ఆయుష్

ఆయుష్ మంత్రిత్వ శాఖకు చెందిన పని ప్రదేశాల్లో ఈ రోజు నుండి ప్రారంభమైన - "యోగా బ్రేక్"

Posted On: 25 SEP 2020 12:27PM by PIB Hyderabad

కోవిడ్-19 ప్రారంభమైన తరువాత నిలిపివేయబడిన ఆయుష్ మంత్రిత్వ శాఖ యొక్క “యోగా బ్రేక్” ప్రోటోకాల్‌ను ప్రోత్సహించే చర్యలు ఈ రోజు నుండి తిరిగి ప్రారంభించబడ్డాయి. పని ప్రదేశంలో యోగా ను ప్రవేశపెట్టాలని, ఐదునిముషాల సమయం పట్టే  ఈ ప్రోటోకాల్ ను ఉద్దేశించారు. అలసట తీరడానికి మరియు పనిపై తిరిగి దృష్టి పెట్టడానికి వీలుగా, పని నుండి కాసేపు విరామం తీసుకోడానికి ఇది సహాయపడుతుంది. 

యోగా అనేది శారీరక, మానసిక, భావోద్వేగ మరియు ఆధ్యాత్మిక కోణాలవైపు, వ్యక్తుల సమతుల్యతను, శ్రేయస్సును తీసుకురావడానికి ఉద్దేశించిన పురాతన భారతీయ ప్రక్రియ.  పని అలవాట్లలో మార్పు కారణంగా, ముఖ్యంగా కంప్యూటర్లపై ఎక్కువ గంటలు పని చేయడం వల్ల, చాలా మంది ఉద్యోగులు పని ఒత్తిడికి గురౌతున్నారు.  ఇటువంటి ఒత్తిడి వల్ల పని మీద దృష్టి తగ్గుతుంది. ఇది వారి సామర్థ్యాన్ని మరియు ప్రభావాన్ని మరింత దెబ్బతీస్తుంది.

ఎమ్.డి.ఎన్.ఐ.వై. సహకారంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ 2019 లో పని ప్రదేశంలో కార్మికులకు ఒత్తిడి తగ్గించి, అలసట తీర్చి, తిరిగిపనిపై దృష్టి పెట్టడానికి వీలుగా 5 నిమిషాల యోగా బ్రేక్ ప్రోటోకాల్‌ను అభివృద్ధి చేసింది.  ప్రముఖ యోగా నిపుణుల బృందం అభివృద్ధి చేసిన ఈ ప్రోటోకాల్‌ లో తడాసనా, కటి చక్రాసనా, మొదలైన కొన్ని యోగాభ్యాసాలతో పాటు నాడీసోధన, భ్రమరి ప్రాణాయామం, ధ్యానం కూడా ఉన్నాయి.  ఈ ప్రోటోకాల్ ముందుగా 2020 జనవరి లో ప్రయోగాత్మకంగా ప్రారంభించబడింది.  పాల్గొన్నవారి అభిప్రాయాల విశ్లేషణ ఆధారంగా ఇది ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

 

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ రోజు ఆయుష్ భవన్ ‌లోనూ, న్యూఢిల్లీ లోని ఎమ్.డి.ఎన్.ఐ.వై. ప్రాంగణాలలోనూ,  యోగా బ్రేక్ (వై-బ్రేక్) ప్రోటోకాల్‌ ను తిరిగి ప్రారంభించింది.  ప్రస్తుతం ఉన్న ఆరోగ్య అత్యవసర పరిస్థితిని పరిగణనలోకి తీసుకుంటే, ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడంలో దాని ప్రభావం దృష్ట్యా, శ్వాస వ్యాయామం (ప్రాణాయామం) పై అదనపు ప్రాధాన్యత ఇవ్వబడింది.  ఆయుష్ భవన్ యొక్క పచ్చిక బయళ్లలో ప్రతిరోజూ పది నిమిషాల పాటు ఈ ప్రదర్శన మరియు శిక్షణ కొనసాగుతుంది.  పరిసరాల్లోని వివిధ కార్యాలయాల నుండి ఈ కార్యక్రమంలో పాల్గొనదలచిన వారు తమ పేర్లు నమోదు చేసుకున్నారు.  సామాజిక దూరం నిబంధనతో పాటు ప్రభుత్వ ఇతర మార్గదర్శకాలను తప్పకుండా పాటించేటట్లు చూస్తారు.  ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ సౌకర్యాన్ని రాబోయే వారాల్లో న్యూఢిల్లీ లోని, ఐ.ఎన్.ఏ. జి.పి.ఓ. ప్రాంగణంలో ఉన్న వివిధ కార్యాలయాల సిబ్బందికి మరియు అధికారులకు ఈ సౌకర్యాన్ని ఉచితంగా అందిస్తుంది.

*****


(Release ID: 1659050) Visitor Counter : 223