హోం మంత్రిత్వ శాఖ

శ్రీ‌హ‌ర్‌మందిర్ సాహిబ్ కు ఎఫ్‌.సి.ఆర్‌.ఎ క్లియ‌రెన్సులు ఇవ్వ‌డాన్ని స్వాగ‌తించిన కేంద్ర హో్ంమంత్రి అమిత్ షా, ఇది చరిత్రాత్మ‌కం, అపూర్వం అని ప్ర‌కట‌న‌

“శ్రీ‌హ‌ర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్‌.సి.ఆర్‌.ఎని అనుమతిస్తూ శ్రీ‌న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం , శ్రీ‌ద‌ర్బార్ సాహిబ్‌కు అంత‌ర్జాతీయంగా సంఘ‌ట్‌ను సేవ‌తో మ‌రింత‌గా అనుసంధానం చేయ‌డానికి వీలు క‌ల్పిస్తుంది.”

“ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీజీకి ఆశీస్సులు ల‌భించాయి, వాహే గురూజీ ఆయ‌న నుంచి సేవ‌లు అందుకున్నారు”

“ శ్రీహ‌ర్‌మందిర్ సాహిబ్ కు సంబంధించి ఎఫ్‌.సి.ఆర్‌.ఎ నిర్ణ‌యం అపూర్వం.ఇది మ‌న సిక్కు సోద‌ర సోద‌రీమ‌ణ‌ల అద్భుత సేవా స్ఫూర్తిని మ‌రోసారి ప్ర‌ద‌ర్శించ‌నుంది.”

