సూక్ష్మ, లఘు, మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖష్
ఇండియాను ఆత్మనిర్భర్ చేయడానికి , అగర్‌బత్తీల తయారీకి చేతివృత్తుల వారికి పెద్ద ఎత్తున మద్దతునిస్తున్న భారత ప్రభుత్వం
గతంలో 200 అగర్‌బత్తీ తయారీ యంత్రాలు అందించగా ప్రస్తుతం మరో 400 ఆటోమేటిక్ అగర్‌బత్తీ తయారీ యంత్రాలను అందించనున్నారు.
5000 మంది చేతి వృత్తుల వారికి ప్రయోజనం కలిగించేందుకు స్పూర్తి కార్యక్రమం కింద 50 కోట్ల రూపాయలతో పది క్లస్టర్ల ఏర్పాటు.
యంత్రాల తయారీ, ఉత్పత్తి ,ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు కన్నౌజ్‌లో ఒక కేంద్రం ఏర్పాటుతో పాటు మొత్తం రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సుల ఏర్పాటు.
అగర్ బత్తీలను చేతితో తయారు చేసే వారికి, వలస కార్మికులకు ప్రాధాన్యత .
ఇంతకు ముందు 2.66 కోట్లుగా ఉన్న ఈ కార్యక్రమాన్ని 55 కోట్ల రూపాయల స్థాయికి పెంపు.
ఈ కార్యక్రమాన్ని అమలు చేయనున్న కె.వి.ఐ.సి.
Posted On:
06 SEP 2020 11:49AM by PIB Hyderabad
అగర్ బత్తీ తయారీ రంగంలో ఉన్న చేతివృత్తుల వారికి తోడ్పాటుతోపాటు, అగర్ బత్తి పరిశ్రమకు మద్దతు నిచ్చేందుకు,వారికి మరింతగా చేరువయ్యేందుకు, సూక్ష్మ చిన్న, మధ్యతరహా పరిశ్రమల సంస్థ (ఎం.ఎస్.ఎం.ఇ) సమగ్ర విధానాన్ని అనుసరిస్తోంది. ఆ దిశగా స్టేక్ హోల్డర్లందరి ప్రయోజనాలను కాపాడేందుకు కృషిచేస్తోంది.ఇందుకు సంబంధించి 2020 సెప్టెంబర్ 4 న కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 30.7.2020న ప్రారంభించిన మద్దతు కార్యక్రమానికి అదనంగా, మంత్రిత్వశాఖ కేవలం యంత్రాలను సరఫరా చేయడమేకాక, ఈ పరిశ్రమకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించింది.
ఇందులో ముడిపదార్ధాలు, ముడి సరుకు సరఫరా కూడా ఉంది. వీటికి గత ఏడాదిలో బాగా డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం చేపట్టిన కొత్త కార్యక్రమంలోని నాలుగు ప్రధాన స్తంభాలు ఇలా ఉన్నాయి.-
1)చేతివృత్తుల వారికి నిరంతర శిక్షణ ద్వారా మద్దతు, ముడిసరకు, మార్కెటింగ్, ఆర్ధిక మద్దతు కల్పించడం.
2) ఈ ఉత్పత్తికి సంబంధించి అన్నిపార్శ్వాలను పరిశీలించడం జరిగింది. అంటే పరిమళంలో, ప్యాకేజింగ్‌లో వినూత్నత , కొత్త లేదా ప్రత్యామ్నాయ ముడి పదార్ధాల వినియోగం, తిరిగి వాడదగ్గ పూల వినియోగం, కాయిర్‌పిత్ వంటి వాటిని వాడడం, వ్యవసాయ మంత్రిత్వ శాఖతో కలిసి వెదురు కర్రల సరఫరా వంటి చర్యలు పరిశీలించడం జరిగింది. ఇందుకోసం ఒక సెంటర్ ఫర్ ఎక్సలెన్సును కన్నౌజ్‌లో ఫ్లేవర్,ఫ్రాగ్రెన్స్ డవలప్‌మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేయనున్నారు.
