ఆయుష్
ఆరోగ్యం, పోషకవిలువలపై మహాత్మాగాంధీ ఆలోచనలనుంచి పునఃప్రేరణ కల్పించేందుకు మెగా వెబినార్‌లు
Posted On:
30 SEP 2020 12:25PM by PIB Hyderabad
పూణెకు చెందిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నాచురోపతి (ఎన్.ఐ.ఎన్), సమాచార ప్రసార మంత్రిత్వశాఖకు చెందిన మహారాష్ట్ర , గోవాల రీజనల్ ఔట్‌రీచ్ బ్యూరో సహకారంతో 48 రోజుల పాటు వెబినార్‌లు నిర్వహించనుంది. అక్టోబర్ 2 వ తేదీ గాంధీ జయంతి నుంచి ప్రారంభించి 2020 నవంబర్ 18న నాచురోపతి దినోత్సవం వరకు వీటిని నిర్వహిస్తారు. ఈ వెబినార్ ప్రతిరోజూ ఉదయం 11 గంటలనుంచి 12 గంటల వరకు ఉంటుంది. ఫేస్‌బుక్‌లో దీనిని https://www.facebook.com/punenin లింక్ పై వీక్షించవచ్చు. ఇందులో చేరడానికి ముందస్తుగా రిజిస్టర్ చేయించుకోవలసిన అవసరం లేదు. కొన్ని కార్యక్రమాలు ఆయుష్ వర్చువల్ కన్వెన్షన్ సెంటర్ (ఎవిసిసి)లో కూడా ఏర్పాటు చేస్తారు. ఇందుకు సంబంధించి న లింక్‌లను ఆయుష్ మంత్రిత్వశాఖ విడిగా ప్రకటిస్తుంది.
వెబినార్ థీమ్ “మహాత్మాగాంధీ-స్వస్థత చేకూర్చువారు”. 21 వ శతాబ్దంలోని అన్నిరంగాలలోని ప్రజలకు ఆరొగ్యం, పోషక విలువలపై మహాత్మాగాంధీ ఆలోచనలు ఎంతగా పనికివస్తాయో ఆ విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయనున్నారు. అలాగే నాచురోపతి లాభాలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమ లక్ష్యం. ఈ సెమినార్లు 18 నవంబర్ 2020 న వర్చువల్‌గా నిర్వహించే ముగింపు ఉత్సవంతో సమాప్తమౌతాయి.
అకడమీషియన్లు, వైద్యరంగ నిపుణులు, గాంధేయవాద ఆలోచనాపరులు, నాచురోపతి రంగాలలో నిపుణులు ఈ సెషన్లలో మాట్లాడతారు. అమెరికా నుంచి డాక్టర్ మార్క్ లిండ్లే, ఆస్ట్రేలియా నుంచి డాక్టర్ గంభీ వాట్స్, గాంధేయ చరిత్రకారుడు డాక్టర్ గీతా ధరమ్‌పాల్, మేనేజ్‌మెంట్ గురు ప్రొఫెసర్ శంబు ప్రసాద్, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పిహెచ్ఎఫ్ ఐ) డైరక్టర్ ప్రొఫెసర్ శ్రీనాథ్ రెడ్డి , ప్రముఖ ఆంకాలజిస్ట్ డాక్టర్ అరవింద్ కులకర్ణి, ఐఎఎస్ అధికారి శ్రీమతి లీనా మెహెన్‌డలే పాల్గొంటారు. మహాత్మాగాంధీకి సంబంధించి అత్యంత అరుదైన ఫిల్మ్ ఫుటేజ్ గాంధీ కథను ప్రదర్శిస్తారు, గాంధీ భజన్‌లు కూడా వెబినార్ సందర్భంగా వినిపిస్తారు.
ఈ మెగా సిరీస్ వెబినార్లు ఎవరికివారు తమ ఆరోగ్యంపై సాధికారత సాధించాల్సిన అవసరానికి సంబంధించిన సందేశాన్ని 21 వ శతాబ్దపు ప్రేక్షకుల వద్దకు తీసుకువెళ్లనున్నాయి. మహాత్మాగాంధీ ఆసక్తులలో తక్కువగా తెలిసిన ది ఆహారం, పోషకవిలువల గురించి.ఆయుష్ మంత్రిత్వశాఖ తిరిగి మహాత్మాగాంధీ ఆలోచనలనుంచి ప్రేరణను ప్రజలలో వ్యాప్తి చేసి, వారిలో దీనిపై ఆసక్తిని పెంపొందించాలని భావిస్తున్నది. మహాత్ముడి కాలంలో వాటికి ఎంత ప్రాధాన్యత ఉందో , ఇప్పుడు కూడా వాటికి అంతే ప్రాధాన్యత ఉంది. ఇందుకు సంబంధించిన వెబ్ సరీస్‌లు 2020 అక్టోబర్ 2 గాంధీ జయంతి నుంచి ప్రారంభమౌతాయి.
