రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
2024 మార్చి నెలాఖరు కల్లా జన్ ఔషధి కేంద్రాల సంఖ్య ను10,500 కు పెంచాలని లక్ష్యంగా నిర్దేశించిన ప్రభుత్వం
దీనితో దేశం లోని అన్ని జిల్లాల్లో ఈ జన్ ఔషధి కేంద్రాలు ఏర్పాటైనట్లు అవుతుంది
అన్ని దుకాణాల్లో మందులను వాస్తవకాల ప్రాతిపదిక నపంపిణీ చేసేందుకు ఐటి ఆధారిత లాజిస్టిక్స్ ను, సరఫరా వ్యవస్థ ను రూపొందించే దిశ గా చొరవ
Posted On:
17 SEP 2020 1:56PM by PIB Hyderabad
సామాన్యులకు, ప్రత్యేకించి పేద ప్రజలకు తక్కువ ధరల కే నాణ్యమైన మందులను అందించాలన్న ధ్యేయం తో కేంద్ర ప్రభుత్వం 2024 మార్చి నెలాఖరు కల్లా ‘‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధీ కేంద్రాల’’ (పిఎంబిజెకె) సంఖ్య ను 10,500 కు పెంచాలన్న లక్ష్యాన్ని నిర్దేశించిందని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి శ్రీ డి.వి. సదానంద గౌడ తెలిపారు. ఈ జన్ ఔషధీ కేంద్రాలను తమ శాఖకు చెందిన ఫార్మాస్యూటికల్స్ విభాగం ఆధ్వర్యం లో పని చేసే బ్యూరో ఆఫ్ ఫార్మా పి ఎస్ యుస్ ఆఫ్ ఇండియా (బిపిపిఐ) ఏర్పాటు చేస్తోందని, ఈ కేంద్రాల అమలు పర్యవేక్షక సంస్థగా ‘ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన’ (పిఎంబిజెపి) ఉందని మంత్రి చెప్పారు.
జన్ ఔషధీ కేంద్రాల సంఖ్య పెంపు తో దేశం లోని అన్ని జిల్లాలకు ఈ దుకాణాల సేవలు అందుబాటు లోకి వస్తాయని, దీనితో దేశంలో ప్రతి ప్రాంతం లోని ప్రజలు తక్కువ ధరల కు మందులను పొందగలుగుతారని మంత్రి అన్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి దేశం లో జన్ ఔషధీ దుకాణాల సంఖ్య 6603 కు వృద్ధి చెందినట్లు మంత్రి తెలిపారు.
కొవిడ్ మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ ప్రకటన ల కారణంగా ఈ సంవత్సరం మార్చి నెల మొదలుకొని జూన్ మధ్య కాలంలోను, ఆ తరువాత కూడా జన్ ఔషధీ కేంద్రాలకు ఎపిఐ, ఇంకా ఇతర ఫార్మాస్యూటికల్స్ సంబంధిత ముడి పదార్థాల స్టాక్ కు సంబంధించి ఎన్నో సవాళ్ళు ఎదురయ్యాయని. రవాణా పరమైన సమస్యలు తలెత్తి కేంద్ర, ప్రాంతీయ గిడ్డంగుల నుంచి చిల్లర దుకాణాలకు మందులు సరఫరా కావడం లో ఇబ్బందులు ఏర్పడ్డాయని మంత్రి అన్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని, అలాగే విస్తరణ ప్రణాళికను లెక్కలోకి తీసుకొని అన్ని అవుట్ లెట్ లకు మందుల ను వాస్తవ కాల ప్రాతిపదిక న పంపిణీ చేయడం కోసం ఒక దీటైన ఐటి- ఆధారిత లాజిస్టిక్స్, సప్లయ్-చైన్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశ గా సన్నాహాలు సాగుతున్నాయని మంత్రి అన్నారు.
ప్రస్తుతం జన్ ఔషధీ కేంద్రాల కు సంబంధించిన నాలుగు గిడ్డంగులు గురుగ్రామ్, చెన్నై, బెంగళూరు, గువాహాటీ లలో పని చేస్తున్నాయని, అదనం గా రెండు గోదాములను పశ్చిమ భారతదేశంలో, మధ్య భారతంలో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధం అవుతోందని మంత్రి చెప్పారు. దీనికి తోడు, సరఫరా వ్యవస్థ ను పటిష్టం చేయడానికి రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లో పంపిణీదారులను నియమించే ప్రణాళిక ను కూడా సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
2020-21 నుంచి 2024-25 వరకు 490 కోట్ల రూపాయల బడ్జెట్ కు ఆమోదముద్ర వేసినట్లు, ప్రధాన మంత్రి భారతీయ జన్ ఔషధీ పరియోజన (పిఎంబిజెపి) నాణ్యమైన మందుల ధరలను తగ్గించి వాటిని జనాభాలో అధిక సంఖ్యాకులకు, మరీ ముఖ్యంగా పేదలకు అందుబాటులోకి తెస్తోందని మంత్రి వివరించారు.
****
(Release ID: 1655662)
Visitor Counter : 225
Read this release in:
Tamil
,
Odia
,
Kannada
,
Assamese
,
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Punjabi
,
Malayalam