3)ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ వారి స్ఫూర్తి (స్కీమ్ ఆఫ్ ఫండ్ ఫర్ రీ జనరేషన్ ఆప్ ట్రెడిషనల్ ఇండస్ట్రీస్) పథకం కింద పది క్లస్టర్ల 50 కోట్లరూపాయల వ్యయంతో ఏర్పాటుచేస్తారు. 5000 మంది చేతివృత్తుల వారికి సుస్థిర ఉపాధి, రాబడి పెంపునకు ఇది వీలు కల్పిస్తుంది.
4) ఈ రంగానికి సంబంధించి యంత్రాల తయారీ సామర్ధ్యాన్ని పెంచనున్నారు. దేశంలో స్వావలంబన సాధించేందుకు ,వివిధ రకాల ఉత్పత్తుల తయారీకి సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటుచేయనున్నారు. 2.20కోట్లరూపాయలవ్యయంతో ఐఐటిలు ఎన్.ఐ.టిలతో కలిసి వీటిని ఏర్పాటు చేస్తారు.
2020 సెప్టెంబర్ 4న ప్రకటించిన విస్తారిత పథకం కింద గతంలో ఉన్న 200 యంత్రాలకు అదనంగా 400 ఆటోమేటిక్ అగర్‌బత్తి తయారీ యంత్రాలను, పెడల్ ద్వారా పనిచేసే 500 యంత్రాలను స్వయం సహాయక బృందాలకు (ఎస్.హెచ్.జి) ఇవ్వడం జరుగుతుంది. అలాగేదేశవ్యాప్తంగా వ్యక్తులకు 20 పైలట్ ప్రాజెక్టులను అమలుచేస్తారు. ఇందుకు తగిన మార్కెటింగ్ సదుపాయం, ముడిసరకు సరఫరా టై అప్ లు ఏర్పాటు చేస్తారు. ఈ కార్యక్రమం తక్షణం 1500 మంది చేతివృత్తుల వారికి సుస్థిర ఉపాధి కల్పించి రాబడి పెంచడానికి ఉపకరిస్తుంది. చేతితో అగర్‌బత్తీలను తయారు చేసే చేతివృత్తుల వారికి , వలస కూలీలకు ఈ కార్యక్రమం కింద ప్రాధాన్యత ఇస్తారు.
ఈ రంగంలో ఇండియాను ఆత్మనిర్భర్ చేసేందుకు, ఈ కార్యక్రమం మొత్తం సైజును 55 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. ఇందులో 3.45 కోట్లరూపాయలతో 1500 మంది చేతివృత్తుల వారికి తక్షణ మద్దతు, 2.20 కోట్లరూపాయల వ్యయంతో ఐఐటిలు,ఎన్ఐటిలతో కలిసి రెండు సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్సు ఏర్పాటు ఉన్నాయి. ఇందులో ఒకటి ఎఫ్.ఎఫ్.డి.సి కన్నౌజ్ . అలాగే 10 స్ఫూర్తి క్లస్టర్లను 50 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తారు.ఇది అదనంగా 5000మంది చేతివృత్తుల వారికి ప్రయోజనం చేకూరుస్తుంది. ఇంతకు ముందు ఈ కార్యక్రమ స్థాయి 2.66 కోట్ల రూపాయలుగా ఉండి 500 మంది చేతివృత్తుల వారికి వర్తించేదిగా ఉండేది.
ఎం.ఎస్.ఎం.ఇ మంత్రిత్వశాఖ కింద గల చట్టబద్ధసంస్థ ఖాదీ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి) , ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తుంది. అలాగే చేతివృత్తులవారికి,స్వయం సహాయక బృందాలకు అవసరమైన మద్దతు ను అందిస్తుంది.
ఈ ప్రాజెక్టులు అగర్‌బత్తీ పరిశ్రమకు మరింత ఊతం ఇవ్వనున్నాయి. అలాగే అగర్‌బత్తీ తయారీకి సంబంధించి అన్నిరకాలుగా దేశీయ సామర్ధ్యాన్నిపెంచడంతోపాటు , ఎగుమతులు పెంచేందుకు , ఎంటర్ ప్రెన్యుయర్లకు, చేతివృత్తుల వారికి ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఇది ఉపకరిస్తుంది.
******
(Release ID: 1651845)
Visitor Counter : 245
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam