వ్యవసాయ మంత్రిత్వ శాఖ
ప్రస్తుతం ఉన్న ఎంఎస్‌పి పథకాల ప్రకారం రైతుల నుంచి ఎంఎస్‌పి వద్ద ఖరీఫ్ 2020-21 పంటల సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోంది
తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు హర్యానా రాష్ట్రాలకు కెఎమ్‌ఎస్ 2020-21కి 14.09 ఎల్‌ఎమ్‌టి ఆహారధాన్యాలు,నూనె గింజల సేకరణకు అనుమతి లభించింది.
28.09.2020 వరకు, రూ.31 కోట్ల ఎంఎస్‌పి విలువ గల 16,420 మెట్రిక్ టన్నుల వరి సేకరణ హర్యానా, పంజాబ్ రైతుల నుంచి జరిగింది
Posted On:
29 SEP 2020 4:20PM by PIB Hyderabad
ఖరీఫ్ మార్కెటింగ్ కాలం 2020-21 ఇప్పుడే ప్రారంభం అయింది. గత సీజన్ల లాగే ఈ సారి కూడా ప్రస్తుతం, ఉన్న ఎంఎస్‌పి పథకాల ప్రకారం రైతుల నుంచి ఎంఎస్‌పి వద్ద ఖరీఫ్ 2020-21 పంటల సేకరణను ప్రభుత్వం కొనసాగిస్తోంది
రాష్ట్రాల ప్రతిపాదన ఆధారంగా, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ మరియు హర్యానా రాష్ట్రాలకు కెఎమ్‌ఎస్ 2020-21కి 14.09 లక్షల మెట్రిక్ టన్నుల(ఎల్‌ఎమ్‌టి) ఆహారధాన్యాలు,నూనె గింజల సేకరణకు అనుమతి లభించింది. ఇతర రాష్ట్రాలు / కేంద్రపాలిత ప్రాంతాల కోసం ఖరీఫ్ పప్పుధాన్యాలు మరియు నూనెగింజల ప్రతిపాదన అందిన తరువాత కూడా ఆమోదం లభిస్తుంది. నోటిఫైడ్ పంటకోత వ్యవధిలో మార్కెట్ రేటు దాని ఎంఎస్పి కంటే తక్కువగా ఉంటే ధర మద్దతు పథకం (పిఎస్ఎస్) ప్రకారం ఎఫ్ఏక్యు గ్రేడ్ కొనుగోలు చేయబడుతుంది.
28.09.2020 వరకు, ప్రభుత్వం తన నోడల్ ఏజెన్సీల ద్వారా తమిళనాడులోని 48 మంది రైతులకు లబ్ధి చేకూర్చే రూ .33 లక్షల ఎంఎస్‌పి విలువ కలిగిన 46.35 మెట్రిక్ టన్నుల పెసర్లను కొనుగోలు చేసింది. అదేవిధంగా, 5089 మెట్రిక్ టన్నుల కొబ్బరికురిడీ (శాశ్వత పంట) ఎంఎస్‌పి విలువ రూ. 52.40 కోట్ల రూపాయలతో కర్ణాటక, తమిళనాడులలో 3961 మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఇది ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, కేరళలకు మంజూరైన 1.23 ఎల్‌ఎమ్‌టి మొత్తానికి గాను సేకరణ జరిగిన పంట.
హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లో ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ 2020-21 వరి సేకరణ 2020 సెప్టెంబర్ 26 నుండి ప్రారంభమైంది. 28.09.2020 వరకు, హర్యానాలో 3,164 మెట్రిక్ టన్నులు, పంజాబ్‌లో 13,256 మెట్రిక్ టన్నుల మొత్తం 16,420 మెట్రిక్ టన్నుల ఎంఎస్‌పి విలువ రూ.31 కోట్లు గల వరిని హర్యానా, పంజాబ్‌కు చెందిన 1443 మంది రైతుల నుంచి క్వింటాల్‌కు రూ .1888 చొప్పున సేకరణ చేయడం జరిగింది. మిగిలిన రాష్ట్రాలకు వరి సేకరణ ఇప్పుడే 28.09.2020 నుండి ప్రారంభమైంది.
2020-21 సీజన్‌కు పత్తి సేకరణ 2020 అక్టోబర్ 1 నుండి ప్రారంభమవుతుంది, కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) 2020 అక్టోబర్ 1 నుండి ఎఫ్ఏక్యూ గ్రేడ్ పత్తి కొనుగోలు ప్రారంభిస్తుంది.
****
(Release ID: 1660145)
Visitor Counter : 204