మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ

మూడవ 'పోషణ్ మాహ్' 2020 సెప్టెంబర్ లో జరుపుకుంటున్నాము

Posted On: 06 SEP 2020 6:34PM by PIB Hyderabad

వ రాష్ట్రీయ పోషణ్  మాహ్ 2020 సెప్టెంబర్ నెలలో జరుపుకుంటారు. 2018 లో ప్రారంభించిన పోషాన్ అభియాన్ (సంపూర్ణ పోషణ పై పిఎమ్ సమగ్ర పథకం) కింద  ప్రతి సంవత్సరం పోషణ్  మాహ్ ను జరుపుకుంటారు. మహిళాశిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ నోడల్ శాఖగాజాతీయ స్థాయిరాష్ట్రాలు / యుటిలుజిల్లాలుకింది స్థాయి వరకు భాగస్వామ్య మంత్రిత్వ శాఖలువిభాగాలతో కలిసి పోషణ్  మాహ్ నిర్వహిస్తారు. జన్ అందోళన్ ద్వారా  'జన్ భాగిధారిని కలిగించి చిన్నపిల్లలుమహిళలలో పోషకాహారలోపాన్ని లేకుండా చేయడంప్రతి ఒక్కరికీ ఆరోగ్యం మరియు పోషణను నిర్ధారించడం పోషణ్  మాహ్ లక్ష్యం. 

మన జీవితాల్లో పోషకాహారం ప్రాముఖ్యతను ఇటీవల ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రముఖ కార్యక్రమం మన్ కి బాత్” తాజా ఎడిషన్‌లో 30 ఆగస్టు 2020 న ప్రత్యేకంగా ప్రస్తావించారు. పిల్లలువిద్యార్థులు గరిష్ఠ స్థాయిలో శక్తి సమకూర్చడానికి పోషకాహారం పోషించే పాత్ర పై ప్రధాని ప్రసంగంలో ఆలోచనను పంచుకున్నారు. గత కొన్నేళ్లుగా ముఖ్యంగా గ్రామాల్లో పోషకాహార వారం & పోషణ మాసం (పోషణ్  మాహ్) లో ప్రజల భాగస్వామ్యం పోషకాహార అవగాహనను ఒక పెద్ద ఉద్యమంగా మారుస్తున్నట్లు ఆయన తెలిపారు. 

2020 ఆగస్టు 27 న మంత్రిత్వ శాఖ సమావేశానికి కేంద్ర మహిళాశిశు అభివృద్ధివస్త్ర శాఖల మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ అధ్యక్షత వహించారు. మహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రామ్ మోహన్ మిశ్రా అన్ని రాష్ట్రాలుయుటిలతో పోషణ్ మాహ్ తో సమ్మిళతమయ్యే కార్యక్రమాల గురించి మాట్లాడారుఅతి తీవ్రమైన పోషకాహార లోపం (సామ్) పిల్లలను గుర్తించడంవారి నిర్వహణ తో పాటు  పోషణ్ వాటికాస్న్యూట్రీ గార్డెన్స్ ని అభివృద్ధి చేయడం వంటి కార్యకలాపాలుచేపడతారు. తల్లి పాల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పనతో పాటుపుట్టిన బిడ్డ మొదటి 1000 రోజులలో మంచి పోషణ అవసరాలుయువతులు, పిల్లలలో రక్తహీనతను తగ్గించే చర్యలు మొదలైనవి ఈ కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. .

దేశంలో ప్రబలంగా ఉన్న కోవిడ్ నేపథ్యంలోమహిళా, శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ పోషణ్ మాహ్ వేడుకలు జరుపుకోవడానికి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించమని వాటాదారులందరినీ ప్రోత్సహిస్తోంది. సోషల్ మీడియాఆన్‌లైన్ కార్యకలాపాలుపాడ్‌కాస్ట్‌లుఇ-సంవాద్  మొదలైనవి మన జీవితంలో పోషకాహారం ప్రాముఖ్యత గురించి పరిజ్ఞానాన్నిసమాచారాన్ని వ్యాప్తి చేయడానికి విస్తృతంగా వినియోగిస్తారు. మంత్రిత్వ శాఖ ఒక వెబ్‌నార్ సిరీస్‌ను కూడా నిర్వహిస్తోందిదీనిలో మహిళలు, పిల్లలకు ఆరోగ్యంపోషణ కి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై విషయ నిపుణులు మరియు ఆరోగ్య నిపుణులు అవగాహన కల్పిస్తారు. 

*****


(Release ID: 1651908) Visitor Counter : 296