రాష్ట్రప‌తి స‌చివాల‌యం

రాష్ట్రపతికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 'లెటర్ ఆఫ్ క్రెడెన్స్‌' సమర్పించిన సింగపూర్ హై కమిషనర్‌

प्रविष्टि तिथि: 10 SEP 2020 12:14PM by PIB Hyderabad

భారత్‌లో సింగపూర్‌ హై కమిషనర్‌గా నియమితుడైన సైమన్ వాంగ్ వీ కుయెన్ సమర్పించిన 'లెటర్‌ ఆఫ్‌ క్రెడెన్స్‌'ను రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ అంగీకరించారు.

    సింగపూర్‌ హై కమిషనర్‌కు రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల సార్వత్రిక ఎన్నికలను విజయవంతంగా నిర్వహించినందుకు సింగపూర్‌ ప్రభుత్వాన్ని అభినందించారు. రెండు దేశాల మధ్య గాఢమైన బంధం ఉందని గుర్తు చేశారు. ఐరాస భద్రత మండలి సహా వివిధ ఫోరాల్లో భారత్‌కు మద్దతు తెలుపుతున్నందుకు ఆ దేశానికి కృతజ్ఞతలు తెలిపారు. కొవిడ్‌ సమయంలో పరస్పర సహకారం, రెండు దేశాల స్నేహం, నమ్మకాన్ని మరింత బలోపేతం చేసిందని రాష్ట్రపతి కోవింద్‌ చెప్పారు.

***


(रिलीज़ आईडी: 1652945) आगंतुक पटल : 158
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Manipuri , Bengali , Punjabi , Tamil , Malayalam