ప్రధాన మంత్రి కార్యాలయం

భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాల లో స్థితి ని చర్చించడం కోసం అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించిన ప్రధాన మంత్రి

మన సాహసిక సైనికుల లో 20 మంది లద్దాఖ్ లో సర్వోన్నతమైనటువంటి బలిదానాన్ని ఇచ్చారు, అయితే, వారు మన మాతృభూమి కేసి కన్నెత్తి చేసే దుస్సాహసం చేసిన వారికి మరి ఒక పాఠాన్ని సైతం నేర్పారు: ప్రధాన మంత్రి

మన భూభాగం లోకి ఎవరైనా చొరబడడం గాని లేదా మన పోస్టు ను ఆక్రమించడం గాని జరగలేదు: ప్రధాన మంత్రి

భారతదేశం మైత్రి ని మరియు శాంతి ని కోరుకొంటుంది, అయితే సార్వభౌమత్వాన్ని పరిరక్షించడమే ప్రథమగణ్యమైంది గా ఉంది: ప్రధాన మంత్రి

అవసరమైనటువంటి అన్ని చర్యల ను తీసుకోవడం కోసం సాయుధ దళాల కు పూర్తి స్వతంత్రాన్ని ఇవ్వడమైంది: ప్రధాన మంత్రి

మన సరిహద్దుల ను మరింత సురక్షితం గా ఉంచడం కోసం సరిహద్దు ప్రాంత మౌలిక సదుపాయాల అభివృద్ధి కి ప్రభుత్వం ప్రముఖత్వాన్ని ఇచ్చింది: ప్రధాన మంత్రి

దేశ భద్రత కోసం అవసరపడే అన్ని చర్యల నున చేపట్టడమైంది మరియు మౌలిక సదుపాయాల నిర్మాణం శర వేగం గా సాగుతుంది: ప్రధాన మంత్రి

ప్రభుత్వం తో కలసి ఒక్కటై నిలబడటానికి మరి అలాగే, ప్రధాన మంత్రి యొక్క నాయకత్వం పట్ల భరోసా ను వ్యక్తం చేసిన రాజకీయ పక్షాల నేతలు




Posted On: 19 JUN 2020 9:03PM by PIB Hyderabad

భారతదేశం-చైనా సరిహద్దు ప్రాంతాల లో స్థితి ని చర్చించడం కోసం వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అఖిల పక్ష సమావేశాన్ని ఈ రోజు న నిర్వహించారు.  వివిధ రాజకీయ పక్షాల అధ్యక్షులు ఈ సమావేశం లో పాలుపంచుకొన్నారు. 


సాయుధ దళాల యొక్క పరాక్రమం

మన సరిహద్దుల ను రక్షించుకోవడానికి ఈ రోజు న మనమంతా సైనికుల తో పాటు ఒక్కతాటి మీద నిలబడి మరి అదే విధం గా వారి యొక్క సాహసాన్ని మరియు ధైర్యాన్ని నమ్మి వారి పట్ల భరోసా ను వ్యక్తం చేస్తున్నాము అని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  అఖిల పక్ష సమావేశాన్ని నిర్వహించడం ద్వారా, అమర వీరుల యొక్క కుటుంబాల కు యావత్తు దేశం వారి వెన్నంటి నిలచివుందన్న భరోసా ను ఇవ్వదలచుకొన్నానని కూడా ఆయన అన్నారు.

ఎవ్వరూ మన ప్రాంతం లోకి రావడం గాని లేదా మన కు చెందిన ఏదైనా పోస్టు ను ఆక్రమించడం గాని జరుగలేదు అని ప్రధాన మంత్రి సమావేశం ఆరంభం లో స్పష్టం చేశారు.  మన జవానుల లో ఇరవై మంది దేశం కోసమని సర్వోన్నతమైనటువంటి బలిదానాన్ని లద్దాఖ్ లో ఇచ్చారు, అయితే వారు మన మాతృభూమి కేసి కన్నెత్తి చేసే దుస్సాహసం చేసిన వారి కి మరి ఒక పాఠాన్ని సైతం నేర్పారు అని ప్రధాన మంత్రి అన్నారు.   వారి యొక్క వీరత్వాన్ని మరియు వారు చేసినటువంటి త్యాగాన్ని దేశ ప్రజలు ఎల్లప్పటి కి జ్ఞాపకం పెట్టుకొంటారు అన్నారు.
  
