మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ

కేంద్ర మ‌త్స్య‌, ప‌శుగణాభివృద్ధి, పాడిప‌రిశ్ర‌మ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చే మ‌త్స్య సంప‌ద న్యూస్ లెట‌ర్ రెండ‌వ ఎడిష‌న్ విడుద‌ల‌. మ‌త్స్యకారులు, మ‌త్స్య‌రైతుల‌ను చేరుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న‌పై స‌మ‌గ్ర ల‌బ్దిదారుల బుక్‌లెట్ విడుద‌ల‌

Posted On: 30 SEP 2020 5:12PM by PIB Hyderabad

కేంద్ర మ‌త్స్య‌, ప‌శుగణాభివృద్ధి, పాడిప‌రిశ్ర‌మ శాఖ మంత్రి శ్రీ గిరిరాజ్ సింగ్ చే మ‌త్స్య సంప‌ద న్యూస్ లెట‌ర్ రెండ‌వ ఎడిష‌న్ విడుద‌లచేశారు. దానితోపాటు మ‌త్స్యకారులు, మ‌త్స్య‌రైతుల‌ను చేరుకునేందుకు ప్ర‌ధాన‌మంత్రి మ‌త్స్య‌సంప‌ద యోజ‌న‌పై స‌మ‌గ్ర ల‌బ్దిదారుల బుక్‌లెట్ ను కూడా విడుద‌ల చేశారు. ఈ పుస్త‌కం పిఎంఎంఎస్‌వై ప‌థ‌కం కింద వివిధ కాంపొనెంట్‌లు, కార్య‌క‌లాపాలు, వాటి విధివిధానాలు, ప్ర‌తిపాద‌న‌ల స‌మ‌ర్ప‌ణ వంటి వాటికి సంబంధించి వివ‌రిస్తుంది . ఇది మ‌త్స్య‌కారులు,ఈ రంగంలోని స్టేక్‌హోల్డ‌ర్ల‌కు విలువైన స‌మాచారం అందించేదిగా ఉంటుంది.

పిఎంఎంఎస్‌వై కి సంబంధించిన ఈ ల‌బ్ధిదారుల పుస్త‌కం ల‌బ్ధిదారులు, స్టేక్‌హోల్డ‌ర్ల‌కు పిఎంఎంఎంఎస్‌వై కింద ప్ర‌యోజ‌నాలు పొంద‌డానికి అనుస‌రించాల్సిన విధివిధానాలు తెలుసుకోవ‌డానికి స‌హాయ‌ప‌డుతుంద‌ని అన్నారు. అలాగే పిఎంఎంఎస్‌వై కింద చేప‌డుతున్న వివిధ కార్య‌క‌లాపాల గురించి ల‌బ్ధిదారులు తెలుసుకోవ‌డానికి ఇది ఉప‌క‌రిస్తుంద‌న్నారు.

 పిఎంఎంఎస్‌వై 2024-25 సంవ‌త్స‌రానికి చేప‌ల ఉత్ప‌త్తిని 220 ల‌క్ష‌ల ట‌న్నుల‌కు చేర్చేందుకు ల‌క్ష్యంగా నిర్ణయించింది. ఇది దేశంలోని మ‌త్స్య‌కారులు, మ‌త్స్య‌రైతుల‌ను చేరుకునేందుకు మ‌త్స్య‌శాఖ చేప‌ట్టిన మీడియా ఔట్‌రీచ్ కార్య‌క్ర‌మం.ఈ ప‌థ‌కం వ‌ల్ల ఎగుమ‌తుల రాబ‌డి రెట్టింపు అయి 1,00,000 కోట్ల రూపాయ‌ల‌కు చేరుకుంటుంద‌ని పున‌రుద్ఘాటించారు. అలాగే దీనిద్వారా 55 ల‌క్ష‌ల మందికి ప్ర‌త్య‌క్షంగా , ప‌రోక్షంగా ఉపాధి అవ‌కాశాలు రాగ‌ల ఐదు సంవ‌త్స‌రాల‌లో దొరుకుతాయి.

***



(Release ID: 1660448) Visitor Counter : 125