వ్యవసాయ మంత్రిత్వ శాఖ

గత ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం 1066.06 ల.హె.తో పోలిస్తే, ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు 1116.88 ల.హె.కు చేరిన సాగు విస్తీర్ణం

Posted On: 25 SEP 2020 3:57PM by PIB Hyderabad

కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ప్రభుత్వ కార్యక్రమాలు, ముఖ్య పథకాల అమలుకు తీవ్రంగా కృషి చేశాయి. విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు, యంత్రాలు, అప్పులు వంటివాటిని కేంద్ర ప్రభుత్వం రైతులకు సకాలంలో అందించడం వల్ల, లాక్‌డౌన్‌ సమయంలోనూ భారీ విస్తీర్ణంలో పంటల సాగుకు వీలైంది. సకాలంలో సాగు చర్యలు చేపట్టడం, సాంకేతికత అందిపుచ్చుకోవడం, ప్రభుత్వ పథకాలను రైతులు చక్కగా ఉపయోగించుకోవడం వల్ల ఇది సాధ్యమైంది. ఖరీఫ్‌లో సాగు విస్తీర్ణం పెరుగుదలపై ఇప్పటివరకు కరోనా ప్రభావం లేదు.

    గత ఖరీఫ్‌లో మొత్తం సాగు విస్తీర్ణం 1066.06 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ప్రస్తుత ఖరీఫ్‌లో ఇప్పటివరకు 1116.88 లక్షల హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. తుది లెక్కలు అక్టోబర్‌ 1వ తేదీన ఖరారు కావచ్చు.

వరి: ఈ ఏడాది 407.14 లక్షల హెక్టార్లలో వరి పండిస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో 385.71 లక్షల హెక్టార్లలో సాగయింది.
విస్తీర్ణ వృద్ధి 5.56 శాతం.

పప్పుధాన్యాలు: ఈ ఏడాది 139.36 లక్షల హెక్టార్లలో పప్పుధాన్యాలు పండిస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో 133.94 లక్షల హెక్టార్లలో సాగయింది. విస్తీర్ణ వృద్ధి 4.05 శాతం.

తృణధాన్యాలు: గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 180.35 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 183.01 లక్షల హెక్టార్లలో తృణధాన్యాలు పండిస్తున్నారు. విస్తీర్ణ వృద్ధి 1.47 శాతం.

నూనె గింజలు: గతేడాది ఇదే సమయంలో సాగుచేసిన 179.63 లక్షల హెక్టార్లతో పోలిస్తే, ఈ ఏడాది 197.18 లక్షల హెక్టార్లలో నూనె గింజలు పండిస్తున్నారు. విస్తీర్ణ వృద్ధి 9.77 శాతం.

చెరకు: ఈ ఏడాది 52.84 లక్షల హెక్టార్లలో చెరకు పండిస్తుండగా, గతేడాది ఇదే సమయంలో ఇది 51.89 లక్షల హెక్టార్లుగా ఉంది. విస్తీర్ణ వృద్ధి 1.83 శాతం.

పత్తి: పత్తిని ఈ ఏడాది 130.37 లక్షల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. గతేడాది ఇదే కాలంలో ఈ విస్తీర్ణం 127.67 లక్షల హెక్టార్లు. విస్తీర్ణ వృద్ధి 2.11 శాతం.

జనపనార&గోగునార: ఈ ఖరీఫ్‌లో 6.98 లక్షల హెక్టార్లలో ఇవి సాగవుతున్నాయి. గత ఖరీఫ్‌లో ఇది 6.86 లక్షల హెక్టార్లు. విస్తీర్ణ వృద్ధి 1.78 శాతం.

***
 



(Release ID: 1659185) Visitor Counter : 214