రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఈ ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో 13 శాతం వృద్ధితో 16.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసిన ఎన్‌ఎఫ్‌ఎల్
Posted On:
11 SEP 2020 1:27PM by PIB Hyderabad
నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఎన్‌ఎఫ్‌ఎల్) లక్ష్యాలను అధిగమిస్తూ ఉత్పత్తులు సాధిస్తోంది. ఈ ఆర్థిక ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో 13 శాతం వృద్ధితో 16.11 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి చేసింది. గత ఆర్థిక ఏడాది ఇదే కాలంలో ఇది 14.26 లక్షల మెట్రిక్ టన్నులు.
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఎన్‌ఎఫ్‌ఎల్, ఈ ఐదు నెలల్లో 16 శాతం వృద్ధితో 23.81 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను విక్రయించింది. గత ఆర్థిక ఏడాది తొలి ఐదు నెలల్లో అమ్మకాలు 20.57 లక్షల మెట్రిక్ టన్నులు.
కొన్నేళ్లుగా ఈ సంస్థ ఒక్క ఉత్పత్తి స్థాయి నుంచి బహుళ ఉత్పత్తుల స్థాయికి చేరుకుంది. డీఏపీ, ఎంవోపీ, ఎస్‌ఎస్‌పీ, కాంప్లెక్స్ ఎరువులు, బెంటోనైట్ సల్ఫర్, విత్తనాలు, కొత్త రకం జీవ ఎరువులు, వ్యవసాయ రసాయనాలను ఉత్పత్తి చేస్తోంది. వ్యవసాయానికి కావలసిన అన్ని ఉత్పత్తులను ఒకే వేదిక ద్వారా ఎన్‌ఎఫ్‌ఎల్ అందిస్తోంది.
పంజాబ్‌లోని నంగల్, భతిండ, హర్యానాలోని పానిపట్, మధ్యప్రదేశ్‌లోని విజయ్‌పూర్‌లో రెండు ప్లాంట్ల ద్వారా ఎన్‌ఎఫ్‌ఎల్ ఉత్పత్తులు అందిస్తోంది. ఇవికాక, విజయ్‌పూర్‌లో జీవ ఎరువులు, పానిపట్‌లో సల్ఫర్ ఉత్పత్తి ప్లాంటు ఉన్నాయి.
***
(Release ID: 1653296)
Visitor Counter : 146