సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ఖాదీ యొక్క ఇ-మార్కెట్ పోర్టల్ బహుళ ప్రచారం పొందుతోంది.

భారతీయులు ఇప్పుడు "లోకల్ కోసం వోకల్" పాటిస్తున్నారు.

Posted On: 09 SEP 2020 11:48AM by PIB Hyderabad

ఆన్ లైన్ మార్కెటింగ్ విభాగం లో అడుగుపెట్టిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (కె.వి.ఐ.సి) ఆనతి కాలంలోనే, పాన్-ఇండియా రీచ్‌ను ఏర్పాటు చేసింది. కె.వి.ఐ.సి. ఇ-పోర్టల్ - www.kviconline.gov.in/khadimask/ ద్వారా, కళాకారులు తమ ఉత్పత్తులను, భారతదేశంలోని మారుమూల ప్రాంతాలకు విక్రయించడానికి వీలు కలిగింది.  ఈ ఏడాది జూలై 7వ తేదీన కేవలం ఖాదీ ఫేస్ మాస్కులతో ప్రారంభించిన ఆన్‌లైన్ అమ్మకం ఈరోజున 180 ఉత్పత్తులతో పూర్తి స్థాయి ఇ-మార్కెట్ వేదికగా అభివృద్ధి చెందింది. భవిష్యత్తులో మరెన్నో ఉత్పత్తులు చేరడానికి సిద్ధంగా ఉన్నాయి.

కె.వి.ఐ.సి. ప్రకారం, ఉత్పత్తి పరిధిలో ముస్లిన్, శిల్కు, డెనిమ్, నూలు వంటి చేతితో వడికిన, చేతితో అల్లిన చక్కటి వస్త్రాలు, రితు బెరి ద్వారా స్త్రీ,పురుషులకు పనికివచ్చే విచార్ వస్త్రాలు, ఖాదీకి ప్రత్యేకమైన చేతి గడియారం,  వివిధ రకాల తేనె, హెర్బల్ మరియు గ్రీన్ టీ, మూలికలతో తయారుచేసిన మందులు మరియు సబ్బులు, అప్పడాలు, కచ్చి ఘని ఆవ నూనె తో పాటు మూలికలతో తయారుచేసిన సౌందర్య సాధనాలు వంటి ఇంకా అనేక వస్తువులు ఉన్నాయి.  కె.వి.ఐ.సి. తన ఆన్ ‌లైన్ వస్తువుల జాబితాకు ప్రతిరోజూ కనీసం 10 కొత్త ఉత్పత్తులను జతచేస్తోంది.  ఈ ఏడాది అక్టోబర్ 2వ తేదీ నాటికి కనీసం 1000 ఉత్పత్తులను జోడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.  రెండు నెలల కన్నా తక్కువ వ్యవధిలో, కె.వి.ఐ.సి.  దాదాపు 4,000 మంది వినియోగదారులకు సేవలు అందించింది.

కె.వి.ఐ.సి. చైర్మన్, శ్రీ వినయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ,  ఖాదీ ఉత్పత్తుల యొక్క ఆన్‌లైన్ అమ్మకం “స్వదేశీ” కి పెద్ద ప్రోత్సాహంతో పాటు, స్థానిక చేతివృత్తులవారిని శక్తివంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.  “ఖాదీ యొక్క ఈ-మార్కెట్ పోర్టల్ మన చేతివృత్తులవారికి వారి వస్తువులను విక్రయించడానికి ఒక అదనపు వేదికను అందుబాటులోకి తెచ్చింది.  ఇది ఆత్మ నిర్భర్ భారత్ నిర్మాణానికి ఒక దృఢమైన అడుగు ”అని సక్సేనా అన్నారు.  ఉత్పత్తి శ్రేణిని జోడించడం వల్ల అన్ని వర్గాల కొనుగోలుదారుల ఎంపిక మరియు స్థోమతను దృష్టిలో ఉంచుకుని వీటి ధరలను 50 రూపాయల నుండి 5,000 వరకు నిర్ణయించడం జరిగింది. 

