ప్రధాన మంత్రి కార్యాలయం

శ్రీ ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌‌ణ్యం క‌న్నుమూత‌ ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

Posted On: 25 SEP 2020 3:31PM by PIB Hyderabad

శ్రీ ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌‌ణ్యం క‌న్నుమూత‌ ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపం తెలిపారు.

“శ్రీ ఎస్‌.పి. బాల‌సుబ్ర‌హ్మ‌‌ణ్యం మ‌ర‌ణం ఎంతో దుర‌దృష్ట‌కరం; మ‌న సాంస్కృతిక ప్ర‌పంచం మ‌రింత పేద‌దిగా మారిపోయింది.  భార‌త‌దేశం అంత‌టా చిర‌ప‌రిచితమైన ఆయ‌న తన సుమధుర  కంఠ‌స్వ‌రం తో, శ్రావ్య సంగీతం తో ద‌శాబ్దాల త‌ర‌బ‌డి శ్రోత‌లను సమ్మోహితులను చేశారు.  ఈ దుఃఖ‌భరిత ఘ‌డియ‌లో ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌, ఆయ‌న అభిమానులకు కలిగిన శోకంలో నేను సైతం పాలుపంచుకొంటున్నాను.  ఓమ్ శాంతి” అని ఒక సందేశం లో ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు.
  

***


(Release ID: 1659065) Visitor Counter : 157