మహాత్మాగాంధీ 150వ జయంతి ఉత్సవాలు అక్టోబర్ 2న ముగింపు దశకు చేరుకోనున్నాయి. దేశప్రజలు మహాత్ముడి ఆలోచనల స్ఫూర్తి, ఆయన నుంచి ప్రేరణ పొందుతూ, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ మహనీయుడిని గుర్తుకుతెచ్చుకుంటున్నారు. ధైర్యం, విశ్వమానవ ప్రేమ, అహింస, ప్రకృతిచికిత్స, పరిశుభ్రత, ఆరోగ్యం అనేవి సార్వకాలికమైనవి.
ఎన్.ఐ.ఎన్ , పూణెను భారత ప్రభుత్వం 1986లో ఏర్పాటు చేసింది. దేశంలో ప్రకృతి చికిత్స ఉద్యమాన్ని బలోపేతం చేసేందుకు దీనిని ఏర్పాటు చేసింది. ఈ సంస్థ స్వీయ ఆరోగ్య స్వావలంబన ద్వారా స్వయం సమృద్ధి అన్న అంశంతో ఎన్ఐఎన్ ఏడాది పొడవునా కార్యక్రమాలు నిర్వహించనుంది. ఆరోగ్యం, పోషక విలువల విషయంలో మహాత్మాగాంధీకి సంస్థాగత వారసురాలిగా ఎన్.ఐ.ఎన్ భావిస్తుంది. ప్రస్తుత ఈ క్యాంపస్‌లోనే (అప్పట్లో ఇందులో నేచర్ క్యూర్ క్లినిక్, శానటోరియం ఉండేది) మహాత్మాగాంధీ ఆలిండియా నేచర్ క్యూర్ ఫౌండేషన్ ట్రస్ట్‌ను 1945 నవంబర్ 18న ఏర్పాటు చేశారు.మహాత్మాగాంధీ కీలకపాత్ర పోషించిన సంస్థలలో ఇది ఒకటి.నేచర్ క్యూర్ ట్రస్ట్ డీడ్‌పై సంతకం చేసిన వారు కూడా గాంధీజీయే.ఈ ట్రస్ట్ డీడ్‌లో ఈ ఛారిటబుల్ ట్రస్ట్ లక్ష్యాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. ప్రకృతి చికిత్సకు సంబంధించిన విజ్ఞానాన్ని ప్రజలలో ప్రచారం చేయడం, ప్రకృతి చికిత్స వైద్యాన్ని విస్తృతం చేయడం, దీని ప్రయోజనాలు అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేట్టు చేయడం, ప్రత్యేకించి పేదలకు వీటి ఫలితాలు అందేట్టు చేయడం, శాశ్వత ప్రాతిపదికన ఈ సంస్థను ఏర్పాటుచేయడం, దీనిని నేచర్ క్యూర్ యూనివర్సిటీ గా చేయడం అనేవి లక్ష్యాలుగా పేర్కొన్నారు. ఎన్.ఐ.ఎన్ ఆయుష్ మంత్రిత్వశాఖ కింద గల ఒక స్వతంత్ర సంస్థ. ఈ సంస్థ తన లక్ష్యాలను అది చేపడుతున్న విద్య, ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల ద్వారా సజీవంగా ఉండేట్టు చూస్తున్నది.
1945 లో మహాత్మాగాంధీ నేచర్ క్యూర్ కు నవంబర్ 18 న ప్రకటించిన నిబద్దతకు గుర్తుగా, భారత ప్రభుత్వం నవంబర్ 18ని నాచురోపతి దినోత్సవంగా ప్రకటించింది. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఆరోజున ప్రకృతి వైద్యులు, ప్రకృతి వైద్య ఔత్సాహికులు నాచురోపతి దినోత్సవాన్ని జరుపుకుంటారు.
****
(Release ID: 1660372)
Visitor Counter : 211