యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
పౌష్టికాహారం అందించేందుకు లక్షకుపైగా కార్యక్రమాలు రాష్ట్రీయ పోషణ మాసంలో పోషణ్ అభియాన్ కింద చేపట్టిన నెహ్రూ యువ కేంద్రాలు
Posted On:
27 SEP 2020 10:16AM by PIB Hyderabad
సంపూర్ణ పౌష్ణికాహారం అందించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి పోషణ్ అభియాన్ పథకం కింద ప్రతి ఏడాదీ సెప్టెంబరు నెలను జాతీయ పౌష్టికాహార మాసం (రాష్ట్రీయ పోషణ్ మాహ్)గా పాటిస్తున్నారు. 2018లో ఈ పథకం ప్రారంభమైంది. 2020 సెప్టెంబరు 1నుంచి ఈ పథకం కింద అనేక కార్యక్రమాలను, కార్యకలాపాలను కేంద్ర యవజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ చేపట్టింది. దేశవ్యాప్తంగా పౌష్టికాహార సూచికలను మెరుగుపరిచే లక్ష్యంతో జాతీయ పౌష్టికాహార మాసం పాటిస్తూ వస్తున్నారు.
జాతీయ పౌష్టికాహార మాసం కార్యక్రమాన్ని కేంద్ర యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన నెహ్రూ యువ కేంద్ర సంఘటన్ (ఎన్.వై.కె.ఎస్.) గత రెండేళ్లుగా దేశవ్యాప్తంగా సెప్టెంబరు నెలలో నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటా పౌష్టికాహార పర్వదినం భావనను అమలు చేస్తూ వస్తున్నారు. పౌష్టికాహార లోపం, తల్లి పాల ప్రాముఖ్యత, వంట ఇంటి తోటలకు ప్రోత్సాహం వంటి అంశాలపై గ్రామీణుల్లో అవగాహన కలిగించే కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నారు. ఇందుకు సంబంధించిన కార్యక్రమాల్లో పాల్గొనేలా జాతీయ యవజన వలంటీర్లకు, యూత్ క్లబ్బుల సభ్యులకు, కోవిడ్ వలంటీర్లకు, గంగా దూతలు తదితర జాతీయ యువజన వలంటీర్లకు జిల్లాల నెహ్రూ యువ కేంద్రాలు ప్రేరణ కలిగిస్తూ వస్తున్నాయి. కార్యక్రమాన్ని పటిష్టంగా అమలు చేసేందుకు నెహ్రూ యువ కేంద్రాలు తగిన చర్యలు తీసుకుంటున్నాయి. ఈ కార్యక్రమాల అమలులో అంగన్వాడీ, ఆశా కార్యకర్తల సహకారాన్ని జిల్లాల పరిపాలనా యంత్రాగాలు తీసుకుంటున్నాయి.
ఈ సందర్భంగా కేంద్ర యువజన వ్యవహారాల సహాయమంత్రి కిరెణ్ రిజీజు మాట్లాడుతూ, నెహ్రూ యువ కేంద్రాలు ప్రపంచంలోనే అతి పెద్ద యువజన సంఘాలన్నారు. “ విద్య, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ రక్షణ, సామాజిక సమస్యలపై అవగాహన కల్పన, మహిళా సాధికారత, పౌర విజ్ఞానం వంటి జాతి నిర్మాణ కార్యకలాపాల్లో ఈ యువ కేంద్రాల వలంటీర్లు క్రమం తప్పకుండా పాల్గొంటున్నారు. ప్రతి ఇంటా పౌష్టికాహార పర్వదినం అన్న సందేశాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు రాష్ట్రీయ పోషణ్ మాసాన్ని పాటిస్తూ వస్తున్నారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యకరం, పుష్టికరమైన ఆహారం తీసుకోవలసిన ఆవశ్యతను తెలియజెప్పేందుకు, ప్రత్యేకించి గ్రామాల్లో అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమ లక్ష్యం” అని మంత్రి అన్నారు.
