ప్రధాన మంత్రి కార్యాలయం

కథ చెప్పడం- ప్రాముఖ్యతను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి

Posted On: 27 SEP 2020 1:35PM by PIB Hyderabad

తాజాగా జరిగిన మన్ కి బాత్ కార్యక్రమంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ కథ చెప్పడానికి గల ప్రాముఖ్యతను చర్చించారు. 

మానవ నాగరికత ఎప్పటి నుండి ఉందో కథల చరిత్ర కూడా అంతే ప్రాచీనమైనది, ఎక్కడైతే జీవాత్మ ఉంటుందో అక్కడ కథ ఉంటుంది అని ప్రధానమంత్రి చెప్పారు.  మనింట్లో పెద్దవాళ్ళు కథలు చెప్పడం, పిల్లలు వినడం వంటి సంప్రదాయం చాల గొప్పదని ప్రధాని అన్నారు. తన ప్రయాణ సమయంలో పిల్లలతో సంభాషిస్తున్నపుడు, జోకులు వారి జీవితాలలో ప్రముఖంగా స్థానం పొందాయని గ్రహించాను, వారికి కథలకు సంబంధించిన ఆధారాలు వారి దగ్గర కనిపించలేదు, అని ప్రధాని తెలిపారు. 

కథలు లేదా  వృత్తాంతాల గురించి వివరించే ఈ దేశ సుసంపన్నమైన సంప్రదాయాల గురించి ప్రధాని మాట్లాడుతూ, జంతువులు, పక్షులు మరియు యక్షిణుల ఊహాత్మక ప్రపంచం ద్వారా జ్ఞానాన్ని అందించే హితోపదేశ్, పంచతంత్రా వంటి సంప్రదాయాలకు భారతదేశం ఆలవాలమని అన్నారు. థార్మిక పరమైన కథల పురాతన,రూపమైన ‘కథ’ గురించి ఆయన ప్రస్తావించారు, తమిళనాడు, కేరళలో ‘విల్లు పాట్’ ను ఉదహరించారు, ఇది కథ మరియు సంగీతం యొక్క సంగమం అంటూ,  కత్పుత్లీ అనే పటిష్టమైన సంప్రదాయం గురించి కూడా వివరించారు. సైన్స్, సైన్స్ ఫిక్షన్ ఆధారంగా కథలకు పెరుగుతున్న ప్రజాదరణను ఆయన ప్రస్తావించారు.

వృత్తాంతాల రూపంలో కథల ప్రచారంతో పాటు అనేక ఆవిష్కరణలను ప్రధాని ప్రశంసించారు. మన సంస్కృతికి సంబంధించిన కథలను ప్రాచుర్యం పొందడంలో మరియు వ్యాప్తి చేయడంలో నిమగ్నమైన చెన్నైకి చెందిన శ్రీమతి శ్రీవిద్య వీర్ రాఘవన్ చొరవ, మరాఠీలో శ్రీమతి వైశాలి వ్యావహరే దేశ్‌పాండే చొరవ, ఐఐఎం పూర్వ విద్యార్థి శ్రీ అమర్ వ్యాస్ నిర్వహిస్తున్న 'gaathastory.in' వంటి ఆవిష్కరణలను ప్రధాని ప్రశంసించారు. , భారతీయ కథల నెట్‌వర్క్ శ్రీమతి గీతా రామానుజన్ చేత 'kathalaya.org' చొరవ, మరియు మహాత్మా గాంధీకి సంబంధించిన కథల పట్ల ఎంతో ఉత్సాహంగా ఉన్న బెంగళూరులో శ్రీ విక్రమ్ శ్రీధర్ చేస్తున్న పని గురించి ప్రధాని ప్రస్తావించారు. శ్రీమతి అపర్ణ ఆత్రేయ, బెంగళూరు స్టోరీటెల్లింగ్ సొసైటీ సభ్యులతో కూడా ప్రధాని సంభాషించారు. ఈ బృందం సంభాషణ సమయంలో రాజా కృష్ణ దేవరాయ, మంత్రి తెనాలి రామపై ఒక కథను వివరించింది.

కథల ద్వారా దేశంలోని కొత్త తరాన్ని గొప్ప పురుషులు మహిళల జీవితాలతో అనుసంధానించడానికి మార్గాలు కనుగొనాలని ప్రధాని కథకులను కోరారు. ప్రతి ఇంటిలో కథ చెప్పే కళను ప్రాచుర్యం పొందాలని, పిల్లలకు మంచి కథలు చెప్పడం ప్రజా జీవితంలో ఒక భాగమని ఆయన అన్నారు. ప్రతి వారం, కుటుంబ సభ్యులు కరుణ, సున్నితత్వం, శౌర్యం, త్యాగం, ధైర్యం మొదలైన ఇతివృత్తాన్ని ఎన్నుకోవాలని, ప్రతి సభ్యుడు ఆ విషయంపై ఒక కథ చెప్పాలని ఆయన భావించారు. స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు జరుపుకోబోతున్నామని, స్వాతంత్య్ర సంగ్రామం నుంచి స్ఫూర్తిదాయకమైన సంఘటనలను తమ కథల ద్వారా ప్రచారం చేయాలని కథకులు కోరారు. 1857 నుండి 1947 వరకు ప్రతి పెద్ద, చిన్న సంఘటనలను ఈ కథల ద్వారా కొత్త తరానికి పరిచయం చేయాలని ప్రధాని విజ్ఞప్తి చేశారు. 

***


(Release ID: 1659561)