ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

కోవిడ్ తర్వాత కోలుకుంటున్న వ్యాధిగ్రస్తుల సంపూర్ణ పరిరక్షణ, శ్రేయస్సు కోసం పోస్ట్ కోవిడ్ నిర్వహణ ప్రోటోకాల్ జారీ చేసిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ


Posted On: 13 SEP 2020 2:40PM by PIB Hyderabad

రాష్ట్ర / కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలతో సన్నిహిత సమన్వయం, సహకారంతో దేశంలో కోవిడ్-19 ప్రతిస్పందన, నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం అగ్రగామిగా ఉంది. కోవిడ్-19 నివారణ, నియంత్రణ, నిర్వహణ కోసం అనేక వ్యూహాత్మక, క్రమాంకన చర్యలు చేపట్టింది. 

తీవ్రమైన కోవిడ్-19 అనారోగ్యం తరువాత, కోలుకున్న రోగులు అలసట, ఒళ్ళు నొప్పులు, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైన అనేక రకాల సంకేతాలను, లక్షణాలను వ్యక్తం చేస్తున్నారు. తీవ్రమైన రూపంతో బాధపడుతున్న రోగులు, ముందుగా ఉన్న అనారోగ్యంతో బాధపడుతున్న రోగుల కన్నా కోలుకునే సమయం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. పోస్ట్-కోవిడ్ లో కోలుకుంటున్న రోగులందరి సంరక్షణ, శ్రేయస్సు కోసం సంపూర్ణ విధానం అవసరం. దీనిపై దృష్టి పెడుతూ కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ పోస్ట్ కోవిడ్ మేనేజ్‌మెంట్ ప్రోటోకాల్‌ను జారీ చేసింది. ఇంట్లో సంరక్షణ కోసం కోవిడ్ నుండి తగినంతగా కోలుకున్న రోగుల కోసం ఇది సమగ్ర సంపూర్ణ విధానాన్ని అందిస్తుంది.

ఈ ప్రోటోకాల్, నివారణ చికిత్సకు కానీ, వ్యాధిని నయం చేసే చికిత్సకు కానీ ఉద్దేశించినది కాదు. 

1. వ్యక్తిగత స్థాయిలో

* కోవిడ్ కి అవసరమైన జాగ్రత్తలు యథావిధిగా కొనసాగించండి (మాస్క్ వేసుకోవడం, చేతి & శ్వాసకోశ పరిశుభ్రత, శారీరక దూరం).
* తగినంత వెచ్చని నీటిని త్రాగాలి (నిషేధం ఉంటే తప్పితే... ).
* ఆయుష్ ప్రోత్సహించే రోగనిరోధక శక్తి ఔషధాన్నితీసుకోండి - ఆయుష్ అర్హత కలిగిన ప్రాక్టీషనర్ సూచనల మేరకే.
* ఆరోగ్యం అనుమతిస్తే, క్రమం తప్పకుండా ఇంటి పని చేయాలి. వృత్తిపరమైన పనులను దశల వారీగా  తిరిగి ప్రారంభించాలి.
* తేలికపాటి / మితమైన వ్యాయామం 

* ఆరోగ్యం పరిమితుల మేరకు యోగాసన, ప్రాణాయామం, ధ్యానం రోజువారీ అభ్యాసం

* వైద్యుడికి సూచనల మేరకు శ్వాస వ్యాయామాలు.
* ప్రతిరోజూ ఉదయం లేదా సాయంత్రం సహనంతో సౌకర్యవంతమైన వేగంతో నడక. 

* సమతుల పోషకాహారం, తాజాగా వండిన తేలికైన ఆహారం. దీనిని జీర్ణం చేసుకోవడం సులభం. 

* తగినంత నిద్ర మరియు విశ్రాంతి తీసుకోండి. 

* ధూమపానం, మద్యపానం మానుకోండి. 

* కోవిడ్ కోసం సూచించిన ఔషధాలతో పాటు ఇతర వ్యాధులు ఏమైనా ఉంటె కూడా క్రమం తప్పకుండా ఆ ఔషధాలనూ తీసుకోండి,

* ప్రిస్క్రిప్షన్ విషయంలో అనుమానాలను రేకేతించే పరిస్థితులను నివారించడానికి వ్యక్తి తీసుకునే అన్ని ఔషధాల గురించి (అల్లోపతి / ఆయుష్) డాక్టర్ కు  ఎల్లప్పుడూ తెలియజేయాలి. 