"ఖాదీ సంస్థల యొక్క మునుపటి ఉత్పత్తులు అవుట్లెట్ల ద్వారా మాత్రమే అమ్ముడయ్యేవి. అందువల్ల అవి కొన్ని రాష్ట్రాల వారికి మాత్రమే అందుబాటులో ఉండేవి.  అయితే, కె.వి.ఐ.సి. యొక్క E- పోర్టల్ ద్వారా ఆ ఉత్పత్తులు ఇప్పుడు దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా చేరుతున్నాయి.  ఆవిధంగా, ఖాదీ సంస్థలకు విస్తృత మార్కెటింగ్ కల్పించడంతో, తద్వారా, వాటి ఉత్పత్తి పెరుగుతోంది మరియు చేతివృత్తులవారి ఆదాయం కూడా పెరుగుతోంది. 

ఖాదీ ఉత్పత్తులను ఆన్ ‌లైన్ ద్వారా విక్రయించడంపై వినియోగదారులు కూడా చాలా సంతృప్తి వ్యక్తం చేశారు.  ఢిల్లీ లోని కన్నాట్ ప్లేస్‌లో ఉన్న ఖాదీ ఇండియా అవుట్‌లెట్ నుండి ఉత్పత్తులను కొనుగోలు చేసే ఒక సాధారణ ఖాదీ వినియోగదారుడు,  తాను బదిలీపై వెళ్లిన అస్సాంలో అవే ఉత్పత్తులను కనుగొనలేకపోయాడు.  అయితే, ఇప్పడు, ఈ-మార్కెట్ వేదిక ద్వారా అతనికి కావలసిన ఉత్పత్తులను ఆన్ ‌లైన్‌లో ఆర్డర్‌ చేయడానికి మరియు అతని ఇంటి వద్దనే స్వీకరించడానికి వీలు కలిగింది. 

31 రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాల నుండి కె.వి.ఐ.సి. కి ఆన్ ‌లైన్ ఆర్డర్లు వస్తున్నాయి. వీటిలో సుదూర ప్రాంతాలైన అండమాన్, నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, కేరళ, హిమాచల్ ప్రదేశ్ మరియు జమ్మూ & కశ్మీర్ ఉన్నాయి. సరుకులను ఉచితంగా పంపిణీ చేయడానికి కె.వి.ఐ.సి. కనీస ఆర్డర్ విలువను 599 రూపాయలుగా నిర్ణయించారు.  ఇది స్పీడ్ పోస్ట్ ద్వారా సరుకులను పంపిణీ చేయడానికి పోస్టల్ శాఖతో ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ -పోర్టల్ ‌ను స్వయంగా అభివృద్ధి పరచుకోవడం ద్వారా కోట్ల రూపాయలను ఖజానాకు ఆదా చేసినట్లు, కె.వి.ఐ.సి. తెలియజేసింది.  ఈ ప్రక్రియ కె.వి.ఐ.సి. స్వంతంగా అభివృద్ధి చేసిన పి.ఎమ్.ఈ.జి.పి. ఈ-పోర్టల్ మాదిరిగానే ఉంటుంది. దీంతో, వెబ్ ‌సైట్ అభివృద్ధి మరియు నిర్వహణపై కనీసం 20 కోట్ల రూపాయలు ఆదాచేసినట్లైంది. 

కె.వి.ఐ.సి. ఆన్‌లైన్ జాబితాలో మోడి కుర్తా మరియు పురుషుల కోసం మోడీ జాకెట్లు మరియు పాలాజ్జో మరియు మహిళలకు స్ట్రెయిట్ ప్యాంట్లు కూడా ఉన్నాయి.  ఖాదీ రుమాలు, సుగంధ ద్రవ్యాలు, మూలికా వేప కలప దువ్వెన, షాంపూ, సౌందర్య సాధనాలు, ఆవు పేడ మరియు ఆవు మూత్రంతో తయారుచేసిన సబ్బు,  యోగా దుస్తులతో పాటు అనేక రకాల రెడీ-టు-ఈట్ ఫుడ్ మొదలైనవి ఇప్పటివరకు చేర్చబడ్డాయి.

*****



(Release ID: 1652636) Visitor Counter : 159