ఎల్ఎసి లో చైనా తీసుకొన్న చర్యల పట్ల యావత్తు దేశం ఆక్రోశిస్తున్నదని, గాయపడిందని ప్రధాన మంత్రి అన్నారు.  దేశాన్ని రక్షించడానికి మన సాయుధ బలగాలు ఎంత మాత్రం వెనుదీయడం లేదు అని నేతల కు ఆయన హామీ ని ఇచ్చారు.  మోహరింపు కావచ్చు, పోరాటం చేయడం కావచ్చు, దాడి కి ప్రతిచర్య ను- నేల మీద, నింగి లో లేదా సముద్రం లో- చేపట్టడం కావచ్చు, దేశాన్ని కాపాడటం కోసం మన సైన్యం అవసరపడిన చర్యల ను చేపడుతూ ఉన్నాయని తెలిపారు.  దేశం ప్రస్తుతం ఎంతటి సామర్థ్యాన్ని కలిగివుందీ అంటే ఎవ్వరూ కూడా మన భూమి తాలూకు ఒక్క అంగుళం కేసి అయినా సరే తేరి పార చూసే దుస్సాహసాన్ని చేయజాలరు అని ఆయన నొక్కిచెప్పారు.  ప్రస్తుతం, భారతీయ దళాలు అన్ని క్షేత్రాల కు వెళ్లగలుగుతాయి అని ఆయన పేర్కొన్నారు. ఒక ప్రక్క న, సైన్యాని కి అవసర చర్యల ను తీసుకోవడం కోసం స్వతంత్రత ను ఇవ్వడం జరిగింది, మరొక ప్రక్క న దౌత్య మాధ్యమం ద్వారా భారతదేశం తన వైఖరి ని చైనా కు పూర్తి గా విడమరచింది కూడా.

సరిహద్దు లో మౌలిక సదుపాయాల స్వరూపాన్ని బలపరచడం

ప్రభుత్వం శాంతి ని మరియు మైత్రి ని ఆకాంక్షిస్తోంది అని, కానీ సార్వభౌమత్వ పరిరక్షణ అగ్రేసరమని  ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  సరిహద్దుల ను ఆనుకొని ఉన్నటువంటి ప్రాంతాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధిపరచడానికి ప్రభుత్వం ప్రాముఖ్యాన్ని ఇచ్చిందని, ఈ చర్య మన సరిహద్దుల ను మరింత పదిలంగా మలచుకోవడం కోసం ఉద్దేశించినదని ఆయన స్పష్టం చేశారు.  పోరాట విమానాలు, ఆధునిక హెలికాప్టర్ లు, క్షిపణి రక్షణ వ్యవస్థ ల వంటి మన బలగాల కు అవసరమయ్యే ఇతరత్రా సామగ్రి కై తగిన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది.  ఇటీవల అభివృద్ధిపరచిన మౌలిక సదుపాయాల ద్వారా, ఎల్ఎసి వద్ద గస్తీ సామర్థ్యాన్ని కూడా పెంచడం ద్వారా, మనకు ఎల్ ఎసి లో చోటు చేసుకొనేటటువంటి ఘటన ల క్రమం తాలూకు సమాచారం అధికం గా తెలియవస్తోందని, మరి తత్పర్యవసానం గా పర్యవేక్షణ పరం గా దక్షత ను పెంచుకొని మెరుగైన రీతి లో ప్రతిచర్య కు దిగగల స్థితి కి చేరుకొన్నామన్నారు.  ఇంతకు పూర్వం ఎటువంటి అంతరాయం ఎదురవకుండానే జరిగే రాకపోకల ను ప్రస్తుతం మన జవాను లు సరిచూస్తున్నారని, ఇది అప్పుడప్పుడు ఉద్రిక్తత పెరిగిపోవడానికి దారితీస్తోందన్నారు.  దుర్గమమైనటువంటి ప్రాంతాల లో జవాను ల కోసం అత్యవసర వస్తువుల మరియు సామగ్రి యొక్క సరఫరా ఉత్తమమైన మౌలిక సదుపాయాల ను కల్పించడం ద్వారా ఇదివరకటితో పోలిస్తే సులభతరం గా మారింది అని ఆయన తెలిపారు. 

దేశం యొక్క సంక్షేమం పట్ల మరియు దేశ పౌరుల యొక్క సంక్షేమం పట్ల ప్రభుత్వం వచనబద్ధురాలై ఉంది అని ప్రధాన మంత్రి వక్కాణించారు.  అది వ్యాపారం అయినా, సంధానం అయినా, లేక ఉగ్రవాదాన్ని నిరోధించడం అయినా,  బయటి వైపు నుండి వచ్చే ఒత్తిడి కి ప్రభుత్వం ఎల్లవేళ ల ఎదురొడ్డి నిలబడింది అని ఆయన అన్నారు.  దేశ భద్రత కు మరియు అవసరమయ్యే మౌలిక సదుపాయాల ను నిర్మించేందుకు అన్ని చర్యల ను తీసుకోవడం అనే ప్రక్రియ నిరంతరం గా సత్వర గతి న జరుగుతూ ఉంటుందని ఆయన భరోసా ను ఇచ్చారు.  మన సరిహద్దుల ను రక్షించడానికి సాయుధ దళాల కు గల శక్తి సామర్థ్యాల ను గురించి నేతల కు ఆయన మరో మారు హామీ ని ఇస్తూ, ఆవశ్యకమయ్యే అన్ని రకాల చర్యల ను తీసుకోవడం కోసం వారి కి పూర్తి స్వతంత్రత ను ఇవ్వడం జరిగింది అన్నారు.

