ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

వరుసగా 11వ రోజు కూడా చికిత్సలో ఉన్నవారి సంఖ్య10 లక్షల లోపు

10 లక్షలమంది కోలుకున్నది12 రోజుల్లోనే

Posted On: 02 OCT 2020 12:09PM by PIB Hyderabad

చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య వరుసగా 11 రోజులుగా  10 లక్షల లోపే  కొనసాగటం ద్వారా భారత్ మరో ప్రత్యేకత సాధించింది. ఈరోజు చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితులు 9,42,217 మంది.

 

ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్ నుంచి విముక్తులవుతుందటంతో రోజువారీ కోలుకుంటున్నవారి సంఖ్య గరిష్ఠంగా ఉంటూ వస్తోంది. గడిచిన 24 గంటల్లో 78,877 మంది కోలుకున్నారు. దీనివలన జాతీయ స్థాయిలో కోలుకుంటున్నవారి శాతం ప్రస్తుతం 83.70% గా నిలిచింది.

ఈరోజు వరకు దేశవ్యాప్తంగా కోలుకున్నవారి సంఖ్య 53,52,078 గా నమోదైంది. వీళ్లలో ఆఖరి 10 లక్షలమంది కేవలం గడిచిన 12 రోజుల్లో నమోదైనవారే. కోవిడ్ నుంచి బైటపడిన వారి సంఖ్యాపరంగా అంతర్జాతీయంగా భారత్ ముందుండటానికి ఇది దారితీసింది.

ప్రస్తుతం ఇంకా కోవిడ్ తో బాధపడుతూ చికిత్స అందుకుంటున్నవారిలో 76.62%  శాతం కెసులు కేవలం 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో నమోదైనవే కావటం గమనార్హం. 

ఈరోజుకు దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసులలో ఇంకా చికిత్సలో ఉన్నవారు 14.74% మాత్రమే. అత్యధికంగా 2.5 లక్షలమందికి పైగా చికిత్స పొందుతున్న వారున్న మహారాష్ట్ర ఈ జాబితాలో ముందుంది. ఆ తరువాత లక్షకు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.  

14 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఐదేసి వేలకంటే తక్కువమంది కోవిడ్ బాధితులు ప్రస్తుతం ఇంకాచికిత్స పొందుతూ ఉన్నారు.

 

గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా మొత్తం 81,484 మంది కోవిడ్ పాజిటివ్ లుగా నిర్థారణ అయ్యారు.

కొత్తగా పాజిటివ్ గా నిర్థారణ అయిన కేసుల్లో 78.07% మంది పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతం కావటం కూడా గమనార్హం. ఆ రాష్ట్రాల్లో మహారాష్ట్ర అత్యధికంగా 16,000 కు పైగా కేసులు నమోదు చేసుకోగా సుమారు 10,000 కేసులతో కర్నాటక రెండో స్థానంలో, 8,000 కు పైగా కేసులతో కేరళ మూడో స్థానంలో ఉన్నాయి.

 

కొత్తగా కోలుకున్న వారిలో 72% మంది 10 రాష్ట్రాల్లో నమోదయ్యారు. అలా కొత్తగా కోలుకున్నవారి జాబితాలో అత్యధిక సంఖ్యతో మహారాష్ట్ర ముందుండగా, ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో, కర్నాటక మూడో స్థానంలో ఉన్నాయి.

గత 24 గంటల్లో దేశంలో 1095 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వాటిలో 83.37% మంది పది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందినవారే. నిన్న నమోదైన మరణాలలో 364 మంది (36%) మహారాష్ట్ర నుంచే కాగా కర్నాటకలో 130 మరణాలు నమోదయ్యాయి. 

***


(Release ID: 1660997) Visitor Counter : 124