ప్రధాన మంత్రి కార్యాలయం

జయ్ పుర్ లో పత్రికా గేట్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ‘సంవాద్ ఉపనిషద్’, ‘అక్షర యాత్ర’ పుస్తకాల ను కూడా ఆయన ఆవిష్కరించారు

అంతర్జాతీయ స్థాయి లో వివిధ సాహితీ పురస్కారాలను భారతీయ సంస్థలు అందించాలి: ప్ర‌ధాన మంత్రి

సమాజానికి కేవలం పత్రికా రచయిత గా సానుకూల తోడ్పాటు ను అందించడం అనేది ఓ అవసరమే కాక, ఒక వ్యక్తి గా కూడా అది ఆవశ్యకమే: ప్ర‌ధాన మంత్రి

ఉపనిషత్తులకు సంబంధింన జ్ఞానం, వేదాలకు సంబంధించిన చింతన అనేది ఒక్క ఆధ్యాత్మిక ఆకర్షణ మాత్రమే కాదు, విజ్ఞానం తాలూకు ఒక దృష్టికోణం కూడా: ప్ర‌ధాన మంత్రి

Posted On: 08 SEP 2020 2:25PM by PIB Hyderabad

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జయ్ పుర్ లో పత్రికా గేట్ ను ప్రారంభించారు.  ప్రధాన మంత్రి పత్రికా గ్రూపు చైర్ మన్ శ్రీ గులాబ్ కొఠారీ రచించిన ‘సంవాద్ ఉపనిషద్’, ‘అక్షర యాత్ర’ అనే రెండు పుస్తకాల ను కూడా  ఆవిష్కరించారు.
 
ఈ సందర్భం లో ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, ఈ గేటు రాజస్థాన్ సంస్కృతి ని ప్రతిబింబిస్తోందని, ఇది దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించే ఒక ప్రధానమైన కేంద్రంగా మారగలదని పేర్కొన్నారు.
 
తాను ఆవిష్కరించిన రెండు గ్రంథాలను గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావిస్తూ, అవి భారతీయ సంస్కృతి కి, భారతీయ తత్వ శాస్త్రానికి నిజమైన ప్రాతినిధ్యం వహిస్తున్నాయన్నారు.  రచయితలు సమాజానికి శిక్షణ ఇవ్వడం లో ఒక గొప్ప పాత్ర ను పోషిస్తారు అని ఆయన చెప్పారు. 

ప్రతి సీనియర్ స్వాతంత్ర్య సమర యోధుడు రచనలు చేసే వారని, వారు తమ రచనలతో ప్రజల కు మార్గదర్శకత్వం చేయడం లో పాలుపంచుకొన్నారని ప్రధాన మంత్రి గుర్తుచేశారు.

భారతీయ సంస్కృతి, భారతీయ నాగరికత, విలువల ను పరిరక్షించడం లో పత్రికా గ్రూపు చేస్తున్న కృషి ని ఆయన ప్రశంసించారు.

పత్రికారచన కు పత్రికా గ్రూపు వ్యవస్థాపకుడు శ్రీ కర్పూర్ చంద్ర కులీశ్ అందించిన తోడ్పాటు ను, అలాగే వేదాలకు సంబంధించిన విజ్ఞానాన్ని సమాజం లో వ్యాప్తి చేయడం కోసం ఆయన చేసిన ప్రయత్నాలను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు.

కులీశ్ జీవితాన్ని గురించి, కులీశ్ నాటి కాలాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావిస్తూ, ప్రతి ఒక్క పత్రికారచయిత క్రియాశీలత్వం తో పని చేయాలంటూ హితవు పలికారు.  వాస్తవానికి ప్రతి ఒక్కరు క్రియాశీల భావన తో  కృషి చేయాలి, అలా కృషి చేసినప్పుడు ఆ వ్యక్తి సమాజానికి ఎంతో కొంత సార్థకమైన పని ని చేయగలుగుతారని ప్రధాన మంత్రి చెప్పారు. 