రక్షణ మంత్రి శ్రీ రాజ్ నాథ్ సింహ్ మాట్లాడుతూ,  మృత వీరుల త్యాగాన్ని దేశం ఎన్నటికీ మరువదన్నారు.  విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జయశంకర్ సరిహద్దు ప్రాంత నిర్వహణ అంశం పై చైనా కు మరియు భారతదేశానికి మధ్య కుదిరిన ఒప్పందాల ను గురించి, 1999 వ సంవత్సరం లో మంత్రిమండలి ద్వారా గుర్తించబడినటువంటి మరియు ఆమోదించబడినటువంటి సరిహద్దు క్షేత్రాల లో మౌలిక సదుపాయాల ను అభివృద్ధిపరచడానికి సర్వోన్నత  ప్రాధాన్యాన్ని ఇవ్వాలంటూ ప్రధాన మంత్రి 2014 వ సంవత్సరం లో  ఆదేశాల ను ఇచ్చిన సంగతి ని గురించి, ఇంకా ఇటీవలి పరిణామాల క్రమాన్ని గురించిన వివరాల ను సమావేశం లో  సంక్షిప్తం గా ప్రస్తావించారు.   

రాజకీయ పక్ష నేతలు ఆడిన మాట లు

లద్దాఖ్ లో సాయుధ దళాలు కనబరచిన శౌర్యాన్ని రాజకీయ పక్షాల నేత లు ప్రశంసించారు.  ఈ ఘడియల లో ప్రధాన మంత్రి యొక్క నేతృత్వం పట్ల వారు వారి యొక్క భరోసా ను వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వం తో  కలిసికట్టుగా నిలబడేందుకు సిద్ధమని తమ వచనబద్ధత ను ప్రకించారు.  పరిస్థితి ని ఎదుర్కొనే విషయం లో వారు వారి యొక్క ఆలోచనల ను మరియు అభిప్రాయాల ను కూడా వెల్లడించారు.

ప్రభుత్వం తో బలమైన సంఘీభావాన్ని తన పార్టీ అనుసరిస్తుంది అని మమత బనర్జీ అన్నారు.  నేతల మధ్య ఎటువంటి అభిప్రాయభేదం ఉండకూడదు అని, పార్టీ లు ఏ విధమైనటువంటి అనైక్యత ను అనుమతించ రాదని, ఏకత లోపిస్తే అటువంటి స్థితి ని ఇతర దేశాలు వాటికి అనువు గా ఉపయోగించుకొనే ముప్పు పొంచి వుంటుందని శ్రీ నీతీశ్ కుమార్ అన్నారు.  ప్రధాన మంత్రి నాయకత్వం లో భద్రం గా ఉన్నామని దేశం తలపోస్తోందని శ్రీ చిరాగ్ పాస్ వాన్ అన్నారు.  శ్రీ ఉద్ధవ్ ఠాక్ రే ప్రధాన మంత్రి యొక్క నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, యావత్తు దేశ ప్రజలు ఒక్కటిగా ఉంటూ ప్రధాన మంత్రి కి తోడు గా నిలబడుతున్నారని పేర్కొన్నారు.

వివరాలు ఇప్పటికీ నేతల కు తెలియడం లేదని సోనియా గాంధీ అన్నారు.  రహస్య సమాచార నివేదిక ల గురించి ఇంకా ఇతర సంబంధిత అంశాల ను గురించి ప్రభుత్వాన్ని ఆమె ప్రశ్నలు వేశారు.  సైనికులు ఆయుధాల ను ధరించాలా లేక ధరించ వద్దా అనేది అంతర్జాతీయ ఒప్పందాలు నిర్ణయిస్తాయి అని, పార్టీ లు ఇటువంటి వ్యవహారాల లో ఇమిడివున్నటువంటి సంవేదనశీలత ను ఆదరించాలని శ్రీ శరద్ పవార్ పేర్కొన్నారు.  ఈశాన్య ప్రాంతాల లో మౌలిక సదుపాయాల సంబంధిత కార్యాల పై ప్రధాన మంత్రి పనిచేస్తూ ఉన్నారు అని శ్రీ కోన్ రాడ్ సంగ్ మా అంటూ, ఈ పని పురోగమించాలన్నారు. ఇది రాజకీయాల కాలం కాదు అని మాయావతి చెప్తూ, ప్రధాన మంత్రి తీసుకొనే ఏ విధమైనటువంటి నిర్ణయాల పైన అయినా తాను ఆయన కు సమర్థన ను వ్యక్తం చేస్తానన్నారు.  ఈ వ్యవహారం లో ప్రధాన మంత్రి ఇటీవల ఇచ్చిన ప్రకటన ను శ్రీ ఎమ్.కె. స్టాలిన్ స్వాగతించారు.

నేత లు సమావేశం లో పాల్గొన్నందుకు మరి వారి యొక్క అభిప్రాయాల ను వెల్లడించినందుకు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు.


***



(Release ID: 1654974) Visitor Counter : 205