ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో జాతీయ సగటును దాటిన రికవరీ రేటు
దేశంలో వరుసగా ఈరోజు 6 వ రోజు కూడా రోజుకు 60 వేలకుపైగా రికవరీలు
ప్రస్తుత కోవిడ్ కేసుల కన్నా 2.1 మిలియన్లు దాటిన కోలుకున్న కేసులు
Posted On:
02 SEP 2020 4:57PM by PIB Hyderabad
దేశంలో కోవిడ్ నుంచి మొత్తం కోలుకున్న కేసులు ఈరోజుకు 29 లక్షలు దాటాయి ( 29,01,908).
గత 17 రోజులలో పది లక్షల కేసులు కోలుకోగా , అంతకు ముందు 22 రోజులలో 10 లక్షల మంది కోలుకున్నారు.
కోవిడ్ -19 నిర్వహణలో ఇండియా సాధించిన చెప్పుకోదగిన ప్రగతి, కోలుకున్న పేషెంట్ల సంఖ్య నానాటికి పెరుగుతుండడం. ఇండియాలో కోలుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుండడంతో , గణనీయ మైన సంఖ్యలో ఆస్పత్రినుంచి డిశ్చార్జి అవుతున్నారు. అలాగే ఇంటి ఐసోలేషన్ నుంచి బయటపడుతున్నారు.
2020 మే నెల నుంచి కోలుకున్న వారి సంఖ్య 58 రెట్లు పెరిగింది. 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జాతీయ సగటు కంటే ఎక్కువ రికవరీ రేటును నమోదు చేశాయి. మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల నుంచి మొత్తం రికవరీ అయిన పేషెంట్లలో 30 శాతం వరకు ఉన్నారు.
గత కొన్నినెలలుగా కోలుకుంటున్న వారిశాతం క్రమంగా పెరుగుతున్నది. రోజువారీ రికవరీలు పెరుగుతుండడంతో, ఇండియాలో ఈ రోజు వరుసగా 6 వ రోజు కూడా 60 వేల మందికి పైగా కోవిడ్ నుంచి కోలుకున్నారు.గత 24 గంటలలో 62,026 కేసులు కోలుకోవడంతో ఇండియాలో కోవిడ్ పేషెంట్ల రికవరీ రేటు మరింత మెరుగు పడి 76.89 శాతానికి చేరింది. ఇది నిరంతరం పురోగతిలో ఉంది.
కోలుకున్న కేసుల సంఖ్య, ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల కన్నా 21 లక్షలు ఎక్కువగా ఉంది. జూలై మొదటి వారం నుంచి ఆగస్టు నెల ఆఖరు వరకు వారపు సగటు కోలుకున్న పేషెంట్ల సగటు నాలుగు రెట్లు పెరిగింది.
కోవిడ్ -19 కి సంబంధించి తాజా , అధీకృత సమాచారం , దీనికి సంబంధించిన సాంకేతిక అంశాలు, మార్గదర్శకాలు, ఇతర సూచనల కోసం క్రమం తప్పకుండా గమనించండి : https://www.mohfw.gov.in/,@MoHFW_INDIA .
కోవిడ్ -19 కి సంబంధించి సాంకేతిక అంశాలపై తమ ప్రశ్నలను technicalquery.covid19[at]gov[dot]in ఈమెయిల్‌కు పంపవచ్చు. ఇతర ప్రశ్నలను ncov2019[at]gov[dot]in కు అలాగే @CovidIndiaSeva కు పంపవచ్చు
కోవిడ్ -19పై ఏవైనా ప్రశ్నలకు సమాధానాల కోసం కేంద్ర ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ హెల్ప్‌లైన్ నెంబర్ : +91-11-23978046 లేదా 1075 (టోల్ ఫ్రీ) కు ఫోన్ చేయవచ్చు. కోవిడ్ -19 పై రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల హెల్ప్‌లైన్ ల జాబితా కోసం కింది లింక్‌ను గమనించవచ్చు.https://www.mohfw.gov.in/pdf/coronvavirushelplinenumber.pdf .
***
(Release ID: 1650708)
Visitor Counter : 233
Read this release in:
English
,
Marathi
,
Hindi
,
Punjabi
,
Malayalam
,
Assamese
,
Bengali
,
Urdu
,
Manipuri
,
Gujarati
,
Tamil