ప్రధాన మంత్రి కార్యాలయం
కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల లో ఆ వ్యాధి పై తీసుకొవలసిన ప్రతిచర్యలు, వ్యాధి వ్యాప్తి నివారణ సన్నాహాల స్థాయిలను రేపటి రోజు న సమీక్షించనున్న ప్రధాన మంత్రి
Posted On:
22 SEP 2020 11:54AM by PIB Hyderabad
కొవిడ్ కేసులు ఎక్కువగా ఉన్న ఏడు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో చేపడుతున్న చర్యలు, ఆ వ్యాధి సంక్రమణ ను అరికట్టడానికి తగిన సన్నాహక స్థితి ని గురించి రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో, ఆరోగ్య శాఖ మంత్రుల తో రేపటి రోజు న, అంటే ఈ నెల 23 న జరిగే ఒక ఉన్నత స్థాయి వర్చువల్ సమావేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించనున్నారు.
ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల లో మహారాష్ట్ర, ఆంధ్ర ప్రదేశ్, కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, తమిళ నాడు, పంజాబ్ లతో పాటు దిల్లీ కూడా ఉంది.
దేశవ్యాప్తంగా ఉన్న యాక్టివ్ కేసుల లో 63 శాతానికి పైగా కేసులు ఈ 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతం లోనే కేంద్రీకృతమవుతున్నాయి. అంతేకాదు, నిర్ధారణ అయిన మొత్తం కేసుల లో 65.5 శాతం కేసులు, మొత్తం మరణాల లో 77 శాతం మరణాలు కూడా ఈ 7 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతం లోనే ఉన్నాయి. ఇతర 5 రాష్ట్రాల తో పాటు, పంజాబ్, దిల్లీ లలో బయటపడుతున్న కేసులు ఇటీవలి కాలంలో పెరుగుతున్నాయి. మహారాష్ట్ర, పంజాబ్, దిల్లీ లలో కేస్ ఫాటలిటీ రేట్ (సిఎఫ్ఆర్) 2.0 శాతం గా కంటే ఎక్కువగా ఉంది. పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్ లు మినహా, వాటి పాజిటివిటీ రేటు జాతీయ సగటు అయిన 8.52 శాతం కన్నా మించిపోయింది.
రాష్ట్ర ప్రభుత్వాలు/ కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాల తో కేంద్రం ప్రభావవంతమైన సహకారాన్ని, సన్నిహిత సమన్వయాన్ని నెలకొల్పుకొంటూ కొవిడ్ పై పోరాటానికి నాయకత్వం వహిస్తోంది. ఆయా ప్రాంతాల లో ఆరోగ్య సంరక్షణ సేవల ను, వైద్య చికిత్స సంబంధిత మౌలిక సదుపాయాల ను విస్తరించేందుకు సైతం కేంద్ర ప్రభుత్వం తోడ్పాటును అందిస్తోంది. ఐసియు లను పర్యవేక్షిస్తున్న వైద్యుల రోగ చికిత్స సంబంధిత సామర్ధ్యాల ను న్యూ ఢిల్లీ లోని ఎఐఐఎంఎస్ సహకారం తో ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఇ-ఐసియు, టెలీ-కన్సల్టేషన్ కసరత్తుల ద్వారా గణనీయం గా ఉన్నతీకరించింది. రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల తో ఉన్నత స్థాయి సమీక్ష ను నిర్వహించిన తరువాత ఆసుపత్రుల లో కొవిడ్ సంబంధిత ఆరోగ్య సంరక్షణ సదుపాయాల తో పాటు
మెడికల్ ఆక్సిజన్ ను చాలినంతగా అందుబాటు లో ఉంచే దిశలో జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. వైరస్ పాజిటివ్ కేసుల కట్టడి, నిఘా, పరీక్షలు, దీటయిన రోగ చికిత్స నిర్వహణ వంటి విషయాల లో రాష్ట్రాల కు, కేంద్రపాలిత ప్రాంతాల కు అండదండలను అందించడానికి బహుళ విభాగాల లో ప్రావీణ్యం ఉన్న బృందాల ను ఎప్పటికప్పుడు కేంద్రం పంపిస్తోంది. రోగాన్నిసకాలం లో నిర్ధారించే సేవల కు సంబంధించి ఎదురవుతున్న సవాళ్ళ ను తగిన విధంగా ఎదుర్కోవడం లో, అవసరమైన తదుపరి చర్యల ను చేపట్టడంలో స్థానిక అధికార యంత్రాగాలకు ఈ కేంద్ర బృందాలు మార్గదర్శనం చేస్తున్నాయి.
****
(Release ID: 1657659)
Visitor Counter : 268
Read this release in:
Tamil
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Assamese
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada
,
Malayalam