వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
కోవిడ్-19 మహమ్మారి సందర్భంగా, దేశీయ రవాణా కోసం లిక్విడ్ ఆక్సిజన్ తీసుకెళ్లడానికి ఐఎస్ఓ ట్యాంక్ కంటైనర్లను ప్రవేశపెట్టేందుకు పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) కు అనుమతి మంజూరు
प्रविष्टि तिथि:
23 SEP 2020 10:43AM by PIB Hyderabad
కోవిడ్ 19 మహమ్మారి నేపథ్యంలో, మరియు ఆక్సిజన్‌ను తగినంత పరిమాణంలో తరలించాల్సిన అవసరం ఉందని, స్వల్ప కాలం నోటీసుతో , మిగులు ఉన్న ప్రాంతాల నుండి లోటు ఉన్న ప్రాంతాలకు, దేశీయ రవాణా కోసం ద్రవ ఆక్సిజన్‌ను తరలించడానికి ఐఎస్ఓ కంటైనర్లకు అనుమతి ఇవ్వడం అవసరమని భావించారు. దేశీయ రవాణా కోసం లిక్విడ్ ఆక్సిజన్ కదలిక కోసం ఐఎస్ఓ ట్యాంక్ కంటైనర్లను ప్రవేశపెట్టడానికి వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ కి చెందిన డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ (డిపిఐఐటి), పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) కు అనుమతి ఇచ్చింది. నొవెల్ కరోనా వైరస్ (కోవిడ్ -19) మహమ్మారి వల్ల, ఐఎస్ఓ కంటైనర్ల ద్వారా దేశంలో ఆక్సిజన్ కదలిక రోడ్ నెట్‌వర్క్ ద్వారా సురక్షితంగా, వేగవంతంగా ఆక్సిజన్ బదిలీకి ప్రయోజనకారిగా ఉంటుంది.
దేశీయంగా నడపడం కోసం ఐఎస్ఓ ట్యాంక్ కంటైనర్లను ప్రవేశపెట్టే ప్రతిపాదనను క్రయోజెనిక్ ఆక్సిజన్ తయారీదారులతో సంప్రదింపుల సమావేశం తరువాత డిపిఐఐటి చేపట్టింది. వాటాదారుల సంప్రదింపులు కూడా జరిగాయి. అవసరం ఎక్కువగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో త్వరితగతిన పరిష్కరించడానికి ఈ అనుమతులను ప్రారంభంలో ఒక సంవత్సరం ఇచ్చారు.
ఈ సందర్భంలో, పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (పెసో) ఆక్సిజన్ కోసం ఐఎస్ఓ ట్యాంక్ కంటైనర్లకు అనుమతులను త్వరగా మంజూరు చేయడానికి వాటాదారుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించడానికి మాడ్యూల్‌ను రూపొందించింది. ఐఎస్ఓ ట్యాంక్ ఐఎస్ఓ ప్రమాణాలకు అనుగుణంగా రూపొందించిన ట్యాంక్ కంటైనర్ (అంతర్జాతీయ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్). ఐఎస్ఓ ట్యాంకులు పెద్ద మొత్తంలో ద్రవాలను తీసుకువెళ్ళడానికి రూపొందించబడ్డాయి. ట్యాంక్ స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేయబడింది, దాని చుట్టూ వివిధ రకాల రక్షణ పొరలు ఉన్నాయి. ఐఎస్ఓ ట్యాంకర్ 20 మెట్రిక్ టన్నుల ద్రవ ఆక్సిజన్‌ను రవాణా చేయగలవు. అవి ఒకేసారి భారీ మొత్తంలో ఆక్సిజన్‌ను తీసుకెళ్లగలవు కాబట్టి, అవసరమైన ప్రాంతాలకు తగినంత ఆక్సిజన్‌ను బదిలీ చేయడానికి ఐఎస్ఓ కంటైనర్లు సహాయపడతాయి.
*****
(रिलीज़ आईडी: 1658066)
आगंतुक पटल : 262