ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో రోజువారీ కోవిడ్ పరీక్షల భారీ పెరుగుదల

గడిచిన 24 గంటల్లో 11.7 లక్షల పరీక్షలు ఇప్పటిదాకా 4.5 కోట్ల పరీక్షలు పూర్తి

Posted On: 03 SEP 2020 11:59AM by PIB Hyderabad

గత రెండు రోజులుగా రోజుకు పది లక్షలకు పైగా పరీక్షలు చేస్తూ భారత్ దూకుడు మరింత పెంచింది. రోజువారీ పరీక్షలు భారీగా పెరుగుదల నమోదు చేసుకుంటున్నాయి. గడిచిన 24 గంటల్లో 11.7  లక్షలకు పైగా  (11,72,179) పరీక్షలు జరిపారు. దీంతో ఇప్పటివరకు జరిపిన మొత్తం కోవిడ్ పరీక్షల సంఖ్య 4.5 కోట్లకు  (4,55,09,380) పైబడింది.భారత్ లో ఏ స్థాయిలో కోవిడ్ పరీక్షలు పెరుగుతూ ఉన్నయే ఈ సంఖ్యలు చాటుతున్నాయి. జనవరి 30 న రోజుకు 10  పరీక్షలు మాత్రమే జరపగలిగే స్థితి నుంచి ఇప్పుడు రోజువారీ సగటు 11  లక్షలు దాటింది.

 

WhatsApp Image 2020-09-03 at 10.40.39 AM.jpeg

రోజుకు జరిపే పరీక్షల సంఖ్య భారత్ ను ప్రపంచంలోనే అత్యున్నతంగా నిలిపింది. ఆ విధంగా పెద్ద ఎత్తున పరీక్షలు చేపట్టటం వలన తొలిదశలోనే బాధితులను గుర్తించటం సాధ్యమవుతోంది. దానివలన లక్షణాలున్నవారిని ఐసొలేషన్ లో ఉంచటం, తీవ్ర లక్షణాలు కనబడితే ఆస్పత్రులకు తరలించి చికిత్స అందించటం సాధ్యమవుతోంది. ఫలితంగా, మరణాల శాతం బాగా తక్కువగా ఉంటోంది. ఎక్కువ పరీక్షలు జరిపేకొద్దీ పాజిటివ్ కేసుల సంఖ్యను కూడా బాగా తగ్గిస్తోంది. పరీక్షల సంఖ్య పెరగటానికి లాబ్ ల నెట్ వర్క్ ను విస్తృతం చేయటం ప్రధానకారణం. భారత్ లో ఇప్పుడు లాబ్ ల సంఖ్య 1623కి చేరుకోగా, అందులో 1022 ప్రభుత్వ ఆధ్వర్యంలోను, 601 ప్రైవేట్ ఆధ్వర్యంలోను ఉన్నాయి. 

రకరకాల లాబ్ ల వివరాలు ఇలా ఉన్నాయి:

తక్షణం ఫలితాలు చూపే ఆర్ టి పిసిఆర్ పరీక్షల లాబ్స్ :  823(ప్రభుత్వ:  465   + ప్రైవేట్:  358)

ట్రూ నాట్ ఆధారిత పరీక్షల లాబ్స్ : 678 (ప్రభుత్వ: 523 + ప్రైవేట్: 155)

సిబినాట్ ఆధారిత పరీక్షల లాబ్స్: 122 (ప్రభుత్వ: 34  + ప్రైవేట్ : 88 )

అత్యాధునికమైన Cobas 6800/8800 సహా యంత్ర సామగ్రిని ఐదు చోట్ల ఏర్పాటు చేశారు. పాట్నాలోని ఐసిఎంఆర్ రాజేంద్ర మెమోరియల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, కోల్ కతా లోని ఐసిఎం ఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ కలరా, ఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్, ముంబై లోని ఐసిఎంఆర్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్  రీసెర్చ్ ఇన్ రిప్రొడక్టివ్ హెల్త్, నోయిడాలోని ఐసిఎంఆర్- నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ కాన్సర్ ప్రివెన్షన్ అండ్ రీసెర్చ్ అందులో ఉన్నాయి. వీటిలో రోజుకు వెయ్యికి పైగా పరీక్షలు జరిపే సామర్థ్యం ఉంది.

 

కోవిడ్ -19 మీద సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, సూచనలతో కూడిన కచ్చితమైన తాజా సమాచారం కోసం క్రమం తప్పకుండా https://www.mohfw.gov.in/ మరియు  @MoHFW_INDIA ను సందర్శించండి

కోవిడ్ -19 కు సంబంధించిన సాంకేతికమైన అనుమానాలుంటే technicalquery.covid19[at]gov[dot]in కు పంపవచ్చు. ఇతర సమాచారం కావాల్సినవారు ncov2019[at]gov[dot]in మరియు @CovidIndiaSeva ను సంప్రదించవచ్చు

కోవిడ్ -19 మీద ఏవైనా ప్రశ్నలుంటే ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్ లైన్ నెంబర్  +91-11-23978046 లేదా టోల్ ఫ్రీ నెంబర్ 1075 కు ఫోన్ చేయవచ్చు. వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల హెల్ప్ లైన్ నెంబర్ల కోసం   https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf

 

****


(Release ID: 1650948) Visitor Counter : 206