* ఇంట్లో స్వీయ -ఆరోగ్య పర్యవేక్షణ - ఉష్ణోగ్రత, రక్తపోటు, రక్తంలో చక్కెర (ముఖ్యంగా డయాబెటిస్ ఉంటే), పల్స్ ఆక్సిమెట్రీ మొదలైన(వైద్యపరంగా సలహా ఇస్తే) పరీక్షలు ఎప్పటికప్పుడు చేసుకోండి  

* నిరంతరం పొడి దగ్గు / గొంతు నొప్పి ఉంటే, సెలైన్ గార్గల్స్ చేసి ఆవిరి పట్టండి. గార్గ్లింగ్ / ఆవిరి పీల్చడం కోసం మూలికలు / సుగంధ ద్రవ్యాలు అదనంగా. దగ్గు మందులు, మెడికల్ డాక్టర్ లేదా ఆయుష్ అర్హత కలిగిన వైద్యుడి సలహా మేరకు తీసుకోవాలి.

* హై గ్రేడ్ జ్వరం, శ్వాస తీసుకోకపోవడం, Sp02 <95%, చెప్పుకోలేని స్థితిలో ఛాతీ నొప్పి, గందరగోళం, ఫోకల్ బలహీనత వంటి ముందస్తు హెచ్చరిక సంకేతాలను గమనిస్తూ ఉండండి  

2. కమ్యూనిటీ స్థాయిలో

 * వ్యక్తులు తమ సానుకూల అనుభవాలను వారి స్నేహితులు, బంధువులతో సోషల్ మీడియాలో, కమ్యూనిటీ నాయకులతో పంచుకోండి. ప్రజల్లో చైతన్యం కలిగించే ధార్మిక మార్గదర్శకులకు కూడా తమ అనుభవాలు తెలియజేస్తే అపోహలను తొలగించే అవకాశం ఉంటుంది. 

* సామాజిక వర్గాల వారీగా స్వయం సహాయక బృందాలు, పౌర సమాజ సంస్థల మద్దతు తీసుకోండి. రికవరీ, పునరావాసానికి (వైద్య, సామాజిక, వృత్తి, జీవనోపాధి) కోసం అర్హత కలిగిన నిపుణుల సహాయం తీసుకోండి. 

* తోటివారిని, కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్, కౌన్సిలర్ నుండి మానసిక-సామాజిక మద్దతును పొందండి. అవసరమైతే మానసిక ఆరోగ్య సహాయ సేవను కోరండి. 

* శారీరక దూరం వంటి అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యోగా, ధ్యానం మొదలైన గ్రూప్ సెషన్స్ లో పాల్గొనండి. 

3. ఆరోగ్య సంరక్షణ కేంద్రం

* మొదటి ఫాలో-అప్ విజిట్ (నేరుగా వెళ్లి కానీ, టెలిఫోన్ ద్వారా కానీ) డిశ్చార్జ్ అయిన 7 రోజులలోపు ఉండాలి, అతను / ఆమె చికిత్స పొందిన ఆసుపత్రి అయి  ఉండాలి. 

* ఆ తర్వాత నుండి, తదుపరి చికిత్స / తదుపరి సందర్శనలు సమీప అర్హత కలిగిన అల్లోపతి / ఆయుష్ ప్రాక్టీషనర్ లేదా ఇతర వైద్య చికిత్స విధానం దగ్గరకు వెళ్ళవచ్చు. తెలియని ఔషధ వినియోగానికి సంభావ్యత ఉన్న కారణంగా పాలీ-థెరపీని నివారించాలి, ఇది తీవ్రమైన ప్రతికూల ఘటనకు కానీ, ప్రతికూల ప్రభావాలకు కానీ దారితీయవచ్చు. 

* ఇంట్లో ఐసొలేషన్ లో ఉన్న రోగులు, లక్షణాలు ఇంకా అలాగే ఉంటే, సమీప ఆరోగ్య కేంద్రానికి వెళ్ళాలి. 

* తీవ్రత ఎక్కువగా ఉన్న కేసు విషయంలో క్రిటికల్ కేర్ అవసరం. దీనికి కఠినమైన ఫాలో అప్ ఉండాలి.

 

****

 


(Release ID: 1653781) Visitor Counter : 17288