జాతీయ పౌష్టికాహార కార్యక్రమం కింద ఇప్పటివరకూ మొత్తం 1,04,421 కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహించారు. 51,02,912 యువజనులు, గ్రామీణులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. రిసౌర్స్ పర్సన్స్ సహాయ సహకారాలతో 1,125 వెబినార్ సదస్సులు నిర్వహించారు. పౌష్టికాహార లోపం నివారణపై నిపుణులతో మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రత్యేకించి,. కోవిడ్ మహమ్మారి వైరస్ వ్యాప్తి సమయంలో, ఆ తర్వాతి కాలంలో పౌష్టికాహార లోపంతో బాధపడే పిల్లలకు ప్రాధాన్యం ఇవ్వడం, ఉత్తమ విధానాలు, విజయగాథలతో పౌష్టికాహారం ఆవశ్యతపై ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యకలాపాలు నిర్వహించారు.
భౌతిక దూరాన్ని పాటిస్తూ, ప్రముఖులతో 1,862 సమావేశాలను నిర్వహించారు. ఇందులో 36,274మంది యువజనులు కీలక పాత్ర పోషించారు. పౌష్టికాహార సందేశాల పంపిణీ, పౌష్టికాహార మాసం నిర్వహణపై ప్రతిజ్ఞలు చేయిస్తూ 25,164 కార్యక్రమాలను నిర్వహించారు. 6,54,320 యువజనులు ప్రతిజ్ఞతలు చేశారు. ఇదే అంశాలపై సామాజిక మాధ్యమాలు వేదికలుగా సందేశాలను పంపిణీ చేశారు. తద్వారా 38లక్షల మంది యువజనులు, గ్రామస్థులు ప్రయోజనం పొందారు.
29,057 ర్యాలీలు, పరుగు కార్యక్రమాలు, పాదయాత్రలు, సైకిల్ యాత్రలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వీధి నాటకాలు, లఘు చిత్రాల ప్రదర్శనలు, ఎగ్జిబిషన్లు, క్విజ్, పెయింటింగ్, పోస్టర్ల తయారీ, వ్యాస రచన, నినాదాల రచన, వాల్ రైటింగ్, తదితర అంశాల్లో పోటీల నిర్వహణ తదితర కార్యక్రమాలను కూడా నిర్వహించారు.
పౌష్టికాహార కార్యక్రమాలు, కార్యకలాపాలు నిర్వహిస్తున్న సమయంలో యువతీ యువకులు మాస్కులు ధరించేలా, క్రమం తప్పకుండా తరచుగా చేతులు శుభ్రపరుచుకునేలా, వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించేలా, ప్రభుత్వం, జిల్లా పరిపాలనా యంత్రాంగం జారీ చేసిన మార్గదర్శక సూత్రాలు పాటించేలా జిల్లా స్థాయి నెహ్రూ యువ కేంద్రాలు తగిన జాగ్రత్తలు తీసుకున్నాయి.
దీనికి తోడు, స్థానిక నోటిఫికేషన్ల ప్రకారం కార్యక్రమాల నిర్వహణకు జిల్లా పరిపాలనా యంత్రాగాల అనుమతి తీసుకునేందుకు ఏర్పాట్లు చేశారు.
2020సంవత్సరపు జాతీయ పౌష్టికాహార మాసం కోసం గుర్తించిన కార్యకలాపాలు.
- తీవ్రమైన పౌష్టికాహార లోపం కలిగిన పిల్లల గుర్తింపు. పెరడు తోటలను ప్రోత్సహించేందుకు మొక్కలనాటే కార్యక్రమ నిర్వహణ.
- తీవ్రమైన పౌష్టికాహార లోపంతో ఉన్న వారిని, అలాంటి చిన్నారులను డిజిటల్ వేదికల ద్వారా సామాజిక ప్రాతిపదికన గుర్తించే అంశంపై అవగాహన కల్పించేందుకు నెహ్రూ యువకేంద్ర సంఘటన్ వంటి యువజన గ్రూపులను, వలంటీర్ గ్రూపులను వినియోగించుకోవడం
- పౌష్టికాహారం, ఆహార నాణ్యతపై డిజిటల్ వేదికల ద్వారా అవగాహన కల్పించేందుకు ‘ఫిట్ ఇండియా’ ప్రచారాన్ని, ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ (ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఎల్.) సహకారంతో నిర్వహించడం.
- పౌష్టిహారం, పారిశుద్ధ్యం, ఆరోగ్యకరమైన విధానాలు, ఆహారంలో తగిన విభిన్నత్వం వంటి అంశాలపై అవగాహన, చైతన్యం కలిగించడం.
- సంబంధిత ఆవరణల్లో పోషకాహార ప్రాధాన్యంతో తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం.
***
(Release ID: 1659525)
Visitor Counter : 480