మంత్రిమండలి

కెనడా కు చెందిన లాభాపేక్షరహిత సంస్థ ఇంటర్ నేషనల్ బార్ కోడ్ ఆఫ్ లైఫ్ కు, జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పందానికి ఆమోదం తెలిపిన మంత్రివర్గం

Posted On: 07 OCT 2020 4:32PM by PIB Hyderabad

కెనడా కు చెందిన లాభాపేక్షరహిత సంస్థ ఇంటర్ నేషనల్ బార్ కోడ్ ఆఫ్ లైఫ్ (ఐబిఒఎల్) కు, పర్యావరణం, అడవులు, జల వాయు పరివర్తన శాఖ అధీనం లోని జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జడ్ఎస్ఐ) కి మధ్య ఈ ఏడాది జూన్ లో సంతకాలైన అవగాహనపూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టి కి తీసుకురావడమైంది.

డిఎన్ ఎ బార్ కోడింగ్ లో ఇప్పుడు జరుగుతున్న కృషి ని మరింత ముమ్మరంగా కొనసాగించడానికి జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, ఇంటర్ నేషనల్ బార్ కోడ్ ఆఫ్ లైఫ్ లు చేతులు కలిపాయి.  డిఎన్ ఎ బార్ కోడింగ్ అంటే ప్రామాణీకరించిన జన్యు ప్రాంతాలకు చెందిన ఒక చిన్న విభాగాన్ని క్రమబద్ధం చేసి సందర్భ అనుక్రమం కోసం వ్యక్తిగత అనుక్రమాలను సరిపోల్చుకొంటూ ప్రజాతుల ను వేగంగాను, సరి అయిన విధంగాను గుర్తించే పద్ధతి. ఇంటర్ నేషనల్ బార్ కోడ్ ఆఫ్ లైఫ్ అనేది సభ్యత్వ దేశాలతో ఏర్పాటైన ఒక పరిశోధక కూటమి. దీని సభ్యత్వ దేశాలు అంతర్జాతీయ సంప్రదింపుల కు ఉద్దేశించిన సమాచార నిధి ని విస్తరించడానికి, ఇన్ఫర్మేటిక్స్ ప్లాట్ ఫార్మ్ లను అభివృద్ధిపరచడానికి, లేదా వీటికి తోడు అదనంగా సంప్రదింపుల గ్రంథాలయానికి సంబంధించిన ఉపయోగ సూచీ, మూల్యాంకనం, జీవ వైవిధ్య వర్ణన లకు అవసరపడే విశ్లేషణాత్మక ప్రోటోకాల్స్ ను  రూపొందించడానికి మానవ వనరులతో పాటు ఆర్థిక వనరులను అందించడంలో సహకరించుకొంటామంటూ సంకల్పాన్ని చెప్పుకోవడం జరిగింది.  ఈ అవగాహనపూర్వక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం ద్వారా జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కు బయోస్కాన్, ప్లానెటరీ బయోడైవర్సిటీ మిషన్ వంటి ప్రపంచ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే సామర్థ్యం అందివస్తుంది.


***


 



(Release ID: 1662419) Visitor Counter : 220