Posted On: 10 SEP 2020 2:37PM by PIB Hyderabad

శ్రీ‌హ‌ర్ మందిర్ సాహిబ్‌కు ఎఫ్‌.సి.ఆర్‌. ఎ క్లియరెన్సుకు అనుమ‌తివ్వ‌డాన్ని కేంద్ర హోంమంత్రి శ్రీ అమిత్ షా అపూర్వ‌మైన‌దిగా , చ‌రిత్రాత్మ‌క‌మైన నిర్ణ‌యంగా అభివ‌ర్ణించారు.
ఇందుకు సంబంధించి ట్విట్ట‌ర్ ద్వారా ఒక సందేశ‌మిస్తూ ఆయ‌న‌, “ శ్రీ ద‌ర్బార్‌సాహిబ్ దైవ‌త్వం మ‌నకు బ‌లాన్ని ఇస్తున్న‌ది. ద‌శాబ్దాలుగా ప్రపంచ‌వ్యాప్తంగా ఉన్న సంఘ‌ట్ అక్క‌డ సేవ చేయ‌లేక పోతున్న‌ది.శ్రీ‌హ‌ర్‌మందిర్ సాహిబ్‌కు ఎఫ్‌.సి.ఆర్‌.ఎను అనుమ‌తిస్తూ శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌భుత్వం తీసుకున్న నిర్ణ‌యం అంత‌ర్జాతీయంగా ఉన్న సంఘ‌ట్‌ను శ్రీ ద‌ర్బారీ సాహిబ్‌తో సేవ ద్వారా మ‌రింత అనుసంధానం చేయ‌నుంది.ఇది ఎంతో ఆనంద‌గ‌ర స‌మ‌యం” అని ఆయ‌న పేర్కొన్నారు.
“ ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రంద్ర మోదీకి వాహే గురూజీ ఆశీస్సులు ల‌భించాయి. గురూజీఆయ‌న నుంచి సేవ పొందారు. హ‌ర్‌మందిర సాహిబ్‌కు ఎ ఫ్‌.సి.ఆర్‌.ఎ అనుమ‌తిస్తూ తీసుకున్న నిర్ణ‌యం ఎంతో గొప్ప‌ది. ఇది మ‌న సిక్కు సోద‌ర సోద‌రీమ‌ణుల సేవా స్ఫూర్తిని మ‌రోసారి చాట‌నుంది ” అని ఆయ‌న పేర్కొన్నారు.
కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ బుధ‌‌వారం సెప్టెంబ‌ర్ 9,2020న పంజాబ్ లోని స‌చ్‌ఖండ్‌శ్రీ హ‌ర్ మందిర్ సాహిబ్‌, శ్రీ ద‌ర్బార్ సాహిబ్ కు రిజిస్ట్రేష‌న్ మంజూరు చేసింది.ఈ అసోసియేష‌న్ ఫారిన్ కంట్రిబ్యూష‌న్ రెగ్యులేష‌న్ యాక్ట్ (ఎఫ్‌సిఆర్ ఎ)2010 కింద రిజిస్ట్రేష‌న్‌కు 27-05-2020 న ప్ర‌భుత్వానికి ద‌ర‌ఖాస్తు చేసుకుంది. ఈ రిజిస్ట్రేష‌న్ , జారీ చేసిన తేదీ నుంచి ఐదు సంవ‌త్స‌రాల పాటు ఉంటుంది.
 పంజాబ్ లోని స‌చ్‌ఖండ్ శ్రీ హ‌ర్‌మందిర్‌ సాహిబ్‌, శ్రీ ద‌ర్బార్ సాహిబ్ కు ఎఫ్ సిఆర్‌.ఎ రిజిస్ట్రేష‌న్ మంజూరు చేయ‌డానికి ముందు ఈ సంస్థ ద‌ర‌ఖాస్తును 2010 ఎఫ్‌సిఆర్ె నిబంధ‌న‌లు, ఫారిన్ కంట్ర్రిబ్యూష‌న్ (రెగ్యులేష‌న్ ) రూల్సు2011 (ఎఫ్‌సిఆర్ ఆర్‌)కు అనుగుణంగా ప‌రిశీలించ‌డం జ‌రిగింది.
సంబంధిత వ‌ర్గాల నుంచి అవ‌స‌ర‌మైన స‌మాచారాన్నిస్వీకరించి, అసోసియేష‌న్ ద‌ర‌ఖాస్తుతోపాటు స‌మ‌ర్పించిన ప‌త్రాల‌ను ప‌రిశీలించిన మీద‌ట‌,ఈ సంస్థ ఎఫ్‌సిఆర్ఎ 2010 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా ఉంద‌ని నిర్థార‌ణ అయింది.
స‌చ్‌ఖండ్ శ్రీ హ‌ర్‌మందిర్ సాహిబ్‌, శ్రీ ద‌ర్బార్ సాహిబ్ పేరుతోగ‌ల ఈ అసోసియేష‌న్  పంజాబ్‌లోని అమృత్‌స‌ర్‌లో గ‌ల స్వ‌ర్ణ‌దేవాల‌యానికి సంబంధించిన‌ది. దీనిఇన 1925లో సిఖ్ గురుద్వారా చ‌ట్టం 1925 కింద, ప్ర‌జ‌ల‌కు,భ‌క్తుల‌కు ఉ చితంగా 24 గంట‌లూ  ,ఆహారాన్ని అందించేందుకు, పేద‌లు  , అవ‌స‌ర‌మైన వారికి , విద్యార్ధుల‌కు ఆర్థిక స‌హాయం అందించ‌డానికి, అవ‌స‌ర‌మైన వారికి వైద్య చికిత్స అందించ‌డానికి ప్ర‌కృతి విప‌త్త‌లు స‌మ‌యంలో సేవ‌లు అందించ‌డానికి ఏర్పాటు చేశారు. ఈ ల‌క్ష్యాల సాధ‌న‌కు అసోసియేష‌న్‌కు దేశీయంగా విరాళాలు అందుతున్నాయి.అయితే ప్ర‌స్తుతం కేంద్ర హోంమంత్రిత్వ‌శాఖ వారి అనుమ‌తితో ఈ అసోసియేష‌న్ విదేశీ కంట్రిబ్యూష‌న్లు అందుకోవ‌డానికి అవ‌కాశం ఉంటుంది. ఈ విరాళాల‌ను ఎఫ్‌సిఆర్ ఎ 2010 నిబంధ‌న‌ల‌కు అనుగుణంగా నిర్దేశిత ల‌క్ష్యాల‌కు వాడ‌డానికి వీలు క‌లుగుతుంది.

***

 


(Release ID: 1653259)