సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ
మోదీ ప్రభుత్వం పంటల మద్దతు ధరలను గత ఆరేళ్లలో భారీగా పెంచింది
కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్
Posted On:
06 OCT 2020 5:22PM by PIB Hyderabad
ప్రధాని నరేంద్ర మోడీ పంటలకు మద్దతు ధరల విధానాన్ని తొలగించడానికి ప్రయత్నిస్తున్నారంటూ విపక్షాలు చేసిన విమర్శలను కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. గత ఆరేళ్లలో ప్రభుత్వం మద్దతు ధరలను భారీగా పెంచిందంటూ లెక్కలతో సహా వివరించారు. జమ్మూకశ్మీర్లోని కథువాలో మంగళవారం అక్కడి రైతులతో, సర్పంచులతో, పంచాలతో, బ్లాక్ నగరి సభ్యులతో సమావేశం సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ ఆరోపణలను నిరూపించగల సాక్ష్యాలు గానీ సమాచారం గానీ ప్రతిపక్షాల దగ్గర లేదని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాన్ని రాజకీయ స్వార్థం కోసం విమర్శిస్తున్నారని డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ఇది కేవలం రాజకీయ ప్రేరేప్రిత ప్రచారమని వెల్లడించడం తమ బాధ్యత అన్నారు. ఈ విషయాన్ని రైతులకు, ప్రజలకు వాస్తవాలతో, సవివర సమాచారంతో వివరిస్తామని మంత్రి అన్నారు. తాము అందించిన సమాచారాన్ని ఎవరైనా ధ్రువీకరించుకోవచ్చని స్పష్టం చేశారు.
మద్దతు ధరల వివరాలు
పంటల మద్దతు ధరలకు సంబంధించిన లెక్కలను ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఉదాహరణకు 2015-16 లో క్వింటాలు వరికి మద్దతు ధరను రూ.1,410 నుంచి రూ.1,450కి పెంచారు. 2016-17లో దీనిని రూ.1,550 చేశారు. 2017-18లో మద్దతు ధరను రూ.1,750లకు పెంచారు. 2018–19లో ధరను రూ.18,15లకు పెంచారు. 2019–20లో ఇది రూ.1,861లకు , 2020–21లో రూ.1,861లకు పెరిగింది. క్వింటాల్ గోధుమకు మద్దతు ధర 2015–16లో రూ.1,525 ఉండగా, రూ.1,625లకు పెంచారు. 2017-18లో దీనిని రూ.1,753 చేశారు. 2018–19లో ధర రూ.1,840లకు, 2019–20లో రూ.1,925లకు పెంచారు. 2015-16 లో క్వింటాలు వేరుశనగ మద్దతు ధర రూ.4,030 కాగా, 2016-17లో దీనిని రూ.4,220 చేశారు. 2017-18లో మద్దతు ధరను రూ.4,450లకు పెంచారు. 2018–19లో ధర రూ.4,890లకు పెంచారు. 2019–20లో ఇది రూ.5,090లకు , 2020–21లో రూ.5,275లకుపెరిగింది.
తమ దగ్గరున్న పంటల జాబితా చాలా పెద్దదని, సోయాబీన్, పప్పుల పంటల మద్దతు ధరలను కూడా పెంచామని మంత్రి జితేంద్ర సింగ్ వివరించారు. పంట సేకరణ విషయంలో యూపీఏ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎన్డీయేతో పోలిస్తే యూపీఏ హయాంలో ధాన్య సేకరణ ఎందుకు తక్కువ ఉందో యూపీఏ నాయకత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. 2009 నుంచి 2014 వరకు యూపీఏ–1 ప్రభుత్వం 1,395 లక్షల మెట్రిక్ టన్నుల గోధుమలు సేకరించింది. 2014–2019 మధ్యకాలంలో ఈ పరిమాణం కేవలం 1,457 లక్షల మెట్రిక్ టన్నులకు పెరిగిందని మంత్రి అన్నారు. సత్యం తమ వెంట ఉందని, విపక్షాన్ని గట్టిగా నిలదీయాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు తారాచంద్, పంచ్కుల్భూషణ్ సింగ్, రైతులు తారాచంద్, సైనీ సహా చత్తర్ సింగ్, యువజన నాయకుడు గౌరవ శర్మ తదితరులు పాల్గొన్నారు. లోక్సభ నియోజకవర్గం ఇన్చార్జ్ సంజీవ్, కథువా బీజేపీ ప్రెసిడెంట్ రఘునందన్ సింగ్, కార్యనిర్వాహక సభ్యుడు జనక్ భారతితోపాటు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
***
(Release ID: 1662123)
Visitor Counter : 122