ప్రధాన మంత్రి కార్యాలయం
నమామి గంగే లో భాగం గా ఉత్తరాఖండ్ లో ఆరు పెద్ద ప్రాజెక్టుల ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
రోయింగ్ డౌన్ ద గాంజెస్” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరిస్తారు
గంగా నది కి సంబంధించిన ప్రప్రథమ మ్యూజియమ్ ‘‘గంగా అవలోకన్’’ ను కూడా ఆయన ప్రారంభిస్తారు
Posted On:
28 SEP 2020 5:18PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్రమోదీ రేపటి రోజున అంటే 2020వ సంవత్సరం సెప్టెంబర్ 29 న ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తరాఖండ్ లో ఆరు పెద్ద పథకాల ను ‘నమామి గంగే మిషన్’ లో భాగం గా ప్రారంభించనున్నారు.
ఈ ప్రాజెక్టుల లో హరిద్వార్ లోని జగ్ జీత్ పుర్ లో రోజు కు 27 మిలియన్ లీటర్ల (ఎమ్ ఎల్ డి) సామర్ధ్యం కలిగిన మురుగు శుద్ధి ప్లాంటు (ఎస్ టిపి) ఉన్నతీకరణ పథకం, 68 ఎమ్ఎల్‌డి సామర్ధ్యం కలిగిన ఎస్‌టిపి నిర్మాణం, హరిద్వార్ లోనే సరాయి లో 18 ఎమ్ఎల్‌డి సామర్ధ్యాన్ని కలిగి ఉండే ఒక ఎస్‌టిపి నిర్మాణం భాగంగా ఉన్నాయి. జగ్ జీత్ పుర్ లో 68 ఎమ్ఎల్‌డి సామర్ధ్యం కలిగిన ప్రాజెక్టు ప్రారంభోత్సవం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం పద్ధతి లో చేపట్టిన మొదటి మురుగు శుద్ధి ప్రాజెక్టు పూర్తి కావడాన్ని సూచిస్తోంది.
రుషికేశ్ లోని లక్కడ్ ఘాట్ లో 26 ఎమ్ఎల్‌డి సామర్ధ్యం కలిగిన ఎస్‌టిపి ని ప్రారంభించడం జరుగుతుంది.
గంగానది లో కలుస్తున్న వ్యర్ధ జలాల్లో దాదాపు 80 శాతం వ్యర్ధ జలాలు హరిద్వార్-రుషికేశ్ జోన్ నుంచే వస్తున్నాయి. అందువల్ల, ఈ మూడు మురుగు శుద్ధి ప్లాంటుల ప్రారంభోత్సవం గంగానది శుద్ధీకరణ లో ఒక ప్రముఖ పాత్ర ను పోషించగలదు.
మునీకీ రేతే పట్టణం లో, 7.5 ఎమ్ఎల్‌డి సామర్ధ్యం కలిగిన చంద్రేశ్వర్ నగర్ సీవేజి ట్రీట్‌మెంట్ ప్లాంటు దేశం లోనే 4 అంతస్తులు కలిగిన మొట్టమొదటి మురుగు శుద్ధి ప్లాంటు అవుతుంది. అక్కడ అవసరమైనంత భూమి అందుబాటులో లేకపోవడంతో 900 ఎస్‌క్యుఎమ్ కన్నా తక్కువ విస్తీర్ణం లో ఈ ఎస్‌టిపి ని ఈ రకంగా నిర్మించడం జరిగింది. ఇంత సామర్ధ్యం కలిగిన ఎస్‌టిపి ని నిర్మించాలంటే సాధారణంగా అవసరమయ్యే ప్రాంతం లో 900 ఎస్‌క్యుఎమ్ కన్నా తక్కువ విస్తీర్ణం అనేది దాదాపు 30 శాతమే.
ప్రధాన మంత్రి 5 ఎమ్ఎల్‌డి సామర్ధ్యం కలిగిన 1 ఎస్‌టిపి నిచోర్ పానీ లో, అలాగే 1 ఎమ్ఎల్‌డి సామర్థ్యాన్ని, 0.01 ఎమ్ఎల్‌డి సామర్ధ్యాన్ని కలిగి వుండే రెండు ఎస్‌టిపి లను బద్రీనాథ్ లో ప్రారంభించనున్నారు.
ఉత్తరాఖండ్ లో మొత్తం మీద 30 ప్రాజెక్టులు (100 శాతం) పూర్తి అయ్యాయి. ఇవి గంగానది సమీప ప్రాంతంలో ఉన్న 17 గంగా పట్టణాల నుంచి వెలువడే కాలుష్యాన్ని శుద్ధిచేస్తాయి. ఇది ఒక గొప్ప కార్యసాధన అని చెప్పాలి.
గంగానది కి పునరుజ్జీవనాన్ని సంతరించే కార్యకలాపాలు, గంగానది లోని జీవవైవిధ్యం, గంగా నది సంస్కృతి లను కళ్ళకు కట్టే మొట్టమొదటి మ్యూజియమ్ అయిన “గంగా అవలోకన్’’ ను కూడా ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. ఈ మ్యూజియమ్ ను హరిద్వార్ లోని చండీఘాట్ లో ఏర్పాటు చేశారు.
ఇదే కార్యక్రమం లో ‘రోయింగ్ డౌన్ ద గాంజెస్’ పేరుతో ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరుగుతుంది. ఈ పుస్తకాన్ని నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా, వైల్డ్ లైఫ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా లు కలసి ప్రచురించాయి. రంగురంగుల బొమ్మలు కల ఈ ఆకర్షణీయ గ్రంథం గంగానది సంస్కృతిని, గంగానది లోని జీవవైవిధ్యాన్ని మేళవించేందుకు చేపట్టినటువంటి ఒక ప్రయత్నం. ఈ పుస్తకం గంగానది తన మూల స్థానమైన గౌముఖ్ నుంచి బయలుదేరి, గలగలా పారుతూ సముద్రం లోకి ప్రవేశించే చిట్టచివరి స్థానం అయిన గంగా సాగర్ వరకు పయనించే గాథ ను సమగ్రంగా వివరిస్తుంది.
ప్రధాన మంత్రి జల్ జీవన్ మిషన్ అధికార చిహ్నాన్ని, అలాగే ‘మార్గదర్శిక ఫర్ గ్రామ్ పంచాయత్స్ ఎండ్ పానీ సమితీస్ అండర్ జల్ జీవన్ మిషన్’ ను కూడా ఆవిష్కరిస్తారు.
దయచేసి https://pmevents.ncog.gov.in/ లింకు ను సందర్శించగలరు.
***
(Release ID: 1659876)
Visitor Counter : 220
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam