ఆర్థిక మంత్రిత్వ శాఖ

ముద్రణకు సంబంధించిన కార్యకలాపాలపై ఆర్ధికపరమైన సూచనలు

అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ప్రభుత్వ రంగ సంస్థలు / ప్రభుత్వ రంగ బ్యాంకులు గతంలో ముద్రించిన క్యాలెండర్లు, డైరీలు వంటి ఇతర సామాగ్రిని ఇప్పుడు డిజిటల్ రూపంలో మాత్రమే రూపొందించాలి.

డిజిటల్ లేదా ఆన్‌లైన్ పద్ధతులను ఉపయోగించడానికి మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ప్రభుత్వ రంగ సంస్థలు / ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రభుత్వానికి చెందిన అన్ని ఇతర సంస్థలు వినూత్న మార్గాలను అవలంబించాలి.

Posted On: 02 SEP 2020 3:56PM by PIB Hyderabad

ఉత్పాదకత కోసం డిజిటల్ ఫోర్సు -మల్టిప్లైయర్‌ లను అమలుపరిచే దిశగా ప్రపంచం ఎక్కువగా కదులుతున్న పరిస్థితుల నేపథ్యంలో, భారత ప్రభుత్వం కూడా ఈ ఉత్తమ పద్ధతిని అనుసరించాలని నిర్ణయించింది.

ఏ మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ప్రభుత్వ రంగ సంస్థలు / ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రభుత్వానికి చెందిన అన్ని ఇతర సంస్థలు రాబోయే సంవత్సరంలో వాల్ క్యాలెండర్లు, డెస్కు ‌టాప్ క్యాలెండర్లు, డైరీలు వంటి మరి ఏ ఇతర వస్తువులను ముద్రించడం కోసం ఎటువంటి కార్యాచరణ చేపట్టకూడదు. 

అటువంటి కార్యకలాపాలన్నీ డిజిటల్ మరియు ఆన్ ‌లైన్ విధానంలోనే చేపట్టాలి. 

ఇటువంటి విషయాలలో వినూత్న పద్ధతులను చేపట్టడానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలి.  ప్రణాళిక, షెడ్యూలింగ్ మరియు అంచనా కోసం సాంకేతిక ఆవిష్కరణలను ఉపయోగించడం ఆర్థికంగా, సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. 

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  మరియు ఆయన పాలనా విధానం ఎల్లప్పుడూ సాంకేతికతను ఒక శక్తివంతమైన విధానంగా భావించారు.  మన పనిలో సాంకేతికతను సమగ్రపరచడం ఆయన దృష్టి కోణానికి అనుగుణంగా ఉంటుంది.

అందువల్ల, గతంలో భౌతిక రూపంలో ముద్రించిన అన్ని క్యాలెండర్లు, డైరీలు, షెడ్యూలర్లు వంటి ఇతర సామాగ్రిని ఇప్పుడు డిజిటల్ రూపంలో తయారుచేయాలి. కాఫీ టేబుల్ పుస్తకాల ముద్రణ కూడా నిలిపివేసి, ఈ -పుస్తకాల సరైన ఉపయోగాన్ని ప్రోత్సహించాలి.  అన్ని మంత్రిత్వ శాఖలు / విభాగాలు / ప్రభుత్వ రంగ సంస్థలు /  ప్రభుత్వ రంగ బ్యాంకులు మరియు ప్రభుత్వానికి చెందిన అన్ని ఇతర సంస్థలు డిజిటల్ లేదా ఆన్‌లైన్ పద్ధతులను ఉపయోగించటానికి వినూత్న మార్గాలను అవలంబించాలి. భౌతిక క్యాలెండర్లు లేదా డైరీల మాదిరిగానే ఫలితాన్ని సాధించే వినూత్న డిజిటల్ మరియు ఆన్ లైన్ పరిష్కారాలకు ప్రాధాన్యతనిచ్చి,  వాటిని ఆచరణలో పెట్టాలి

 

సంబంధించిన వారందిరికీ అవసరమైన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. (దయచేసి చూడండి).  

*****


(Release ID: 1650706) Visitor Counter : 198