంటున్నవారిలో 75% మంది 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమైంది. అందులో ఒక్క మహారాష్ట్రలోనే అత్యధికంగా ఒక్క రోజులో 16,000 కు పైగా కోలుకున్నట్టు నమోదైంది.
గడిచిన 24 గంటల్లో కొత్తగా 78,524 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసుల్లో 79% మేరకు 10 రాష్ట్రాలనుంచే నమోదయ్యాయి. మహారాష్ట్ర అత్యధికంగా కేసులు నమోదవుతున్న రాష్ట్రంగా కొనసాగుతోంది. మహారాష్ట్రలో 14,000 కేసులు నమోదై మొదటి స్థానంలో ఉందగా 11,000 కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
మరణాల విషయానికొస్తే, గడిచిన 24 గంటల్లో 971 మంది చనిపోయినట్టు నమోదైంది. వీళ్లలో 82% మంది కేవలం పది రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాల్లోనే నమోదయ్యాయి. అవి మహారాష్ట్ర, కర్నాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు, కొత్తగా నమోదైన మరణాల జాబితాలో 355 తో మహారాష్ట్ర ముందున్నది.
****
(Release ID: 1662756)
Visitor Counter : 236