తాను ఆవిష్కరించిన రెండు పుస్తకాల ను గురించి ప్ర‌ధాన మంత్రి ప్రస్తావిస్తూ, వేదాల లో ఉల్లేఖించిన ఆలోచనలు కాలానికి అతీతం అయినవి, అంతే కాదు అవి మొత్తం మానవ జాతి  కోసం ఉద్దేశించినవి అని వివరించారు.  ‘సంవాద్ ఉపనిషద్’, ‘అక్షర యాత్ర’ పుస్తకాల ను ఎక్కువ మంది చదువుతారన్న ఆకాంక్ష ను ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

మన నవ తరం గంభీరమైన జ్ఞానం నుండి దూరం కాకూడదని ప్రధాన మంత్రి ఉద్ఘాటించారు.  వేదాలు, ఉపనిషత్తులు ఒక్క ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారాలు మాత్రమే కాదు, అవి శాస్త్రీయ జ్ఞాన నిధులు కూడా అని ఆయన అన్నారు. 

పేద ప్రజలను అనేక వ్యాధుల బారి నుంచి కాపాడడం కోసం వారికి మరుగుదొడ్లు అందించడానికి ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ అవసరం ఎంతయినా ఉందని కూడా ప్రధాన మంత్రి ప్రముఖం గా పేర్కొన్నారు. మాతృమూర్తులను, సోదరీమణులను వంట ఇంటి పొగ బారి నుండి రక్షించడమే లక్ష్యంగా అమలు అవుతున్న ‘ఉజ్వల పథకం’ ప్రాముఖ్యాన్ని గురించి, అలాగే ప్రతి ఇంటికి నీటిని అందించే ‘జల్ జీవన్ మిషన్’ ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు. 

ప్రజలకు అసాధారణమైన సేవ చేసినందుకు, కరోనా ను గురించి జాగృతి ని పెంచినందుకు భారతీయ ప్రసార మాధ్యమాల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.  ప్రసార మాధ్యమాలు ప్రభుత్వ చర్యలను చురుకుగా క్షేత్ర స్థాయికి చేరవేస్తున్నాయని, అలాగే ప్రభుత్వ చర్యల లోని లోపాలను గురించి కూడా చెప్తున్నాయని  ప్రధాన మంత్రి అన్నారు.

స్థానికంగా ఉత్పత్తి అయిన వస్తువులను ఆదరించాలని (‘వోకల్ ఫర్ లోకల్) స్పష్టం చేస్తున్న ‘‘ఆత్మ నిర్భర్ భారత్’’ ప్రచారోద్యమానికి ప్రసార మాధ్యమాలు ఒక ఆకృతి ని ఇస్తున్నాయంటూ ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.  ఈ భావన ను మరింతగా విస్తరించవలసిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు.  భారతదేశంలో స్థానికంగా తయారుచేసే ఉత్పత్తులు ప్రపంచ విపణి కి చేరుతున్నాయని, అయితే భారతదేశ వాణి సైతం మరింత గా ప్రపంచవ్యాప్తం కావాలని ఆయన పునరుద్ఘాటించారు.

భారతదేశం చెప్పే విషయాలను ప్రపంచం ఇప్పుడు మరింత శ్రద్ధగా వింటోందని ఆయన అన్నారు.  అటువంటి పరిస్థితిలో, భారతీయ ప్రసార మాధ్యమాలు కూడా ప్రపంచ శ్రేణి కి ఎదగవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. అంతర్జాతీయ స్థాయి లో ఇచ్చే భిన్న సాహిత్య పురస్కారాలను భారతీయ సంస్థలు కూడా ఇవ్వాలని ఆయన అన్నారు.

శ్రీ కర్పూర్ చంద్ర కులీశ్ గౌరవార్థం అంతర్జాతీయ పత్రికారచన పురస్కారాన్ని ప్రారంభించినందుకు పత్రికా గ్రూపు ను ప్రధాన మంత్రి అభినందించారు. 


***



(Release ID: 1652409) Visitor Counter : 164