రక్షణ మంత్రిత్వ శాఖ
88వ వైమానిక దళ దినోత్సవం: వైమానిక ప్రదర్శన
प्रविष्टि तिथि:
02 OCT 2020 12:28PM by PIB Hyderabad
ఈనెల 8వ తేదీన, 88వ ఆవిర్భావ దినోత్సవాన్ని భారత వైమానిక దళం జరుకుంటోంది. ఈ సందర్భంగా హిందాన్ వైమానిక కేంద్రంలో వివిధ యుద్ధ విమానాలతో కళ్లు చెదిరే విన్యాసాలు నిర్వహించనుంది. గురువారం నుంచి సాధన మొదలైంది. తక్కువ ఎత్తులో విమానాలు ఎగిరే ప్రాంతాలు: వజీర్పూర్ వంతెన-కార్వాల్‌నగర్-అఫ్జల్‌పూర్-హిందాన్, షామ్లి-జివానా-ఛండీనగర్-హిందాన్, హాపూర్-ఫిల్కువా-ఘజియాబాద్-హిందాన్.
విమానాల విన్యాసాలకు, ముఖ్యంగా తక్కువ ఎత్తులో ఎగిరే సమయంలో పక్షుల నుంచి తీవ్రమైన ముప్పు ఉంది. ఆరుబయట పడేసే ఆహార పదార్థాలు పక్షులను ఆకర్షిస్తాయి. విమానాలు, పైలెట్లు, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని; ఆహార పదార్థాలను ఆరుబయట పడేయొద్దని దిల్లీ, ఘజియాబాద్, చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు భారత వైమానిక దళం విజ్ఞప్తి చేసింది. ఆరుబయట మృతదేహాలు/జంతు కళేబరాలను ప్రజలు గుర్తిస్తే, వాటిని తొలగించేందుకు, సమీప వైమానిక దళ బృందానికి లేదా పోలీస్ స్టేషన్‌కు కచ్చితంగా తెలియజేయాలి. 9559898964 నంబర్‌కు ఫోన్ లేదా మెసేజ్ చేసి, సంబంధిత అధికారులకు సమాచారం అందించవచ్చు.
త్రివర్ణ పతాకం చేతబూనిన ఆకాశ్‌గంగ బృందం, ఏఎన్-32 విమానం నుంచి స్కై డైవ్ చేయడంతో వైమానిక దళ ప్రదర్శన ప్రారంభమవుతుంది. ఉదయం 8 గంటలకు ఈ ప్రదర్శన ఉంటుంది.
గత కాలపు యుద్ధ విమానాలు, ఆధునిక రవాణా విమానాలు, ఫ్రంట్‌లైన్ ఫైటర్లు ప్రజలకు కనువిందు చేయనున్నాయి. కనురెప్ప పడనీయని అద్భుత విన్యాసాల మధ్య ఉదయం 10.52 గం.కు ప్రదర్శన ముగుస్తుంది.
సూచన: సురక్షిత విన్యాస వాతావరణాన్ని నిర్ధరించేందుకు సాయం చేసేలా, ఈ సందేశాన్ని ప్రత్యేక గడిలో ప్రచురించగలరు.
****
(रिलीज़ आईडी: 1661005)
आगंतुक पटल : 241