ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో 30 లక్షలకు పైగా కోలుకున్న కోవిడ్ బాధితులు

వెంటిలేటర్లమీద 0.5 % లోపు, ఐసియు లో 2%, ఆక్సిజెన్ మీద 3.5% లోపు

Posted On: 04 SEP 2020 3:18PM by PIB Hyderabad

కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న " పరీక్షించి, ఆనవాలు పట్టు, చికిత్స అందించు" అనే వ్యూహం ఫలితంగా కోవిడ్ మరణాల సంఖ్య గణనీయంగా తగ్గటం తెలిసిందే. ప్రత్యేక దృష్టితో చికిత్స అందించటం వలన కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరుగుతూ వస్తోంది. చికిత్సకు మార్గదర్శకాలు రూపొందించి రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రామాణీకృత చికిత్సావిధానాలు అందించి పర్యవేక్షించటం వలన కోలుకుంటున్నవారి సంఖ్య బాగా పెరిగింది.

ఒకవైపు కోలుకుంటున్నవారు పెరుగుతూ ఊండటమే కాకుండా, మరణాల సంఖ్య అంతర్జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం కూడా భారత్ లో తీసుకుంటున్న జాగ్రత్తలకు నిదర్శనంగా నిలుస్తోంది. దీంతో ప్రస్తుతం మరణాల శాతం 1.74% గా నమోదైంది. ఇది చికిత్సలో ఉన్నవారిలో చాలా తక్కువశాతం. అలా చూసినప్పుడు చికిత్సలో ఉన్నవారిలో కూడా వెంటిలేటర్లమీద 0.5 % లోపు, ఐసియు లో 2%, ఆక్సిజెన్ మీద 3.5% లోపు ఉండటాన్ని బట్టి కోలుకునేవారి సంఖ్య మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి.  ఈ చర్యలన్నిటి ఫలితంగా భారత్ లో కోవిడ్ నుంచి కోలుకున్నవారి సంఖ్య ఈ రోజుకు 30 లక్షలు (30,37,151)  దాటింది.

 Image

గడిచిన 24 గంటల్లో 66,659 మంది కోలుకోగా, వరుసగా ఎనిమిదో రోజు కూడా దేశంలో రోజుకు 60000 మందికి పైగా కోలుకుంటున్నట్టు తేలింది.  కోవిడ్ బాధితులలో కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 77.15% కు చేరింది. కొద్ది నెలలుగా ఇలా కోలుకున్నవారి సంఖ్య స్థిరంగా పెరుగుతూ వస్తోంది. అలా కోలుకున్నవారు పెరిగేకొద్దీ, చికిత్సలో ఉన్నవారికీ, కోలుకున్నవారికీ మధ్య తేడా కూడా విస్తరిస్తూ వస్తోంది. ఈ అంతరం నేటికి  22 లక్షలు దాటింది. దీంతో ఇప్పుడు దేశంలో ఉన్న బాధితుల సంఖ్య 8,31,124  గా నిలిచింది. ఇది మొత్తం పాజిటివ్ కేసులలో 21.11 శాతం.

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

****



(Release ID: 1651299) Visitor Counter : 174