ప్రధాన మంత్రి కార్యాలయం
దేశవ్యాప్తం గా ఉన్న ఫిట్ నెస్ ఔత్సాహికుల తో మాట్లాడనున్న ప్రధాన మంత్రి
Posted On:
22 SEP 2020 12:23PM by PIB Hyderabad
ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భం లో ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఫిట్ ఇండియా డైలాగ్ పేరిట దేశవ్యాప్తం గా ఆన్ లైన్ లో నిర్వహించే ఒక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొని ఫిట్‌నెస్ పట్ల అవగాహన కలిగించే వారితో, పౌరుల తో మాట్లాడనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ప్రథమ వార్షికోత్సవ సందర్భం లో ఈ నెల 24న నిర్వహిస్తున్నారు.
ఈ ఆన్ లైన్ కార్యక్రమం లో పాల్గొనేవారు తమ ఫిట్ నెస్ ప్రయాణం తాలూకు కొన్ని సంఘటనల ను వెల్లడిచేస్తూ, కొన్ని చిట్కాలను చెబుతారు. అలాగే, ఫిట్ నెస్ గురించి, చక్కని ఆరోగ్యాన్ని గురించి, ప్రధాన మంత్రి కి ఉన్న ఆలోచనల నుంచి వారు మార్గదర్శకత్వాన్ని కూడా స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమం లో శ్రీ విరాట్ కోహ్లీ మొదలుకొని, శ్రీ మిలింద్ సోమన్, రుజుటా దివాకర్ వంటి ప్రముఖుల తో పాటు, ఫిట్‌నెస్ అవసరాన్ని స్పష్టం చేసే ఇతర ప్రముఖులు కూడా ఉంటారు.
కొవిడ్ 19 నేపథ్యం లో ఫిట్ నెస్ అనేది జీవితం లో మరింత ప్రాముఖ్యం కలిగిన అంశం గా మారింది. కాగా, ఫిట్ ఇండియా డైలాగ్ లో పోషణ విజ్ఞానం, వెల్ నెస్ లతో పాటు ఫిట్ నెస్ కు సంబంధించిన వివిధ అంశాల పై ఒక సమయోచిత, ఫలప్రద సంభాషణ కు చోటు ఇవ్వనుంది.
గౌరవనీయ ప్రధాన మంత్రి ఆలోచన కు అనుగుణంగా ఒక ప్రజా ఉద్యమం గా శ్రీకారం చుట్టుకొన్న ఫిట్ ఇండియా డైలాగ్ కార్యక్రమం భారతదేశాన్ని ఒక దేహదారుఢ్య దేశం గా తీర్చిదిద్దేందుకు ఉద్దేశించిన ప్రణాళిక ను సిద్ధం చేయడం లో పౌరుల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే మరో ప్రయత్నం. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ను సరదాగా, తేలికగా, మరీ ఎక్కువ ఖర్చుతో ఉండనటువంటి పద్ధతుల లో శరీరాన్ని దృఢం గా ఎలా మలచుకోవాలో సూచించడం పరమార్థం గా ఉన్న కార్యక్రమం. ఇది ప్రవర్తన పరంగా ఒక మార్పును తీసుకురావడం తో పాటు, ఫిట్ నెస్ ను భారతదేశం లో ప్రతి ఒక్కరి జీవితం లో ఒక అనివార్య భాగం గా చేసేందుకు సంకల్పించిన కార్యక్రమం కూడా.
గత ఏడాది కాలం లో ఫిట్ ఇండియా మూవ్‌మెంట్ ఆధ్వర్యం లో వివిధ కార్యక్రమాల ను నిర్వహించగా, దేశం లోని అన్ని ప్రాంతాల లో వేరు వేరు వృత్తులవారు ఈ కార్యక్రమాల లో ఎంతో ఉత్సాహం తో పాల్గొన్నారు. ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్, ప్లాగ్ రన్, సైక్లోథన్, ఫిట్ ఇండియా వీక్, ఫిట్ ఇండియా స్కూల్ సర్టిఫికెట్, తదితర కార్యక్రమాల లో మూడున్నర కోట్ల మందికి పైగా భాగం పంచుకొని దీనిని ఒక సిసలైన ప్రజా ఉద్యమం గా మార్చారు.
దేశం లో వివిధ ప్రాంతాల కు చెందిన ఫిట్ నెస్ అభిమానులు పాల్గొనబోయే ఫిట్ ఇండియా డైలాగ్ ఈ దేశవ్యాప్త ఉద్యమ సాఫల్యానికి సారధులు పౌరులే అనే భావన ను మరింత బలపరచనుంది.
సెప్టెంబర్ 24న మధ్యాహ్నం 11.30కు ఎన్ఐసి లింక్, https://pmindiawebcast.nic.in ద్వారా ఎవరైనా సరే ఫిట్ ఇండియా డైలాగ్ లో భాగస్తులు కావచ్చు.
***
(Release ID: 1657714)
Visitor Counter : 265
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam