విద్యుత్తు మంత్రిత్వ శాఖ

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ చారిత్రాత్మక వినియోగదారుల అనుకూల చర్యగా విద్యుత్తు (వినియోగదారుల హక్కులు) నిబంధనలు, 2020 ముసాయిదా విడుదల ; సెప్టెంబర్ 30వ తేదీ లోపు సూచనలు / విమర్శలకు ఆహ్వానం

విద్యుత్ కనెక్షన్ కోసం సరళీకృత విధానం ప్రతిపాదన ; 10 కిలోవాట్ల లోడ్ వరకు కనెక్షన్ కోసం 2 పత్రాలు మాత్రమే అవసరం

బిల్లుల జారీ లో అరవై రోజులు ఆలస్యం లేదా అంతకంటే ఎక్కువ జాప్యం అయినట్లయితే, ఆ బిల్లులపై 2 నుండి 5 శాతం తగ్గింపు వర్తింపచేయాలని ప్రతిపాదన

వినియోగదారుల వర్గాన్ని “ప్రొస్యూమర్స్" గా గుర్తింపు

సాధారణ సేవలకు అందుబాటులో ఉండే విధంగా 24 గంటలు ఉచిత టోల్ ఫ్రీ కాల్ సెంటర్, వెబ్ ఆధారిత మరియు మొబైల్ యాప్ ల సదుపాయం

Posted On: 16 SEP 2020 10:25AM by PIB Hyderabad

కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ మొదటిసారిగా విద్యుత్ వినియోగదారుల హక్కుల కోసం నిబంధనలను రూపొందించింది.  విద్యుత్ రంగంలో విద్యుత్ వినియోగదారులు చాలా ముఖ్యమైన వాటాదారులు.  ఈ రంగం ఉనికి వారి కృషి వల్లే కొనసాగుతోంది.  పౌరులందరికీ విద్యుత్తు సౌకర్యం కల్పించిన తరువాత, ఇప్పుడు వినియోగదారుల సంతృప్తిపై దృష్టి పెట్టడం ముఖ్యం.  దీని కోసం, ఈ సేవలకు సంబంధించి కీలకమైన సేవలను గుర్తించడం, కనీస సేవా స్థాయిలు మరియు ప్రమాణాలను సూచించడం మరియు వాటిని వినియోగదారుల హక్కులుగా గుర్తించడం అత్యవసరం

ఈ లక్ష్యంతో, విద్యుత్ (వినియోగదారుల హక్కులు) నిబంధనలు, 2020 యొక్క ముసాయిదాను ప్రభుత్వం మొదటిసారిగా తయారు చేసింది.

ఈ ముసాయిదా లోని ప్రధాన అంశాలు :-

*     సేవ యొక్క విశ్వసనీయత: డిస్కామ్‌ల కోసం సంవత్సరానికి వినియోగదారునికి సగటు అంతరాల సంఖ్య మరియు అంతరాయాల వ్యవధిని ఎస్.ఈ.ఆర్.సి. లు నిర్ణయించాలి, 

*     కనెక్షన్ కోసం సకాలంలో మరియు సరళీకృత విధానం: 10 కిలోవాట్ల లోడ్ వరకు కనెక్షన్ కోసం రెండు పత్రాలు మాత్రమే సర[పోతాయి.  కనెక్షన్ ఇవ్వడాన్ని వేగవంతం చేసేందుకు, 150 కిలోవాట్ల వరకు లోడ్ కోసం డిమాండ్ ఛార్జీల అంచనా అవసరం లేదు. 

*      క్రొత్త కనెక్షన్‌ను అందించడానికి మరియు ఇప్పటికే ఉన్న కనెక్షన్‌ను సవరించడానికి పట్టే సమయం :  మెట్రో నగరాల్లో 7 రోజులకు మించకూడదు,  అదే, ఇతర మునిసిపల్ ప్రాంతాల్లో అయితే,  15 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 30 రోజులకు మించకూడదు.  

*     బిల్లుల జారీ లో అరవై రోజులు లేదా అంతకంటే ఎక్కువ జాప్యం అయినట్లయితే, ఆ బిల్లులపై 2 నుండి 5 శాతం తగ్గింపు.  

*     నగదు, చెక్, డెబిట్ కార్డులు, నెట్ బ్యాంకింగ్ మొదలైన వాటితో బిల్లులు చెల్లించే ఎంపిక, అయితే, 1000 రూపాయలు  లేదా అంతకంటే ఎక్కువ బిల్లు అయితే, ఆన్ ‌లైన్ ‌లో చెల్లించాలి.

*  కనెక్షన్ తొలగించడానికి, తిరిగి కనెక్షన్ ఇవ్వడానికి, మీటరు తిరిగి ఏర్పాటు చేయడానికి, బిల్లింగు, బిల్లుల చెల్లింపు మొదలైన వాటికి సంబంధించిన నిబంధనలు.

*       వినియోగదారుల వర్గాన్ని “ప్రొస్యూమర్స్" గా గుర్తింపు.  వినియోగదారులు మరియు పైకప్పు యూనిట్లను ఏర్పాటు చేసిన లేదా వారి నీటిపారుదల పంపులను సోలరైజ్ చేసిన వ్యక్తులు.  ఎస్.ఈ.ఆర్.సి. సూచించిన పరిమితుల వరకు ఒకే పాయింట్ కనెక్షన్‌ను ఉపయోగించి గ్రిడ్‌లో అధికంగా ఇంజెక్ట్ చేసే హక్కును వారు కలిగి ఉంటారు.

*     డిస్కం ల ద్వారా సేవ ఆలస్యం అయినందుకు పరిహారం / జరిమానాలు; పరిహారం సాధ్యమైనంతవరకు స్వయంచాలకంగా ఉండాలి, వాటిని బిల్లులో కలిపి ఇవ్వాలి. 

*     కొత్త కనెక్షన్, డిస్-‌కనక్షన్, పునః సంయోగం, కనెక్షన్ బదిలీ, పేరు మరియు వివరాలలో మార్పు, లోడ్ మార్పు, మీటర్ భర్తీ, సరఫరాలో అంతరాయం వంటి సాధారణ సేవలకు ఎస్.ఎమ్.ఎస్. / ఈ-మెయిల్ హెచ్చరికలు, ఆన్‌లైన్ స్థితి ట్రాకింగ్ మరియు ఆటో పెరుగుదల కోసం సౌకర్యాలతో, 24x7 టోల్ ఫ్రీ కాల్ సెంటర్, వెబ్ ఆధారిత మరియు మొబైల్ యాప్. 

*     వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార సౌలభ్యం కోసం సబ్ డివిజన్ నుండి వివిధ స్థాయిలలోని వినియోగదారుల తరఫున ఇద్దరు, ముగ్గురు ప్రతినిధులతో వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార ఫోరం.

2020 సెప్టెంబర్, 30వ తేదీ లోపు వినియోగదారుల వ్యాఖ్యలు / అభిప్రాయాలు / సలహాలను కోరేందుకు ముసాయిదా నిబంధనలను విద్యుత్ మంత్రిత్వ శాఖ 2020 సెప్టెంబర్, 9వ తేదీన పంపిణీ చేసింది. అందుకున్న మరియు జారీ చేసిన అన్ని సూచనలను పరిగణనలోకి తీసుకున్న తరువాత వాటిని ఖరారు చేయడం జరుగుతుంది. 

విద్యుత్తు (వినియోగదారుల హక్కులు) నిబంధనలు, 2020 ముసాయిదా పి.డి.ఎఫ్. కోసం ఇక్కడ "క్లిక్" చేయండి 

 

*****



(Release ID: 1655077) Visitor Counter : 261