ప్రధాన మంత్రి కార్యాలయం
ఇండియా -డెన్మార్క్ వర్చువల్ ద్వైపాక్షిక శిఖరాగ్ర సమావేశంలో ప్రధానమంత్రి చేసిన ప్రారంభోపన్యాసానికి తెలుగు సంక్షిప్త అనువాదం.
Posted On:
28 SEP 2020 5:25PM by PIB Hyderabad
నమస్కార్, ఎక్సలెన్సీ!
ఈ వర్చువల్ సమావేశం ద్వారా మీతో మాట్లాడడానికి అవకాశం కలిగినందుకు ఎంతో సంతోషంగా ఉంది. ముందుగా కోవిడ్ -19 కారణంగా డెన్మార్క్‌కు జరిగిన నష్టానికి నా విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో నైపుణ్యంతోకూడిన మీ నాయకత్వానికి నా అభినందనలు.
మీకున్న పనులన్నింటి మధ్యమీరు ఈ చర్చలకు వీలు చేసుకోవడం మన మధ్య సంబంధాల విషయంలో మీ చిత్తశుద్ధి, మీ ప్రత్యేక దృష్టిని తెలియజేస్తోంది.
మీరు ఇటీవలే వివాహం చేసుకున్నారు. మీకు అభినందనలు,శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. కోవిడ్ -19 పరిస్థితులు చక్కబడిన తర్వాత మిమ్మల్ని మీ కుటుంబంతో ఇండియాకు త్వరలోనే ఆహ్వానిస్తాం.మీ కుమార్తె ఇదా ఇండియాను మరోసారి సందర్శించేందుకు తప్పకుండా ఆసక్తితో ఉన్నారనుకుంటాను.
కొద్దినెలల క్రితం మన మధ్యఫోనులో అత్యంత ప్రయోజనకరమైన సంభాషణలు జరిగాయి. ఇండియా- డెన్మార్క్ ల మధ్య పలు రంగాలలో సహకారాన్ని పెంచేందుకు మనం చర్చించుకున్నాం.
ఈ వర్చువల్ సమావేశం ద్వారా మనం మన ఆలోచనలకు కొత్త దిశ,ఊపు ఇవ్వనుండడం సంతోషం కలిగిస్తోంది. 2009లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి డెన్మార్క్ వైబ్రంట్ గుజరాత్ సమ్మిట్‌కు హాజరౌతూ ఉంది. అందువల్ల డెన్మార్క్‌తో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఇండియా- నార్డిక్ రెండొ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చేందుకు మీరు చేసిన ప్రతిపాదనకు కృతజ్ఞతలు. పరిస్థితులు చక్కబడిన తర్వాత డెన్మార్క్‌కువచ్చి మిమ్మలను కలుసుకోవడం గౌరవంగా భావిస్తాను.
ఎక్సలెన్సీ,
గత కొద్దినెలలుగా జరిగిన పరిణామాలను గమనించినప్పడు ఒకే ఆలోచనలు కలిగిన మనవంటి దేశాలు కలసికట్టుగా పనిచేయడం ఎంత ముఖ్యమో స్పష్టమైంది. మనం చట్టనిబంధనల ఆధారిత, పారదర్శక, మానవీయ, ప్రజాస్వామిక విలువల వ్యవస్థలను కలిగి ఉన్నాం.
భావసారూప్యత కలిగిన దేశాలమధ్య వాక్సిన్ అభివృద్ధిలో పరస్పర సహకారం ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి పనికి వస్తుంది.ఈ మహమ్మారి సమయంలో భారతదేశ ఫార్మా ఉత్పత్తుల సమర్ధత మొత్తం ప్రపంచానికి పనికివచ్చింది. మేం వాక్సిన్ విషయంలోనూ అదే చేస్తున్నాం.
కీలక ఆర్థికరంగాలలో ఇండియా సమర్థతను పెంచేందుకు చేపట్టిన ఆత్మనిర్భర్ (స్వావలంబిత భారత్) ప్రచారం కృషి ప్రపంచానికి కూడా ఉపయోగపడనుంది.
ఈ ప్రచారం కింద మేం అన్ని రంగాలలో సంస్కరణలపై దృష్టిపెడుతున్నాం. రెగ్యులేటరీ, పన్ను రంగాలలో సంస్కరణల వల్ల ఇండియాలో పనిచేస్తున్న కంపెనీలు లాభపడతాయి. ఇతర రంగాలలో సంస్కరణల ప్రక్రియకూడా ముందుకు సాగుతోంది. ఇటీవల వ్యవసాయం, కార్మికరంగాలలో చెప్పుకోదగిన సంస్కరణలు చేపట్టడం జరిగింది.
ఎక్సలెన్సీ,
ఏదైనా ఒక్క సోర్సుపై ఎక్కువగా ఆధారపడడం రిస్క్‌తో కూడుకున్నదని కోవిడ్ -19 తెలియజెప్పింది. మేం జపాన్, ఆస్ట్రేలియాలతో పాటు సప్లయ్‌చెయిన్ బహుముఖ విస్తరణకు, పెద్ద ఎత్తునపుంజుకునేందుకు కలిసి పనిచేస్తున్నాం. ఇతర సారూప్య ఆలోచనలున్న దేశాలు ఈకృషిలో పాలుపంచుకోవచ్చు.
ఈ నేపథ్యంలో , మన మధ్యజరుగుతున్నవర్చువల్ సమ్మేళనం ఇండియా- డెన్మార్క్ సంబంధాలు ప్రయోజనకరమని రుజువుచేయడమే కాక,అంతర్జాతీయ సవాళ్లకు ఉమ్మడి వైఖరిని రూపొందించేందుకు సహాయపడుతుంది.
మరోసారి ,ఎక్సలెన్సీ,మీ సమయాన్ని వెచ్చించినందుకు ధన్యవాదాలు.
ఇప్పుడు మీమ్మలను ప్రారంభవాక్యాలు మాట్లాడాల్సిందిగా సాదరంగా ఆహ్వానిస్తున్నాను.
******
(Release ID: 1659901)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam