ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

దేశంలో కొత్త కోవిడ్ కేసులకంటే కోలుకుంటున్న వారే ఎక్కువ

21 రాష్ట్రాలలో కోలుకుంటున్నవారు అధికం

Posted On: 27 SEP 2020 11:44AM by PIB Hyderabad

గడిచిన తొమ్మిది రోజులలో భారత్ లో కొత్తగా నమోదవుతున్న కోవిడ్ పాజిటివ్ కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువమంది ఉన్నారు. పెద్ద ఎత్తున కోవిడ్ బాధితులు కోలుకుంటూ ఉండటం వల్ల ఇది సాధ్యమైంది. ఒక్క రోజులో కోలుకుంటున్నవారి సంఖ్య సగటున 90,000 దాటింది.

గడిచిన 24 గంటల్లో 92,043 మంది కోలుకున్నట్టు రికార్డుల్లో నమోదైంది. అదే సమయంలో కొత్తగా నమోదైన కోవిడ్ పాజిటివ్ ల సంఖ్య 88,600. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య దాదాపు 50 లక్షలకు (49,41,627) చేరువైంది. ఇదే రకమైన పెరుగుదల చాటుకుంటూ భారత్ లో జాతీయస్థాయిలో కోలుకుంటున్న వారి శాతాన్ని 82.46% కి చేర్చింది.

 

రోజువారీ కోలుకుంటున్న వారి శాతం అత్యధికంగా ఉండటంతో భారత దేశం అంతర్జాతీయంగా కూడా కోలుకున్నవారు అత్యధికంగా ఉన్నదేశంగా గుర్తింపు పొందగలుగుతోంది. కొత్తగా వస్తున్న కేసులకంటే భారత్ లో కోలుకుంటున్నవారు ఎక్కువగా ఉండటంతో  చికిత్సలో ఉన్నవారి సంఖ్యకూ, కోలుకున్నవారి సంఖ్యకూ మధ్య అంతరం బాగా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు అది దాదాపు 40 లక్షలకు (39,85,225) చేరువైంది.

 

చికిత్స పొందుతూ ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య వరుసగా కొద్ది రోజులుగా 10 లక్షల లోపే ఉంటూ వస్తున్నది. అంటే, మొత్తం పాజిటివ్ కేసులలో ప్రస్తుతం చికిత్సాభారం కేవలం 15.96 శాతానికే పరిమితమై క్రమంగా తగ్గుతూ ఉంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా, చాలా నిశితంగా గమనిస్తూ చేపడుతున్న చర్యల ఫలితంగా కోవిడ్ నుంచి కోలుకుంటున్నవారి సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతోంది. కొత్త కెసులకంటే కొత్తగా కోలుకున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్టు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించాయి.

 

ఫలితాలు ఇలా రావటానికి కేంద్ర ప్రభుత్వం స్థిరంగా అనుసరిస్తూ వచ్చిన బహుముఖ వ్యూహం సమర్థమైన చర్యలు, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించటం కారణాలు. దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చేపట్టిన నిర్థారణ పరీక్షలు, నిఘా, ఆనవాలు పట్టి చికిత్సకు తరలించటం, ప్రామాణికమైన చికిత్సా విధానాలు ఇలాంటిన్ ఉత్సాహపరచే ఫలితాలను రాబట్టగలిగాయి.

****



(Release ID: 1659537) Visitor Counter : 165